– అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డి జాగీర్ ఏమైనా పోతుందా?
– పీజేఆర్ వారసత్వాన్ని నవీన్ యాదవ్ కొనసాగిస్తారు
– ఎర్రగడ్డ డివిజన్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సానుభూతితో బీఆరెస్ ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోంది. గత సంప్రదాయాలను తుంగలో తొక్కింది కేసీఆర్. సెంటిమెంట్ పేరుతో బీఆరెస్ నేతలు మీ ముందుకు వస్తున్నారు. 2007 లో పీజేఆర్ ఆకస్మికంగా చనిపోతే ఏకగ్రీవంగా చేయాలంటే అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కెసీఆర్. ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని మూడు గంటలు బయట నిలబెట్టి కేసీఆర్ అవమానించాడు.
పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టి సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కేసీఆర్. కారు షెడ్డుకు పోయిందని బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు . జూబ్లీహిల్స్ లో సమస్యలు పేరుకుపోవడానికి కారణం నువ్వు మీ అయ్య కాదా కేటీఆర్? పదేళ్లు అధికారంలో ఉన్న మీరు సమస్యలు పరిష్కరించి ఉంటే జూబ్లీహిల్స్ కు ఈ పరిస్థితి వచ్చేదా?
పదేళ్లు అధికారంలో ఉన్న మీరు మైనారిటీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 70 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. ఈ బస్తీల్లో రేషన్ కార్డులు ఇచ్చింది మేం కాదా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నది కాంగ్రెస్ కాదా? ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నది మేం కాదా?
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది నిజం కాదా? ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని, సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన కేటీఆర్.. సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా? సొంత చెల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతారంటే నమ్ముతారా?
కంటోన్మెంట్ ఉపఎన్నికలో శ్రీ గణేష్ ను గెలిపించగానే ఆ నియోజకవర్గాన్ని 4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం.
జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ ను గెలిపించండి. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డి జాగీర్ ఏమైనా పోతుందా? ఎందుకు అడ్డుకోవాలని చూశారు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ పనిచేసింది. ఇప్పుడు బీజేపీ వాళ్లు బీఆరెస్ ను గెలిపించేందుకు పనిచేస్తున్నారు.
కేంద్రంలో ప్రతీ సందర్భంలో మోదీకి కెసీఆర్ మద్దతు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు మేలు జరుగుతుంది. మీ బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించండి. ఎమ్మెల్యేగా నవీన్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. పీజేఆర్ తరువాత జూబ్లీహిల్స్ కు నాయకుడు లేకుండాపోయారు. పీజేఆర్ వారసత్వాన్ని నవీన్ యాదవ్ కొనసాగిస్తారు. పేదలకు అండగా ఉంటారు.