– పార్లమెంటులో ప్రకటన చేసినా
– తేలుకుట్టిన దొంగాల్లా కూటమి నేతలు
– తాజాగా 41.5 మీటర్లకు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేసిన కేంద్రం
– అలా అయితే బ్యారేజీకే పరిమితం కానున్న పోలవరం
– ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కూడా రూ.30వేల కోట్లకే పరిమితం
– అయినా నోరు మెదపని కూటమి నేతలు
– తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లి : కమిషన్లు కోసం కక్కుర్తి పడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నాశనం చేశాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు వ్యయం, ఎత్తు తగ్గిస్తున్నా కూటమి ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆక్షేపణ తెలిపారు. దీనిపై పార్లమెంటులో ప్రకటన చేసినా తేలుకుట్టిన దొంగాల్లా మౌనంగా ఉన్న చంద్రబాబు, కేంద్రమంత్రులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో అమరావతిది అంతులేని కథ అయితే… పోలవరంది ముగింపు లేని కథ అని చెప్పారు.
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు కేంద్రాన్ని వైయస్.జగన్ ఆమోదింపజేస్తే… తాజాగా అంచనా వ్యయాన్ని, ప్రాజెక్టు ఎత్తుని తగ్గిస్తున్నా నోరు మెదపకుండా కూటమి నేతలు.. పోలవరాన్ని నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక ప్రకారం ముందుగా రెండు కాపర్ డ్యామ్ లు పూర్తి చేసి, ఆ తర్వాత డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటే అవన్నీ ఖాతరు చేయకుండా కమీషన్ల మీద ఆశతో ముందుగానే డయాఫ్రంవాల్ పూర్తి చేశాడు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానెల్, రివర్ డైవర్షన్ కూడా పూర్తి చేయకపోవడంతో వరద తాకిడికి డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. దాదాపు వెయ్యి కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయి రు.
నిన్న లోక్‌సభలో పోలవరం జలాశయం కాదు.. కేవలం బ్యారేజ్ మాత్రమేనని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ పరోక్షంగా తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వ కనీసమట్టం 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ప్రాజెక్టును పూర్తిచేసేలా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆ మేరకు పనులు పూర్తిచేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లుగా తేల్చినట్టు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ వాస్తవానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ మట్టంలో నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తిచేయాలంటే రూ.55,656.87 కోట్లు నిధులు అవసరం. కానీ సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లని చెప్పడం ద్వారా జలశాయాన్ని ప్రాజెక్టుగా మార్చేశారని అర్థమైపోయింది.
దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీటినిల్వను పరిమితం చేస్తే 115.4 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయవచ్చు. కానీ కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం గోదావరి వరదల సమయంలో మాత్రమే కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీటిని అందించే అవకాశం ఉంటుంది. 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వచేస్తే పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.8 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థీరికరించడంతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.8 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. ఇదంతా తెలిసినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లోక్‌సభలో పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లేనని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా తేల్చిచెప్పినా టీడీపీ ఎంపీలు ఒక్క మాటా మాట్లాడలేదు. ఈవిధంగా ఒక పక్క పోలవరాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేస్తూ నిందలు మాత్రం వైయస్సార్సీపీ మీద వేస్తున్నారు. అడుగడుగునా పోలవరం ప్రాజెక్టును నాశనం చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమైపోయారు. పోలవరమైనా, అమరావతైనా డబ్బులు తప్ప ప్రజల శ్రేయస్సు గురించి చంద్రబాబు ఆలోచించడం లేదు.
చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేశారా? నిన్న వైయస్.జగన్ ప్రెస్ మీట్ చాలా శ్రద్ధగా విన్న మంత్రులందరూ… ఇవాళ వాటాలేసుకుంటూ విమర్శించడం మొదలుపెట్టారు. 16 నెలల్లో ఏపీలో 16 రోజులైనా ఉన్నావా అంటూ లాఠీ, పవర్ లేని హోంమంత్రి అనిత ప్రశ్నిస్తోంది. ఆమె పేరుకే హోంమంత్రి తప్ప.. ఆ బాధ్యతల నిర్వహణలో ఏమాత్రం ప్రమేయం లేదన్న విషయం అందరికీ తెలుసు. వైయస్.జగన్ ను మాత్రం పోటీ పడి విమర్శిస్తారు. వైయస్.జగన్ వారానికి నాలుగు రోజులు తాడేపల్లిలో ఉంటున్నారు. నీకేమైనా డౌట్ ఉంటే ఓసారి వచ్చి కాఫీతాగి వెళ్లవచ్చు.. అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేయవద్దు. రైతులను గాలికొదిలేసి, వారి దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా నిండా ముంచేసిన… పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వైయస్.జగన్ గురించి మాట్లాడుతున్నాడు. గోనె సంచులు లేక రైతులు లబోదిబోమంటున్నారు.
అంతా వ్యాపారులే కొంటున్నారు. రైతు సేవాకేంద్రాల్లో 17శాతం తేమ చూపిస్తే… వ్యాపారుల దగ్గరకు వెళ్లినతర్వాత 24 శాతం చూపిస్తుంది. దీంతో వాళ్లు రైతుల ధాన్యాన్ని వెనక్కి పంపించడమో, 4,5 కేజీలు తగ్గించడమూ చేయమంటున్నారు. అయినా పౌరసరఫరాలశాఖ మంత్రి సిగ్గులేకుండా కబుర్లు చెబుతున్నాడు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్య వ్యవస్ద మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆసుపత్రులు సరిగ్గా పనిచేయడం లేదు. మందులు లేవు, ఆరోగ్యశ్రీ లేదు. ఆయన మరలా వైయస్.జగన్ గురించి మాట్లాడతాడు. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఉండడానికి వీల్లేదని వైయస్.జగన్ భర్తీ చేశారు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తరపున ఇద్దరు మంత్రులు ఉన్నారు. పోలవరం గురించి ఇంత అన్యాయంగా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుని, పార్లమెంటులో చెబుతుంటే ఏం చేస్తున్నారు? రూ.55 వేల కోట్లు లేవు రూ.30వేల కోట్లకే ఫినిష్ అని, 41.15 కే ఫినిష్, 45.72 లేదని చెబుతుంటే నోరుమెదపడం లేదు.