– రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై భూ కబ్జా కేసు నమోదు అయింది
– ఎంఓయూ లు కుదుర్చుకున్న కంపెనీ ల్లో చాలా వరకు విశ్వసనీయత లేనివే.
– విజన్ డాక్యుమెంట్ ఛాట్ జీపీటీలో తయారు చేశారు.
– పెట్టుబడిదారులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు
– వాంతారా జూ పార్క్ ను కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్ వ్యతిరేకిస్తున్నారు
– తెలంగాణలో రేవంత్ రెడ్డి వాంతారా జూపార్క్ ఏర్పాటు చేస్తున్నారు
– అంబానీ,అదానీ పై రాహుల్ గాంధీ మాట్లాడతారు
– తెలంగాణలో రేవంత్ రెడ్డి అంబానీ,అదానీతో దోస్తానా
– బీ ఆర్ ఎస్ నేత మన్నె క్రిశాంక్
– ‘రెండేళ్లలో కమిషన్లు ,కాంట్రాక్టులు- కాంగ్రెస్ పార్టీ”పుస్తకాన్ని ప్రెస్ మీట్ లో విడుదల చేసిన బీ ఆర్ ఎస్ నేతలు మన్నె క్రిశాంక్,కె .కిషోర్ గౌడ్ , దినేష్ చౌదరీ, హరీష్ రెడ్డి
150 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. విజన్ డాక్యుమెంట్ ఛాట్ జీపీటీలో తయారు చేశారు. ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలంగాణ గ్రోత్ స్టేట్ అని అన్నారు.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయిర్ కేసీఆర్ పాలనను మెచ్చుకున్నారు. ఫార్మాసిటీ కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసింది.
13 వేల ఎకరాలు సేకరణ చేస్తే కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. పెట్టుబడిదారులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాంతారా జూ పార్క్ ను కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వాంతారా జూపార్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంబానీ,అదానీ పై రాహుల్ గాంధీ మాట్లాడతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అంబానీ,అదానీతో దోస్తానా చేస్తున్నారు.
తెలంగాణ రైజింగ్ లో పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. డి.కె.శివకుమార్ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చి బెంగుళూరును ప్రమోట్ చేశారు. నెల రోజుల క్రితం మొదలైన ఎస్.ఎల్.ఆర్ సురభి 3 వేల కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పింది. రేవంత్ రెడ్డి తన స్వంత అన్న స్వచ్చ బయో కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై భూ కబ్జా కేసు నమోదు అయింది. ట్రంప్ సంస్థకు పదివంతుల ఆస్తి లేకపోయినా లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంటున్నారు.
150 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణ ఆర్ధికంగా ఎదిగిందని మాజీ ఆర్.బి.ఐ గవర్నర్ స్వయంగా చెప్పారు. తెలంగాణ దివాళా తీసిందని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారు.
గ్లోబల్ సమిట్ తో పెట్టుబడులు వచ్చి తెలంగాణ కు మేలు జరిగితే మేమే ఎక్కువ సంతోషిస్తాం. ప్రభుత్వం చూపిన పెట్టుబడుల్లో 2 శాతం వాస్తవరూపం దాల్చినా తెలంగాణ కు మేలు జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఎంఓయూ లు కుదుర్చుకున్న కంపెనీ ల్లో చాలా వరకు విశ్వసనీయత లేనివే. ప్రజల సొమ్ము దుబారా చేశారు. వారం రోజులు ,నెల రోజుల ముందు పుట్టిన కంపెనీలతో ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటున్నారు ?
పరిశ్రమల ముసుగులో ఆర్థిక అక్రమాలు చేస్తున్న కంపెనీల పై ఈడీ దర్యాప్తు చేయాలి. ఇందులో షెల్ కంపెనీలు ఎన్ని ఉన్నాయో తేల్చాలి. లక్షా 74 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని గతంలో ప్రభుత్వం చెప్పుకుంది. .వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం లో వచ్చింది 9 వేల కోట్ల రూపాయలు మాత్రమే. గ్లోబల్ సమిట్ లో కుదిరిన ఒప్పందాలు అన్నింటిపై సమగ్ర విచారణ జరగాలి.
150 కోట్ల రూపాయల ఖర్చు తో ‘డేరా నగర్”లో నిర్వహించిన గ్లోబల్ సమిట్ అట్టర్ ప్లాప్ షోగా మిగిలిపోయింది. షెల్ కంపెనీ లతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు.దావోస్ లో సీఎం పర్యటనలు ,గ్లోబల్ సమిట్ తో కలిపి ప్రభుత్వం పది లక్షల కోట్లు పెట్టుబడులు గా వచ్చాయని చెబుతోంది. ఈ పెట్టుబడులు గనుక నిజమైతే ప్రతి నిరుద్యోగికి ఒక్క ఉద్యోగం కాదు ..నాలుగు ఉద్యోగాలు ఇవ్వొచ్చు. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు?పదేళ్ల కేసీఆర్ పాలనలో కష్టపడి పెట్టుబడులు తెచ్చి ఐ టీ రంగం లోనే ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. గ్లోబల్ సమిట్ లో మనీలాండరింగ్ కోణం పై కూడా విచారణ జరపాలి.
ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ,420 హామీలు ఇచ్చి కల్లిబొల్లి మాటలతో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక గ్లోబల్ సమిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మోసానికి తెగబడింది. విద్యార్థులకు గురుకులాల్లో సంక్షేమ హాస్టళ్లలో సరైన వసతులు అందించడం చేతకాదు కానీ, 150 కోట్ల తో గ్లోబల్ సమిట్ పెట్టి ప్రజా ధనాన్ని వృధా చేశారు.
ఫీజు రీ ఇంబర్స్ మెంట్ ,స్కాలర్ షిప్ లు ఇచ్చేoదుకు డబ్బు లేదు కానీ.. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు మాత్రం డబ్బు ఉందా ? ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వక కాలేజీలు మూత పడే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం ఆ విషయం మీద దృష్టి పెట్టడం లేదు. సీఎం ఫార్మా భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గ్లోబల్ సమిట్ ఒప్పందాల పై శ్వేత పత్రం ప్రకటించాలి. ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేసినట్టే కంపెనీలకు భూములు ఎర చూబుతూ మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు కథల పై బీ ఆర్ ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది.