– పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు
– బీహార్ లో ఓట్ చోరీ అంటూ రాహూల్ గాంధీ గగ్గోలు
– తెలంగాణలో ఎమ్మెల్యే చోరీ జరుగుతోంది
– రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?
– గడ్డం ప్రసాద్ కుమార్ ధర్మాత్ముడు, మంచి వ్యక్తి – రేవంత్ రెడ్డి ఆధిపత్యానికి దళిత స్పీకర్ బలి
– కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా
– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: రాహుల్ గాంధీ రాజ్యాంగ సంరక్షకుడినని చెప్పుకుంటూ దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇక్కడ తెలంగాణ లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతోంది. స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతోంది. రేవంత్ రెడ్డి చిల్లర డ్రామా నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాపాడుతామని కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. కోర్టులు,రాజ్యాంగం అంటే ప్రభుత్వానికి నమ్మకం లేదు.
రాష్ట్రంలో అనుముల రాజ్యాంగం నడుస్తోంది. రీజనబుల్ టైమ్ అంటే ఎప్పటి వరకు ఉంటుందో చెప్పాలి? గడ్డం ప్రసాద్ కుమార్ ధర్మాత్ముడు,మంచి వ్యక్తి. రేవంత్ రెడ్డి స్పీకర్ పై అజమాయిషీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు.
కొత్త సంవత్సరం జైల్లో గడుపుతారా అని చీఫ్ జస్టిస్ అడిగారు. బీహార్ లో ఓట్ చోరీ అంటూ రాహూల్ గాంధీ గగ్గోలు పెట్టారు. తెలంగాణలో ఎమ్మెల్యే చోరీ జరుగుతోంది. వెస్ట్ బెంగాల్ లో ముకుల్ రాయ్ బీజేపీ నుంచి గెలిచి తృణామూల్ కాంగ్రెస్ పార్టీలో చేరితే హైకోర్టు అనర్హత వేటు వేసింది.స్పీకర్ అంటే శాసనసభకు ప్రతినిధి. చీఫ్ జస్టిస్ మాటలు తెలంగాణ ఎమ్మెల్యేలకు అవమానం. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లతో గెలిచి సంబురాలు చేసుకుంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దమ్ముంటే అనర్హత వేటు వేయించండి.
ఒక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు. మణిపూర్ లో సుప్రీంకోర్టు తీర్పుతో ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. రేవంత్ రెడ్డి ఆధిపత్యానికి దళిత స్పీకర్ బలి అవుతున్నారు. స్పీకర్ రేవంత్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గద్దు. మౌలంకార్ అనే స్పీకర్ సభలో ప్రధానమంత్రులను హెచ్చరించేవారు. స్పీకర్ పవిత్రతను మంటకలపొద్దు. పార్టీ ఫిరాయింపులపై 10వ షెడ్యూల్ ను సవరిస్తామని చెప్పిన కాంగ్రెస్ తెలంగాణలో ఏం చేసింది? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయక తప్పదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. రేవంత్ రెడ్డిని చూసుకుని 8 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం వచ్చింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయ వంటకాలు చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను