– వాస్తవం.. లేదా కుట్ర?
(సాయి ధనుష్)
డొనాల్డ్ ట్రంప్ గారు ‘యాంటీ టెర్రరిజం మూవ్మెంట్ ‘ అనేదాన్ని తీసుకురాబోతున్నారట. దగ్గర్లో 3000 కి పైగా ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పై గ్లోబల్ క్రాక్ డౌన్ చేయబోతున్నారట. ఈయన ఈ చర్యలు ఎందుకు చేయాలి? ముఖ్యంగా భారత్ కి వ్యతిరేకంగా పని చేసే తీవ్రవాదుల పైనే ఎందుకు మేజర్ యాక్షన్ తీసుకుంటున్నారు? ఇది అమెరికా నుంచి వస్తున్న బ్రేకింగ్ వార్త.
కానీ, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు మన అజెండా ఉండాలి. లేకపోతే, ఈ రోజుల సోషల్ మీడియా పవర్ మన జీవితాలను అస్తవ్యస్తం చేసేస్తుంది. ఇది ఒక గొప్ప ఉదాహరణ.
చరిత్రను గమనించండి: అమెరికా యొక్క పాత నాటకం
ట్రంప్ పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలతో సన్నిహితంగా ఉంటారు. మరి ఈ తీవ్రవాదుల ఆరిజిన్స్ ఎక్కడో చూడండి – పాకిస్తానే కదా!
ఇదే ప్లాన్, ఇదే డీప్ స్టేట్ ప్లాన్. 1990లలో జార్జ్ హెచ్ డబల్యు బుష్ (అతనూ రిపబ్లికన్ పార్టీదే) పాకిస్తాన్ నాయకులను పిలిచి, “ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ యూనియన్ను ఆపాలి. తాలిబాన్ అనే మూవ్మెంట్ ని తీసుకురా. నీకు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను, వీళ్ళు రష్యా పై యుద్ధం చేయాలి” అన్నారు. చేశారు కూడా.
రష్యా 10 ఏళ్ల పాటు పోరాడి వెళ్లిపోయింది. తర్వాత ఏమైంది? ఆ తాలీబాన్ నుంచే ఒసామా బిన్ లాడన్ వచ్చాడు. అతనికి అమెరికాలోనే అకౌంట్స్ ఉండేవి. ఆ తర్వాత ‘వార్ ఆన్ టెర్రర్’ ప్రకటించి, అతన్ని హతమార్చారు. తాలీబాన్ను తీవ్రవాద సంస్థగా ప్రకటించారు.
వీళ్ళే డబ్బు ఇస్తారు.. వీళ్ళే కాల్చిపడేస్తారు.. ఇది అమెరికా ప్లాన్
ఇదే నమూనా ఇప్పుడు కూడా కొనసాగుతోంది. అవుతోంది. ట్రంప్ చెప్పిన 3,000 తీవ్రవాద సంస్థల లిస్ట్ ప్రతి దేశం దగ్గర ఉంటుంది. హఫీజ్ సయ్యద్, మజూర్ ఆజాద్, రెహ్మాన్ నాక్వి (ముంబై దాడుల సూత్రధారి) ఎవరో మనకు తెలుసు. పాకిస్తాన్ వాళ్ళు రెహ్మాన్ నాక్విని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడని చెప్పారు.
కానీ యావత్ వెస్టర్న్ మీడియా అద్భుతం పాకిస్తాన్ అని పొగిడింది. మూడు నెలల తర్వాత లోకల్ మీడియా రాసింది – రెహ్మాన్ నాక్వి భార్య ప్రెగ్నెంట్ గా ఉందట! వాడు జైల్లో ఉంటే భార్య ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? ఆ జైలు వాడి గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. పాకిస్తాన్ కి తీవ్రవాదులు ముఖ్యం. వీళ్ళని ఎవరు పోషిస్తారు? అమెరికా వాళ్ళే!
కొత్త నాటకం.. పాత కథ!
ఒక స్టేజీలో, “ఈ 3000 తీవ్రవాద సంస్థలను ఎలిమినేట్ చేసేసాం, గ్లోబల్ క్రాక్ డౌన్ చేసేసాం, హఫీజ్ సయ్యద్, మజూర్ ఆజాద్ అందరూ పోయారు” అని చెప్పి, తర్వాత కొత్త రకమైన హైబ్రిడ్ తీవ్రవాదం (డాక్టర్లు, ఇంజనీర్లు, మహిళలు) వచ్చిందని ప్రపంచానికి చెప్తారు. మనం నమ్మిస్తారు.
ట్రంప్ చెప్పినట్టుగా, “నేను ఐఎస్ఐఎస్ మూలాలను తుడిపేశాను, అబూబకర్ అల్-బఘ్దాదీని చంపేసాం” అన్నారు. ఐఎస్ఐఎస్ నిజంగానే ఈ భూమి మీద లేదా? వాళ్ళు టర్కీకి వెళ్లారు, ఇస్లామిక్ స్టేట్ కొరేషియన్ ప్రావిన్స్ లో ఉన్నారు, రష్యా మీద దాడులు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు భారత్ దాకా వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తే రష్యా వెళ్తారు, మళ్లీ డబ్బులు ఇస్తే ఇక్కడ జమ్మూ కాశ్మీర్‌లోకి లేదా ఢిల్లీకి వస్తారు.
కాబట్టి, ఇవాళ 3000 తీవ్రవాద సంస్థలను నేను తుడిపేస్తాను అంటే, కొత్తగా ఇంకొక 3000 సంస్థలు రాబోతున్నాయి అనే అర్థం. వాళ్ళందరూ వచ్చి గందరగోళంలో ట్రంప్ టెన్యూర్ అయిపోతుంది. మళ్లీ డెమోక్రట్స్ ఎవరో వస్తారు. ఇదంతా ఒక కొత్త నరేటివ్‌ను సృష్టించడానికి – పాకిస్తాన్, టర్కీ వాళ్ళు వినిపించడానికి.
మన భద్రతకు ముప్పు ఎక్కడి నుంచి వస్తుంది?
సిరియాలో అతి పెద్ద తీవ్రవాది ఇవాళ వైట్ హౌస్ కు వచ్చి ట్రంప్ తో లంచ్ చేస్తున్నాడు. “ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు నువ్వు” అని ట్రంప్ అంటున్నారని వార్తలు వస్తున్నాయి. అలాంటి అమెరికా, అలాంటి సిఐఏ ఏజెంట్లు ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు, ఈ ప్రపంచం సేఫ్ కాదు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.
ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, టర్కీ, పాకిస్తాన్ నుంచి ఢిల్లీలో టన్నెల్స్, బంకర్లు నిర్మిస్తున్నారట. ఇదంతా కూడా అమెరికాకు లింక్ అవుతుందా? ఎందుకు చేస్తారు? మీ దేశాన్ని డిస్టెబిలైజ్ చేయాలండి.
ఒక ప్రముఖ పార్టీ ఓపెన్‌గా మాట్లాడుతోంది – “5 లక్షల మంది ఇంటర్నెట్ వారియర్స్‌ను మేము క్రియేట్ చేస్తున్నాం.” వీళ్ళ మూలాలు ఎక్కడో చెప్పమంటే – పాకిస్తాన్, బంగ్లాదేశ్. వాళ్ళు డబ్బులు ఇచ్చి, భారత్‌లోనే రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయిస్తున్నారు. 5 లక్షల మంది తీవ్రవాదులకు డబ్బులు ఇచ్చి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను రిక్రూట్ చేస్తున్నారంటే, పరిస్థితి ఎలా ఉంటుంది?
మనం ఏం చేయాలి?
సో, ఫ్రెండ్స్, ఇవాళ ఢిల్లీ బ్లాస్టర్, రెడ్ ఫోర్ట్ బ్లాస్టర్ మూలాల్లోకి వెళ్తే, ఇదంతా ఒక ఇంటర్నేషనల్ వ్యవహారంగా కనిపిస్తుంది. భారత్ ఒక ఎమర్జింగ్ ఎకానమీ, అత్యధిక జిడిపి కలిగిన దేశం. అమెరికా ఒక ఫేక్ ఎకానమీ, చైనా ఒక ఫేక్ ఎకానమీ అని ఇవాళ ప్రపంచానికే తెలిసిపోయింది. భారత్ రియల్‌గా పెరుగుతోంది. ఇది జరగకూడదు, భారత్ ఎదగకూడదు కాబట్టి ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉంటాయి. దీన్ని తిప్పికొట్టడానికి మనం ఏం చేయాలి?