– మాట మీద నిలబడటం సీఎం కు చేత కాదు
– సీఎం వయస్సే 56 యేండ్లు
– 56 యేండ్ల అనుభవం తో మాట్లాడుతున్నా అంటున్నాడు.. నవ్వాలా ?ఏడవాలా ?
– సీఎం భజన బృందం లో కోదండరాం తో పాటు మరికొంత మంది చేరారు
– 2 వేల స్కూళ్ళు ఎందుకు మూత పడ్డాయో రేవంత్ రెడ్డి చెప్పాలి
– సీఎం జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నంత మాత్రాన అందరూ అక్కడే చదువుకోవాలా ?
– బి ఆర్ ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: సీఎం కు మాట తప్పడం అలవాటు. ఆగస్టు 25 నాడు ఓ యూ వచ్చినపుడు సీఎం చెప్పిందేమిటి ?ఈ రోజు ఓ యూ కు ఏ పద్ధతి లో వెళ్లారు ? విద్యార్థులను అరెస్టు చేసి పొలీసు పహారా మధ్య ఈ రోజు సీఎం ఆర్ట్స్ కళాశాలకు వచ్చారు. గన్ మెన్లు లేకుండా పోలీసు పహారా లేకుండా ఓ యూ కు వస్తా అని మాట తప్పారు. మాట మీద నిలబడటం సీఎం కు చేత కాదు. గుండె నిండా అభిమానం నింపుకుని ఓ యూ కు సీఎం రాలేదు .గుండెల నిండా భయం తో కేసీఆర్ మీద విషం నింపుకుని వచ్చారు.
విద్యార్థులకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే సీఎం ఇంత స్వేచ్ఛగా మాట్లాడే వారు కాదు. సీఎం భజన బృందం లో కోదండరాం తో పాటు మరికొంత మంది చేరారు. స్వ డబ్బా ,పర డబ్బా ,పరస్పర డబ్బా తప్ప సీఎం మీటింగ్ లో ఏం లేదు. చదువుల తల్లిని కూడా సీఎం ప్రేమిస్తున్నారు అంటూ ప్రొఫెసర్లు అవమాన పరుస్తున్నారు. ఉస్మానియా కు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నాం అని చెప్పి దేనికోసమో సీఎం చెప్పలేకపోయారు.
గురుకులాల్లో విద్యా వ్యవస్థను సీఎం భ్రష్టు పట్టించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఓ యూ హాస్టళ్ల లో కూడా పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ధర్నాలు చేశారు. వాటి మీద సీఎం సమీక్ష చేశారు. దావోస్ లో అబద్దాలే. గ్లోబల్ సమిట్ లో అబద్దాలే. పెట్టుబడులు ఎన్ని తెచ్చారు అంటే మంత్రులు మమ్మల్ని దబాయిస్తున్నారు.
2 వేల స్కూళ్ళు ఎందుకు మూత పడ్డాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. 25 వేల ఉపాధ్యాయుల పోస్టుల ను భర్తీ చేయాల్సి ఉండగా సగం చేసి చేతులు. దులుపుకున్నారు. విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టడం చేతకాని సీఎం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కన్నతల్లి కి అన్నం పెట్టనోడు పినతల్లి కి బంగారు గాజులు కొనిస్తా అన్నట్టు ఉంది సీఎం తీరు.
గురుకులాల్లో అడ్మిషన్లకు డిమాండ్ తగ్గడం సీఎం అసమర్ధతకు నిదర్శనం. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే భాద్యుల పై చర్యలేవీ ? ఫీజు రీ ఇంబర్స్ మెంట్ ఎగ్గొట్టడమే సీఎం కు విద్యార్థుల మీద ఉన్న శ్రద్దనా ? రాష్ట్రం లో 20 వేల స్కూళ్ళు కూడా లేవు సీఎం 25 లక్షల స్కూళ్ళు అని మాట్లాడుతున్నాడు
సీఎం వయస్సే 56 యేండ్లు ..56 యేండ్ల అనుభవం తో మాట్లాడుతున్నా అంటున్నాడు .నవ్వాలా ?ఏడవాలా ? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని సీఎం మాట తప్పారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు గురించి సీఎం ఎలాంటి అబద్దం చెప్పారో ఓ యూ కు వెయ్యి కోట్ల మీద అలాంటి అబద్దమే చెప్పారు. విద్యార్థులు మేల్కోవాలి. సీఎం ఎన్ని సార్లు ఓ యూ వెళ్లినా తెలంగాణ ఉద్యమం పై రైఫిల్ ఎక్కు పెట్టిన తీరును మరచిపోరు .ఆయన ఎపుడూ తెలంగాణ కు వ్యతిరేకం.
విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదు అని చెప్పి మూడు రంగుల జెండా పట్టి అనే నీ పాటను ఎందుకు వినిపించావ్ రేవంత్ రెడ్డి ? అశోక్ నగర్ లో ఉద్యోగాల కోసం రోడ్డు నెక్కిన విద్యార్థులపై లాఠీలు జులిపించిన ప్రభుత్వం ఇది. ఓ యూ లో కూడా కేసీఆర్ ,కే టీ ఆర్ ,హరీష్ రావు లను తిట్టడమే నీ పనా సీఎం ?
గ్లోబల్ సమ్మిట్ లో కాంగ్రెస్ నాయకులకు కోట్లు వేసి కూర్చోబెట్టారు. విందులు వినోదాలతోనే గ్లోబల్ సమిట్ ముగిసింది. ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదు. తమకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు .వాటి గురించి చెప్పాలి. రైతులు ,ఆటో డ్రైవర్లు ,నేత కార్మికులు ,రిటైర్డ్ ఉద్యోగులు ,బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు .వాటి గురించి రివ్యూ చేస్తున్నారా ? ఓ యూ వెయ్యి కోట్లు ఇస్తున్నా పండగ చేసుకోండి అని సీఎం అంటున్నారు. దశ దిశా ప్రణాళిక లేని ప్రభుత్వం ఇది. పట్టపగలు రోడ్ల మీద హత్యలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు.
హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు మహేష్ గౌడ్ ,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దగ్గర సమాధానాలు లేవు. .అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కే టీ ఆర్ చదువు పై కూడా రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. మరి రాజీవ్ గాంధీ ,రాహుల్ గాంధీ ఎక్కడ చదివారు ? సీఎం జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నంత మాత్రాన అందరూ అక్కడే చదువుకోవాలా ?
ప్రైవేటు స్కూల్లో ఇంగ్లీష్ చదువుకున్న వాళ్లంతా సీఎం దృష్టిలో మంచోళ్ళు కాదా ? పీఎం మోడీ తొలి ప్రధాని నెహ్రు ను విమర్శిస్తే, సీఎం రేవంత్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శలు చేయడమే లక్ష్యం గా పెట్టుకున్నారు. సీఎం పిచ్చి మాటలు మాని ప్రజల హామీల పై దృష్టి పెడితే మంచిది ప్రెస్ మీట్ లో అభిలాష్ రంగినేని , దిలీప్ రెడ్డి , నాగరాజు యాదవ్, శ్రీకాంత్ ముదిరాజ్ , మోహన్ నాయక్ పాల్గొన్నారు.