– భారత్ బయోటెక్ మ్యానేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా, సిడిఓ రేచస్ ఎల్లాతో మంత్రి లోకేష్ భేటీ
విశాఖపట్నం : ప్రపంచ మానవాళిని కోవిద్ వంటి మహామ్మారి నుంచి కాపాడిన అంతర్జాతీయస్థాయి వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ భారత్ బయోటెక్ మ్యానేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా, చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్లాతో మంత్రి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల నారా లోకేష్ భేటీ అయ్యారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ (కోవిడ్ – 19), రోటావాక్ (రోటా వైరస్), టైప్ బార్ టిసివి (టైఫాయిడ్ వ్యాక్సిన్), జెన్వాక్ (జపనీస్ ఎన్సెఫలిటీస్) వంటి వ్యాక్సిన్లను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా 80దేశాలకు సరఫరా చేస్తోంది.
సుమారు రూ.3వేలకోట్ల వార్షికాదాయం కలిగిన ఈ సంస్థ వ్యాక్సిన్ల తయారీలో భారత్ లో టాప్-3లో ఒకటిగా ఉంది. ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా, లాటిన్ అమెరికా వంటి దేశాలకు ప్రధానంగా వ్యాక్సిన్ ఎగుమతి చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… అన్నివిధాలా అనుకూలతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు. ఈ సందర్భంగా రేచస్ ఎల్లా మాట్లాడుతూ… ప్రస్తుతం తాము మలేరియా, చికెన్ గున్యా, జికా వైరస్ వంటి పాండమిక్ వ్యాధులకు వైరస్ తయారీ పై పరిశోధనలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.