ముంబై..
భారతదేశ ఆర్థిక రాజధాని..
అత్యంత సంపన్నులు..
సామాన్య మానవులు
వందలు..వేల సంఖ్యలో
జీవించే మహానగరం..!
బాలీవుడ్ స్టార్స్..
వ్యాపార దిగ్గజాలు..
బడా బడా
పారిశ్రామికవేత్తలు..
సాప్ట్ వేర్ దిగ్గజాలు..
దేశ గమనాన్ని శాసించగలిగే
రాజకీయ ప్రముఖులు..
ఇలా ఎందరికో ఆలవాలమైన
ప్రపంచ ప్రసిద్ధ నగరం..!
మిగిలిన అనేక
విశేషాలతో పాటు
బాలీవుడ్ సినిమాకి
వేదిక ఈ ముంబై..
ఈ మహానగరం ప్రసిద్ధి గాంచడానికి హిందీ సినిమా
పరిశ్రమ కూడా పెద్ద కారణం..
అలాంటి బాలీవుడ్
ఇప్పుడు పూర్తిగా
కొన్ని శక్తులు..
ఒకరకంగా మాఫియా చేతుల్లో నడుస్తోంది.
కొన్ని తీవ్రవాద సంస్థలు బొంబాయి చిత్రపరిశ్రమను
శాసిస్తున్న భయంకర పరిస్థితులు నడుస్తున్నాయి.
సినిమాలకు ఆయా సంస్థలు
పెట్టుబడులు పెట్టడం..
కథ నుంచి ప్రతి విషయంలో వాటి ప్రమేయం ఉండడం మామూలు విషయం.అలాగే
బాలీవుడ్ ప్రముఖుల నుంచి
ఉద్దేశ పూర్వకంగానో.. బలవంతంగానో కొన్ని సంస్థలకు..వాటిలో నిషేధిత సంస్థలకు ముడుపులు అందుతుండడం
సాధారణ విషయం..!
అలాంటి ముంబై గురించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం…
పన్ను ఎగవేతలు
ముంబై నగరం నల్ల ధనం సృష్టిలో అగ్రగామి..
పన్ను ఎగవేతకు మార్గాల అన్వేషణలో ఈ నగరానికి చెందిన చిన్న వ్యాపారి నుంచి బడా పారిశ్రామికవేత్త
వరకు అందరివీ అందె వేసిన చేతులే..!ఇది వందల కోట్ల రూపాయల్లో ఉంటుందంటే నోళ్ళు వెళ్ల బెట్టాల్సిన పనిలేదు..ఎందుకంటే వారికి
ఇది సాధారణ విషయం!
పాకిస్తాన్ పర్యటనలు
మన బాలీవుడ్ ప్రముఖులు ఎందరికో పాకిస్తాన్..
బంగ్లాదేశ్ లో రాజకీయ నాయకులు..సినీ పెద్దలతో
సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.వాటిని పురస్కరించుకుని వారు పాకిస్తాన్..బంగ్లాదేశ్ తో పాటు టర్కీ వంటి దేశాలకు పర్యటనలు చేస్తుంటారు.
వారికి వీసాలు క్షణాల్లో జారీ అయిపోతుంటాయి.!
సంప్రదాయాలపై యుద్ధం
కొన్ని సంస్థల ప్రమేయంతో తీసే సినిమాల్లో మన సనాతన సంప్రదాయాలను
హేళన చెయ్యడం..
వాటికి వ్యతిరేకంగా సన్నివేశాలు చొప్పించడం షరామామూలే!
ఇదంతా జీహాదీల అజమాయిషీలో నడుస్తుంది.
విష సంస్కృతులు
పనిలో పనిగా
విష సంస్కృతులు కొన్ని గొప్పవన్నట్టు జొప్పించడం..
వాటి గురించి యువతలో చాప కింద నీరులా ప్రచారం చెయ్యడం పరిపాటి..
అలాంటి వాటిలో స్వలింగ సంపర్కం..ఇద్దరు స్త్రీలు లేదా పురుషులు పెళ్లి చేసుకోవడం..సహజీవనం చెయ్యడం వంటి దుస్సంప్రదాయాలను చూపించడం ఇక్కడ మామూలు విషయం…!
విలన్లే హీరోలు
సమాజానికి కీడు చేసే…
దేశాన్ని విచ్ఛిన్నం చేసే
కొందరు వ్యక్తులను హీరోలుగా చేసి సినిమాలు తియ్యడం బాలీవుడ్ లో చాలాకాలం నుంచి జరుగుతున్న విషయం..
ఇప్పుడది చాలా మామూలు విషయం అయిపోయింది.
సైనికులు దుర్మార్గుల్లా..
అదే సమయంలో
మన జవాన్లు..
ఇతర అధికారులు..
నిజాయితీ గల వ్యక్తులను దుర్మార్గులుగా
చిత్రీకరించడం..
వారి అరాచకాల కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమై పోయినట్టు గోరంతలు కొండంతలు చేసి చూపించడం బాలీవుడ్లో నిత్యకృత్యం!
విదేశాల్లో ఆస్తులు
ముంబై ప్రముఖులకు
దుబాయ్..స్విట్జర్లాండ్..
సింగపూర్ వంటి దేశాల్లో
కోట్ల రూపాయల
విలువ చేసే
ఆస్తులు ఉన్నాయి.
అవి వారుగా కొనుక్కున్నవి..లేదా ముడుపులుగా ముట్టినవి..
ఇలాంటి దురంతాలు..
దురాగతాలపై ప్రభుత్వాల ఆధ్వర్యంలోని
నిఘా సంస్థలు ఇప్పటికైనా
ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఇవేవీ ఆయా సంస్థలకు
తెలియనివి కావు.
ప్రభుత్వంలోని పెద్దల నుంచి ఒత్తిళ్లు..సరైన సమయంలో
ఆదేశాలు లేకపోవడం..
చర్యలు తీసుకున్న నిజాయితీ అధికారులకు బదలీ బహుమానాలు..
సమాచారం చేరవేతలు..
ఇంకా ఇంకా ఎన్నెన్నో అకృత్యాలు..
ఇలా అయితే ఈ దేశం బాగుపడేదెన్నడు..
మన యువత పెడదారి
పట్టకుండా ఆపేదెలా..!?
– సురేష్ కుమార్ ఇ
7995666286
9948546286