– హైదరాబాద్ కు మహర్దశ పట్టనుంది.
– ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ కు మహర్దశ పట్టనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. గురువారం సోమాజిగూడ బూత్ లెవల్ మీటింగ్ లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
ఈ సమావేశానికి బూత్ లెవల్ ఇంచార్జ్లు, డివిజన్ బూత్ కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.మంత్రి తుమ్మల మాట్లాడుతూ బూత్ స్థాయి కార్యకర్తలకు ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు సమగ్రంగా పని చేయాలని సూచనలు, దిశానిర్దేశం ఇచ్చారు.
స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి తుమ్మల , ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం చేస్తూనే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, అదనంగా హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
హైదరాబాద్ పై పూర్తి అవగాహన గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించి మరింత బలపడాలని పిలుపునిచ్చారు. అందరూ ఐకమత్యంతో కలిసి పని చేసి అత్యధిక మెజార్టీతో విజయాన్ని సాధించాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంగీత రియాజ్ ఎలక్షన్ ఇన్ ఛార్జ్ పాల్గొన్నారు.