– స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసిన రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు జీవో విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సమాజం తరుపున ధన్యవాదాలు. బీసీ బిడ్డకాకపోయినా రాహుల్ గాంధీ మాట కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు అసెంబ్లీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపినా పట్టించుకోలేదు. బిల్లు ఆమోదం కోసం జంతర్ మంతర్ లో ధర్నా చేశాం. .. బీసీ పక్షపాతి గా రేవంత్ రెడ్డి జీవో తీసుకువచ్చారు.
2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తు చట్టం చేసినా గవర్నర్ ఆమోదించలేదు… బీజేపీ నాయకులు ప్రధాని మోదీ దగ్గర మాట్లాడలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఎన్నికలకు వెళ్లాలని మా ప్రభుత్వం జీవో జారీ చేసింది. .. రిజర్వేషన్ల కారణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు అనేక అవకాశాలు రాబోతున్నాయి.. బీసీ లపైన రేవంత్ రెడ్డి అపార ప్రేమ చూపించారు.. బీసీల గుండె చప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి విన్నారు..