– అసత్య ప్రచారాలతో కాలమె ళ్ల తీస్తున్న కాంగ్రెస్
– బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు
– తెలంగాణ స్కైబ్ తప్పుడు వార్తలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగ బాలు, కురువ విజయ్ తొట్ల స్వామి, ఆవాల హరిబాబు, చాప భాస్కర్
హైదరాబాద్: తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ మరోసారి అసత్య ప్రచారాల మార్గాన్ని ఎంచుకుంది. కెసీఆర్ , కేటీఆర్ పై వాస్తవం లేని, నకిలీ సమాచారంతో తెలంగాణ స్కైబ్ ప్రచురించిన వార్తలను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన దుష్ప్రచారమే. ప్రజల మనసుల్లో అనుమానాలను రేకెత్తిచేందుకే కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న ఈ అబద్ధాల రాజకీయాన్ని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం తీవ్రంగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా తుంగబాలు మాట్లాడుతూ, దుష్ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు, కుట్రల్లో పాల్గొన్న వారందరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో నడుస్తున్న ఈ విధమైన అసత్య ప్రదర్శనలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధి, శాంతి, సామరస్య వాతావరణాన్ని భంగపరచాలనే దురుద్దేశంతోనే ఇలాంటి అబద్ధాలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ నిజం పక్షాన నిలబడుతుంది. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు దుష్ప్రచారం చేసిన సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.