– గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ లో కీలకంగా యువ ఐఏఎస్ అధికారులు
– తెలంగాణ సత్తాను ప్రపంచానికి చాటిన తెలంగాణ ముద్దుబిడ్డలు.
– 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశాంక పూర్వీకులది నల్గొండ జిల్లా..
– 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ ఫరూఖి పూర్వికులది మహబూబ్ నగర్ జిల్లా
తెలంగాణ రాష్ట్రంలో మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ 2047ను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి వివిధ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. సమ్మిట్ ప్రాంగణం నిర్మాణం నుండి పలు కీలకమైన సంఘటనలు విజయవంతంగా నిర్వహించడం లో ఈ యువ ఐఏఎస్ అధికారులు అంతా తామై వ్యవహరించారు. గత పదిహేను రోజులుగా రోజులో 15 – 18 గంటల పాటు సిబ్బందికి, అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ కనీ వినీ రీతిలో ఏర్పాట్లు చేసి చూపరుల చేత ఔరా అనిపించారు.