– టామ్ కం కంపెనీ ద్వారా శిక్షణ ఇచ్చి విదేశాల్లో మంచి జీతాలతో ఉపాధి
– మంత్రి పొన్నం ప్రభాకర్
– మంజీరా ఐఏఎస్ గెస్ట్ హౌస్ లో తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ సమావేశం
– సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్,ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి, ఎన్నారై కమిటీ సభ్యులు..
– కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఓవర్సీస్ మొబిలిటీ బిల్ -2025 పై సమావేశంలో చర్చ..
హైదరాబాద్: గల్ఫ్ కార్మికులకు ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలకు వారికి అన్ని రకాలుగా ఎన్నారై అడ్వైజరీ కమిటీ అండగా ఉంటుంది. గల్ఫ్ లో గతంలో ఉపాధి కి మాత్రమే పోయేవారు..ఇప్పుడు సాంకేతికత తో పాటు అన్ని రంగాల వారు అక్కడికి వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఓవర్సీస్ మొబిలిటీ బిల్ – 2025 పై అన్ని రాష్ట్రాల సూచనలు అడుగుతున్న నేపధ్యంలో, ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, భీమ్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కొరకు కాంక్షించే వారంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఎన్నికలకు ముందు చెప్పినట్టు ప్రజా పాలన ప్రభుత్వం లో గల్ఫ్ సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నాం.
వారి పిల్లల విద్య కోసం ప్రత్యేక సీట్లు కేటాయించాం. వారి సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ఏర్పాటు చేశాం.గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 2023 డిసెంబర్ 7 నుండి వారికి 5 లక్షల చొప్పన ఆర్థిక సహాయం అందిస్తుంది. మా హుస్నాబాద్ నియోజకవర్గంలో విదేశాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న వారి గురించి ఈ ఎన్నారై ప్రతినిధులకు చెప్పగానే, అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారం చేసే వారు. ఇప్పటికీ కూడా చదువురాని అమాయక ప్రజలు ఉపాధి కోసం వెళ్లేవారిని కొన్ని బోగస్ కంపెనీలు మోసం చేస్తున్నాయి. టామ్ కం కంపనీ ద్వారా మంచి శిక్షణ ఇచ్చి విదేశాల్లో మంచి జీతాలతో అక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
ఎన్నారై సెల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. విదేశాల వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన దగ్గర నుండి ఈ బిల్లులో ప్రామాణికంగా ఉండే అంశాలు చేర్చాలి. మీ గురించి ఉన్న అంశాలు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. 2021 లో నేను కరీంనగర్ జిల్లాల్లో పాదయాత్ర చేసినపుడు శంకరపట్నం లో ఎన్నారై సమావేశాన్ని ఏర్పాటు చేశాం. 1990 లో నక్సలైట్ మూమెంట్ లో యువత పక్కదారి పట్టకుండా ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య పెరిగింది. గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. వారికి అండగా ఉంటున్నాం. తెలంగాణ ప్రవాస నివసితులకు అడ్వైజరీ కమిటీ వారి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. జిల్లాల్లో కూడా గల్ఫ్ ప్రభావితం ఉన్న ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలి. వారి సలహాలు సూచనలు స్వీకరించాలి..