పొగడ్తలకు పొంగేది – పూరీ
ఉడికిస్తే తెల్లబోయేది – ఇడ్లీ
పట్టించుకోకుంటే ముఖం మాడ్చుకునేది – దోశ
వత్తిడి చేస్తే పొరలు కమ్మేది – పరోటా
ఏమిచ్చినా కడుపులో దాచేసుకునేది – ఊతప్పం
నూనెలో వదిలేస్తే గొల్లుమనేది – గారె
ఎంత పోసినా రవ్వంతేననేది – రవదోశ
అందరికీ లొంగననేది – అప్పం
ప్రేమగా గుప్పెడంత పడేస్తే మూకుడంత ముద్దిచ్చేది -ఉప్మా
ఉప్మానెందుకర్రా ఆడిపోసుకుంటారూ?