– అభ్యంతరం తెలిపిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో బిజెపి ప్రతినిధుల బృందం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిశారు. ఈ సందర్భంగా వార్డుల విభజన- గెజెట్ నోటిఫికేషన్‌పై పారదర్శకత కోరుతూ, సంబంధిత సమస్యలపై చర్చ జరిగింది.
ఈ బృందంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్.గౌతం రావు , రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , మాజీ మంత్రి కృష్ణ యాదవ్ , మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి , సీనియర్ నాయకులు మల్లారెడ్డి , అమర్ నాథ్ సారంగుల , మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ , GHMC పరిధిలోని బిజెపి జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బిజెపి ప్రతినిధులు, వార్డుల విభజనలో పారదర్శకత కోసం జీహెచ్ఎంసీ నుండి తగిన స్పందన కోరారు.