– నువ్వో దొంగదొరసానివి
– కవిత చరిత్ర హీనురాలు.. మంత్రి పదవులు అమ్ముకున్నారు.
– ఉద్యమంలో అసలు కవిత ఎక్కడ ఉంది?
– కేసీఆర్ బిడ్డవయితే నువ్వు కౌన్సిల్ చైర్మన్ దగ్గరకు వెళ్లి రాజీనామా లేఖ ఇవ్వు
– అత్తింట్లో నెగ్గలేక ఇక్కడ డ్రామాలు
– ఇంట్లో కుక్క పేరు విస్కీ పెట్టుకుంది
– కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉంది
– నీ చరిత్రను గల్లి నుంచి ఢిల్లీ దాకా బయటకు తీస్తా
– పార్టీ పేరుతో 36 ఎకరాల భూమిని దోచుకున్నారు
– కేటీఆర్,హరీష్ ను ఏదో విధంగా అరెస్ట్ చేయించాలనే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ
– గాంధీ లాంటి కేసీఆర్ ని చూసి ఇన్నిరోజులు భరించా.. ఇక తాట తీస్తా
– రేవంత్‌రెడ్డి.. ఒక మిత్రుడిగా, ఒక కొలీగ్‌గా చెబుతున్నా.. కవిత చాలా డేంజర్
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తండ్రి-సోదరుడిని పల్లెత్తుమాట అనకుండా.. మేనబావ హరీష్‌రావు, ఆయన అనుచరణం లక్ష్యంగా నిరంతరం ఆరోపణలు కురిపిస్తూ, కాంగ్రెస్‌కు పరోక్షంగా అస్త్రాలు అందిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై.. ఎట్టకేలకు బీఆర్ఎస్ నుంచి ప్రత్యక్ష దాడి మొదలయింది.
తనను కబ్జాదారుడిగా ఆరోపించిన కవితను.. ‘ఇలాంటి కుక్కలు ఇక్కడకు వచ్చి మొరిగిపోయాయ’ంటూ కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విరుచుకుపడ్డారు. ఇకపై తన గురించి మాట్లాడితే తాటతీస్తానంటూ అగ్గిరాముడయ్యారు. ఈ సందర్భంగా ఆయన కవిత-ఆమె భర్త.. తండ్రి కేసీఆర్ అధికారం అడ్డుపెట్టుకుని చేసిన భూకబ్జాలు, చేసిన బెదిరింపులను నేరుగా ప్రస్తావించి సంచలనం సృష్టించారు. తన దగ్గర ఆ చిట్టా ఉందని మరో బాంబు పేల్చారు.
‘‘ఇప్పటివరకూ కేసీఆర్ మొహం చూసి వదిలేశా. ఇకపై సహించేదిలేదు. తాటతీస్తా’’నని, వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే కృష్ణారావు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. హరీష్- కేటీఆర్ ను జైల్లో వే యించేందుకే ఆమె, సీఎం రేవంత్‌రెడ్డితో చేతులుకలిపారని కృష్ణారావు మరో సంచలన ఆరోపణ చేశారు.
కవిత బీఆర్ఎస్ పార్టీని భ్రష్టుపట్టించడానికి సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కల్పిందని.. అత్తింట్లో నెగ్గలేక ఇక్కడ లేనిపోని డ్రామాలు ఆడుతుందని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును, కేటీఆర్ ను జైలుకు వెళ్లేలా లేనిపోని నిందలు వేస్తుందని కృష్ణారావు అన్నారు.
కేసీఆర్ మర్యాద కోసం ఇన్ని రోజులు ఊరుకుంటున్నామని.. ఉద్యమంలో అసలు కవిత ఎక్కడ ఉందన్నారు. లిక్కర్ మాఫీయాతో చేతులు కలిపి, జైల్లో చిప్పకూడు తిన్నావంటూ ఎద్దేవాచేశారు.
నీ చరిత్రను గల్లి నుంచి ఢిల్లీ దాకా బయటకు తీస్తా. తమనపై కబ్జాలు అంటున్న కవిత.. బంగారం దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఎక్కడ భూములు కబ్జాలు పెట్టావో బండారం బైటపెడ్తామంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు.
బాలానగర్‌లో కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉందని ఓవర్‌ల్యాప్ ల్యాండ్‌ను పార్టీ పేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నారని ఆరోపించారు. పార్టీ పేరుతో 36 ఎకరాల భూమిని దోచుకున్నారని, కవిత అత్తింట్లో నెగ్గలేక ఇక్కడ లేనిపోనీ డ్రామాలు ఆడుతుందని.. ఇలాంటి కుక్కల్నిచాలా మంది చూశామంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్ అయ్యారు. గాంధీ లాంటి కేసీఆర్ ని చూసి ఇన్నిరోజులు భరించా. ఇక మీదట తాట తీస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విరుచుకుపడ్డారు. చివరకు ఇంట్లో కుక్క పేరు విస్కీ పెట్టుకుంది అని ఎగతాళి చేశారు.
కవిత చరిత్ర హీనురాలు, మంత్రి పదవులు అమ్ముకున్నారు. భూముల దోపిడీలు చేశారు. పార్టీలో కుట్రలు పన్నారు. కేసీఆర్ మర్యాద కోసం ఊరుకుంటున్నాను, ఇక సహనంతో ఉండేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యేలు కలిసి నడుస్తున్నామని, నగరంలో ఉండే ఎమ్మెల్యేలు ‘బీ.టీ. బ్యాచ్’ అని చెప్పడం దారుణమని విమర్శించారు. “ఉద్యమంలో పనిచేయకపోయినా, తాము అందరం తెలంగాణ కోసం పని చేశాం. మేము ఉద్యమం చేశామని ఎప్పుడూ చెప్పుకోలేదు” అని కృష్ణారావు స్పష్టం చేశారు.
“తెలంగాణ చరిత్రను లిక్కర్ పేరుతో నాశనం చేసావు. తెలంగాణ చరిత్ర హీనురాలు కవిత. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన స్థాయి కవితకు లే దు. నీ లాంటి కుక్కలు చాలామంది ఇక్కడికి వచ్చి మెరిగి పోయారు” అని విమర్శించారు. .
కేసీఆర్ పై అభిమానంతో మా ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదని, కవిత బండారం బయటపెట్టితే తెలుస్తుందని హెచ్చరించారు. బాలానగర్‌లో కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉందని ఆరోపించారు. పార్టీ లోపల కుట్రలు చేస్తోందని, హరీష్ రావును పార్టీ నుండి వెళ్లగొట్టాలన్నదే కవిత టార్గెట్. కేటీఆర్‌ను ఏదో విధంగా అరెస్ట్ చేయించాలనే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టింది అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.
‘‘నువ్వెంత? నీ బతుకెంత? నేను నోరుతెరిస్తే ఉరిపెట్టుకుంటావ్. నువ్వేమైనా సొక్కనైన దానివా? నువ్వో దొంగదొరసానివి. బిటి బ్యాచ్ అంట. ఆరోజు మేం 15 మందిమే రాకపోతే నీకు తెలిసేది. నువ్వు ఎంపి ఎట్టయ్యేదానివి? నేనేం చేశానో మా ప్రజలకు తెలుసు. నీకేం తెలుసు నీ ముఖానికి? అప్పుడు అయ్యను అడ్డంపెట్టుకుని సంపాదిస్తున్నవ్. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నవ్. ఇదిగో నీ మొగుడి ఆస్తి. నీ మొగుడు. సంతకం, ఫొటో చూడు. నీ మామ ఇక్కడ హైదరాబాద్‌లో పుట్టారా?
రేవంత్‌రెడ్డి.. ఒక మిత్రుడిగా, ఒక కొలీగ్‌గా చెబుతున్నా. కవిత చాలా డేంజర్. ఈమె నీ పేరు చెప్పుకుని కబ్జాలు చేసి కోట్లు సంపాదిస్తోంది. విచారణ జరపండి. విదేశాల్లో బతుకమ్మ ఆడి కోట్లు డొనేషన్లు సంపాదించింది నువ్వు. నీకు చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ బిడ్డవయితే నువ్వు కౌన్సిల్ చైర్మన్ దగ్గరకు వెళ్లి రాజీనామా లేఖ ఇవ్వు. ఎవరైనా లెటర్ పంపిస్తారా? ఎందుకీ డ్రామాలు? నీకే తెలివుందనుకుంటున్నవా? ఒరిజినల్‌గా లెటరు ఇచ్చి అనర్హత వేటు వేయించుకో. రాజీనామా ఆమోదించుకో. మా పార్టీ భిక్ష నీ ఎంపి. మా భిక్ష తో నువ్వు ఎమ్మెల్సీవయ్యావ్. ఇంకోసారి నా గురించి మాట్లాడితే, రోజూ నీ చరిత్ర తీసే పనిలోనే ఉంటా’’ని కృష్ణారావు, ఎమ్మెల్సీ కవితపై అగ్గిరాముడయ్యారు.