– బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ.. యూటీ బ్యాచ్ ఉంటే ఉద్యమ తెలంగాణ
– ఆరడగుల బుల్లెట్ మేడ్చల్ జిల్లాలో కనీసం ఒక హాస్పిటల్ కట్టించలేదు
– లింగం చెరువులోకి మల్లారెడ్డి హాస్పిటల్ వ్యర్థాలు తెచ్చి పోస్తున్నారు
– ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: లక్ష్మాపూర్ ను ఇద్దరు ముఖ్యమంత్రులు వాడుకున్నారు. కానీ వారి సమస్యలు తీరలేదు. ఉప్పల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్ పల్లి లో మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వారు చెరువులు, కబ్జాలు, పవర్ కోసమే బీఆర్ఎస్ లోకి వచ్చారు. కుత్బుల్లాపూర్ ను కబ్జాల పూర్ అని పిలుస్తున్నారు. కబ్జాలను పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్తే వారి సమస్యలు తెలుస్తాయి.
ఆరడుగుల బుల్లెట్ మేడ్చల్ జిల్లాలో కనీసం ఒక హాస్పిటల్ కట్టించలేదు. డిఫాక్టో సీఎం కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అభివృద్ధి చేశానని చెప్పారు. మేడ్చల్ కు వెళ్లి చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. మేడ్చల్ లో 32 లక్షల మంది ఉంటే కనీసం 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లేదు. ఎడ్యుకేషన్, హెల్త్ ను ఇక్కడ పూర్తిగా ప్రైవేట్ పరం చేశారు. గతంలో మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న సీఎం ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చాలి. లేదంటే ఆయనను చరిత్ర క్షమించదు.
హైదరాబాద్ పక్కన ఉన్న ఈ జిల్లాలో ఒక్క మంచి ప్రభుత్వ హాస్పిటల్ లేకపోవటం ఆశ్చర్యం కలిగించింది. 32 లక్షల జనాభాకు ఒక్క వంద పడకల హాస్పిటల్ కూడా లేదు. ఏదైనా సిజేరియన్ కావాలంటే గాంధీకి రిఫర్ చేస్తున్నారు. పేదవాళ్ల పట్ల ప్రభుత్వం కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోంది. నేను ఒక్క ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం లేదు. అన్ని ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. హైదరాబాద్ ను ప్రభుత్వం గ్లోబల్ రైజింగ్ సిటి అంటోంది. కానీ ఆ సదస్సుకు వచ్చిన ఫారెన్ డెలిగేట్స్ ను ఒక్కసారి జవహర్ నగర్ కు తీసుకొస్తే తెలుస్తుంది?
కుత్బుల్లాపూర్ లోని పరికి చెరువు 62 ఎకరాల నుంచి ఎకరాలకు చేశారు. ఎమ్మెల్యే అండ చూసుకొని మొత్తం చెరువును కబ్జా పెట్టారు. లింగం చెరువులోకి మల్లారెడ్డి హాస్పిటల్ వ్యర్థాలు తెచ్చి పోస్తున్నారు. ఈ చెరువును కూడా మల్లారెడ్డి గారి కాలేజ్ ల కోసం కబ్జా చేశారని చెబుతున్నారు. హైడ్రా అటు వైపు ఎందుకు వెళ్లటం లేదని నేను ప్రశ్నిస్తున్నా.
రంగధామం చెరవు వద్ద మకుట తరంగ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ వేస్తే అటు వైపు పోలేదు. చెరువు తూమ్ ను తొలగించే వెంచర్ వేశారంటే ఎంత ధైర్యం? దాని వెనుక ఉన్న వారి పేర్లు చెబితే మాత్రం నన్ను బద్నాం చేస్తారు. కచ్చితంగా వివరాలతో సహా నేను హైడ్రా అధికారులకు దీనిపై కంప్లైంట్ చేస్తాను. హైడ్రా చర్యలు తీసుకోకపోతే పెద్దవాళ్లను కాపాడి పేదవాళ్లను ఇబ్బంది పెట్టేందుకే హైడ్రా అని భావించాల్సి ఉంటుంది.
ఉప్పల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ కూకట్ పల్లి లో మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ, యూటీ బ్యాచ్ ఉంటే ఉద్యమ తెలంగాణ. ఉద్యమం చేసిన వాళ్లను ఖాళీ చేసి బీటీ బ్యాచ్ మొత్తం ఇక్కడకు వచ్చేసింది. వాళ్లు కేవలం చెరువులు, కబ్జాలు, పవర్ కోసం మాత్రమే బీఆర్ఎస్ లోకి వచ్చారు. మొత్తం చెరువులను, భూములను వాళ్లు కబ్జా పెట్టారు. ఎంపీ ఈటల ఉన్నారు. కేంద్రం నుంచి చేయాల్సిన చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. మీరు కనీసం స్పందించటం లేదని ప్రజలు చెబుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలని రిక్వెస్ట్ చేస్తున్నా.