– ఎన్నికల ముందు పెండింగ్ డిఏ ను తక్షణమే చెల్లిస్తామన్నారు
– ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం
– ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు?
– కమిషన్లకు బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల.. ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి
– కాంగ్రెస్ అభయహస్తం కాదు భస్మాసుర హస్తం
– కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి 14 డిఏలు, ఐదు సరెండర్ లీవులు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటు
– 5500 కోట్ల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించింది
– క్వింటాల్ గోధుమలకు 160 మద్దతు ధర పెంచి, వరికి మాత్రం 69 రూపాయలు పెంచుతారా?
– తెలంగాణ బిజెపి ఎంపీలారా.. రైతుల పక్షాన నిలబడతారా? కేంద్రానికి కొమ్ము కాస్తారా?
– సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట: ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 3% డిఏను మంజూరు చేస్తూ తీపి కబురు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు పెండింగ్ లో ఉన్న రెండు డీఏలను తక్షణమే చెల్లిస్తాము అని అన్నారు..
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అయిదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంది సీత కన్ను. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగులు అంటే చిన్న చూపు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడలేని విధంగా 42 శాతం పీఆర్సీ అందించిన ఘనత కేసిఆర్ ది. రెండోసారి 31 శాతం పీఆర్సీ కేసీఆర్ ఇచ్చారు.. కెసిఆర్ మొత్తం 73% పిఆర్సి ఇచ్చారు. కరోనా కంటే ముందు ఎప్పటి డిఏ అప్పుడే ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని డిఏలను తక్షణమే చెల్లిస్తాం, ఉద్యోగుల ఏరియాస్ అన్ని తక్షణమే ఇస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకుని వస్తాం, ఆరు నెలల్లో పీఆర్సీ అందిస్తామన్నారు. నీవి బడాబడా మాటలు.. ఓట్లు ఐపోయినాక గజనీకాంత్ మాటలు. దేశ చరిత్రలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డిఏలు పెండింగ్‌లో లేవు. ఐదు డిఏలు పెండింగ్‌లో పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది..ఉద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వివక్షకు ఇదే నిదర్శనం.
22 నెలలు గడుస్తున్నా పీఆర్సీ, డిఏ ప్రస్తావనే లేదు.పీఆర్సీ ఊసెత్తితే ఉద్యోగులపై ఉరిమురిమి చూస్తున్నావు రేవంత్ రెడ్డి.దసరా పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి, డిఏ ప్రకటిస్తుందేమో అని ఆశగా చూశారు. వారిని తీవ్ర నిరాశకు గురి చేశారు. అభయహస్తం కాస్త భస్మాసుర హస్తం అయింది. పోలీస్ కానిస్టేబుల్ లకు సరెండర్ లీవ్ వస్తే ఆ డబ్బుతో పిల్లల ఫీజులు కట్టుకుంటారు.
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీస్ సిబ్బందికి 5 ఏరియాస్ పెండింగ్ ఉన్నాయి. ఐదు సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి.. ఈరోజు 14 డీఎలు పెండింగ్ ఉన్నాయి. ఐదు సరెండర్ లీవ్‌లు పెండింగ్ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్‌కు 75 వేల రూపాయలు అలవెన్స్ కేసీఆర్ గారు అందించారు. పోలీస్ గౌరవాన్ని కాపాడారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కి చాలా అలవెన్స్ బంద్ చేసింది. పోలీస్ వాహనాల్లో పెట్రోల్ పోసే పరిస్థితి లేదు. పెట్రోల్ బంకుల్లో బకాయిలు చెల్లిస్తేనే పెట్రోల్ పోస్తామని పోలీసులను బెదిరించే పరిస్థితి వచ్చింది.పోలీసుల సరెండర్ లీవులు ఇవ్వకపోతివి, డిఏలు ఇవ్వకపోతివి, పోలీస్ స్టేషన్ అలవెన్స్ బందు పెడితివి, చివరికి వాహనాల్లో పెట్రోల్, డీజిల్ కి కూడా డబ్బులు లేకుండా చేస్తివి.
ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ సరెండర్ లీవులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హోంగార్డులపై మొదటి సంతకం పెట్టి పర్మినెంట్ చేస్తా అన్నావ్. 12000 ఉన్న హోంగార్డు జీతాన్ని 29 వేలకు కేసీఆర్ పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చి 75 రూపాయలు పెంచిండు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లకు అడిషనల్ అలవెన్స్ కూడా కేసీఆర్ ప్రభుత్వమే అందించింది. ఏ రకంగా రేవంత్ రెడ్డి పోలీసులను వాడుకొని మోసం చేస్తున్నాడో మీరు గ్రహించాలి.
పోలీసుల పెండింగ్ డిఏలు, సరెండర్ లీవులు చెల్లించాలని పోలీసుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా ధర్నాలో వెళ్ళినప్పుడు వాళ్ల బాధలు మాకు వచ్చి చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పాత పెన్షన్ స్కీమ్ ను తెస్తాం అని హామీ ఇచ్చారు.
ఓల్డ్ పెన్షన్స్ స్కీం గురించి ఎందుకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం లేదు?. ఓల్డ్ పెన్షన్ స్కీం దేవుడెరుగు కనీసం ఇప్పుడున్న సిపిఎస్ ని కూడా రేవంత్ రెడ్డి కతం చేసిండు. 15 నెలల నుండి ఉద్యోగుల వేతనాల నుంచి పెన్షన్ కోసం కట్ చేసిన కాంట్రిబ్యూటరీ ఫండ్ ని ప్రభుత్వం వాడుకున్నది. 5500 కోట్ల కాంట్రిబ్యూటర్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించింది. డబ్బే లేకపోతే రేపు పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తారు.
ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ డబ్బులు ప్రభుత్వం ఎలా వాడుకుంటుంది అని ఉద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, చిరు ఉద్యోగుల గురించి చెప్పనవసరం లేదు. మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేవు. తెలంగాణలో పెద్ద పండుగ దసరాకు జీతాలు లేక పండుగ చేసుకోని పరిస్థితుల్లో చిరు ఉద్యోగులు ఉన్నారు.
రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలు, నాలుగు నెలలు, ఆరు నెలల జీతం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో కాస్మోటిక్ లకు, వాచ్మెన్ లకు నెలల తరబడి జీతం చెల్లించడం లేదు. ఫారెస్ట్ లో పనిచేసే వాచ్ గాడ్లకు 12 నెలల నుంచి జీతాలు రావడం లేదు.
ఆశా వర్కర్లను రోడ్డెక్కించారు. రేషన్ డీలర్లు కూడా మూడో తారీకు నుండి రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నారు. రాష్ట్రంలో హాస్పటళ్లు బందు, కాలేజీలు బందు, రేషన్ షాపులు బందు. ఆరోగ్యశ్రీ డబ్బులు సంవత్సరం నుండి చెల్లించడం లేదని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి. కాలేజీలో ఫీజు రీ ఇంబర్స్మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని కాలేజీలు బందు పెడుతామంటున్నారు.
కెసిఆర్ ఉండగా 20000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించారు. రేషన్ షాపుల్లో కమిషన్లు పెంచుతామన్నాడు. జీతం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పి మరీ మోసం చేశాడు. కేసీఆర్ ఇచ్చిన కమిషన్ ని కూడా ఐదు నెలల నుంచి రేవంత్ సర్కార్ చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు. దేవాలయాల్లో ఉండే అర్చకులకు ధూపదీప నైవేద్యాన్ని కూడా ఈ ప్రభుత్వం మూడు నెలల నుండి డబ్బు చెల్లించడం లేదు.
ఆడబిడ్డలకు చీరల్లేవు. రైతులకు యూరియా లేదు. సన్నబడ్లకు బోనస్ రాదు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. విద్య భరోసా కార్డు రాదు. గురుకులాల్లో విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టలేవు.
కేవలం మీరు చేసేది కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకోవడం. రేవంత్ రెడ్డికి మాత్రం బిల్డింగ్ కట్టాలంటే ముందే కమిషన్ ఇయాల్సిందే. కమిషన్లకు రిబేట్ లేదు ఇన్స్టాల్మెంట్ లేదు. ఉద్యోగులకు అడుగడుగునా డబ్బులు లేవంటడు. లేని ఫోర్త్ సిటీకి 5,000 కోట్లతో 6లైన్ రోడ్ వేస్తాడు. మూసిలో గోదావరి నీళ్లు వేయడానికి ₹7,000 కోట్లకి టెండర్ పిలుస్తాడు. హెచ్ఎండిఏలో 10,000 కోట్ల టెండర్లు పిలుస్తాడు.
రేవంత్ రెడ్డి వచ్చినంక 22,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఐదు పది పర్సెంట్ కమిషన్ ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 750 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఎఫ్ డబ్బులు పిఆర్సి డబ్బులు క్లియర్ చేస్తామని అన్నాడు. ఏమైందని నిలదీసిన ఉద్యోగ సంఘాల నాయకులను ఏసీబీ రైడ్లు చేయిస్తా అని బెదిరిస్తున్నడు. డి ఎ అంటే డియర్ నెస్ అలవెన్స్. రేవంత్ రెడ్డి మాత్రం డిఏ అంటే డోంట్ అస్క్ అంటున్నాడు.
ఈ ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నాం.
1. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డిఏలను విడుదల చేయాలి.
2. ఉద్యోగుల పిఆర్సి ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నా.
3. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలి.
4. ఉద్యోగుల అలవెన్స్‌లు, ఏరియస్ పెండింగ్ లో ఉన్న వాటిని విడుదల చేయాలి.
5. ఇచ్చిన మాట ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీంని పునరుద్దరించాలి.
6. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 5500 కోట్లను తక్షణమే తిరిగి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
7. చిరు ఉద్యోగులు, ఆశాలు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, అర్చకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా.
8. కాంట్రాక్టు ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
9. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డును అమలు చేయాలి.
ఉద్యోగులకు మా విజ్ఞప్తి
రేవంత్ రెడ్డి బెదిరింపులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ పాత్ర గొప్పది. ఉపాధ్యాయ ఉద్యోగులు మీ పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తుంది.
ఈరోజు కేంద్ర ప్రభుత్వం గోధుమల మద్దతు ధరను పెంచింది. బిజెపి ప్రభుత్వం ఎప్పుడు దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్నది. గోధుమల మద్దతు ధర పెంచారు సంతోషం. దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు ఎందుకు మద్దతు ధర పెంచరు. క్వింటాల్ గోధుమలకు 160 మద్దతు ధర పెంచి 2585 రూపాయలకు బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది.
వరి విషయంలో మాత్రం 69 రూపాయలు పెంచి , 2369 రూపాయలకు మాత్రమే నిర్ణయించారు. గోధుమలకు నీతి వరికో నీతి ఎందుకు? ఉత్తర భారత దేశ రైతులకు ఒక నీతి దక్షిణ భారతదేశ రైతులకు ఒక నీతి. ఎందుకు దక్షిణ భారతదేశ రైతులంటే బిజెపికి చిన్న చూపు?. గోధుమలతో సమానంగా వరికి మద్దతు ధర ఇవ్వాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.