– ప్రజా సమస్యలు పక్కన పెట్టి మెస్సితో ఫుట్బాల్ ఆడుతున్నాడు
– సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు
– సింగరేణి డబ్బులు 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు
– కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి
– పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి
– స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారందరినీ తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం
– కమలాపూర్ లో కుట్రలను ఛేదించి సతీష్ ని గెలిపించినందుకు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
– ఎంపీ ఈటల రాజేందర్
కమలాపూర్: 11వ తేదీ జరిగిన ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పలికిన ప్రగల్భాలు, అబద్ధపు ప్రచారాలు, ప్రలోభాలు కాదని బిజెపి బలపరిచిన అభ్యర్థులు కమలాపూర్ లో శనిగరం గుండేడు గూడూరు గెలిపించడమే కాకుండా మేము మద్దతు ఇచ్చిన ఐదు గ్రామాలు దేశరాజు పల్లి కానిపర్తి గోపాలపురం మాదన్నపేట నేరెళ్లలో కూడా విజయం సాధించాము. ఈ ఎన్నికలు ప్రజలతో అనుబంధం పెనవేసుకున్న నాయకుడు, ఆ తదుపరే వారి వెనుకున్న నాయకుడు పార్టీ ను చూసి ఫలితాలు వస్తాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ దఫా చాలా గ్రామాలలో మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాము మాకు ఎవరితో అక్కరలేదని పార్టీలు ఉన్నప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వారికి విశ్వాసమున్న నాయకులతో ఒకటి రెండు నిమిషాల వీడియో సపోర్ట్ అడిగారు తప్ప ఏ మద్దతు కోరలేదు. మేము వీడియోలో సపోర్ట్ చేసిన వారు కూడా గెలిచారు.
గెలిచిన తర్వాత ఐదు లక్షలు 10 లక్షలు ఇస్తాం మా పార్టీకి రండి. మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోండి అని చిల్లర ప్రయత్నం కొనసాగుతుంది. న్నికలముందే మాకు ఫలానా నాయకుడి ఆశీర్వాదం ఉంది అని చెప్తే మంచిది కానీ.. ఒకసారి ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ ఆయన వెనుక ఈయన వెనక పోతాము అంటే.. గెలిచిన తర్వాత అటు ఇటు పోతే ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదు. గెలిచినవారు ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను.
స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తులు ఉండవు. స్థానిక సంస్థల ఎన్నికలంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. నిధులు వస్తాయని అభిప్రాయం ఉంటుంది. ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ 50% సీట్లు కూడా గెలవలేదు. గెలిచిన వారిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.
రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్ లెక్క మారిపోయారు. మెస్సి తో ఫుట్బాల్ ఆడుతున్నాడు. సింగరేణిలో క్వార్టర్స్ బాగు చేయడానికి పైసలు లేవు. అప్పు తెచ్చుకుంటే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ సింగరేణి డబ్బులు100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి.. 70 కోట్ల రూపాయలు ఆయనకిచ్చి.. క్రికెట్ స్టేడియం మార్చి.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. MCRHRD లో సీఎం ప్రాక్టీస్ చేయడానికి.. ఫుట్బాల్ కోర్టు తయారు చేసుకుని ప్రాక్టీస్ చేసి వందల కోట్ల రూపాయల సింగరేణి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సింగరేణి కార్మికుల ఇళ్లు బాగుచేయడానికి పైసలు లేవు.. కానీ రేవంత్ రెడ్డి గారి ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం పట్ల ఉత్తర తెలంగాణ ప్రజలందరూ విసుక్కుంటున్నారు.
ఏ ఊరికి పోయినా భర్తకు పెన్షన్ ఉంటే ఆయన చనిపోతేనే భార్యకు వస్తుంది తప్ప భార్యకు వయసు మీద పడిన కూడా పెన్షన్ రావడం లేదు. భర్తలు చనిపోయిన వారికి కూడా పెన్షన్ రావడం లేదు. అప్లికేషన్ పెట్టుకున్న పెండింగ్ లోనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లకు ఇస్తామన్న సబ్సిడీ డబ్బులు కూడా జమ చేయడం లేదు. వారు ఇచ్చిన హామీలు.. రైతుబంధు, మహిళలకు 2500, యువతకు నాలుగువేలు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు.
తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మాటల గారడితో మీడియాను మేనేజ్ చేసి ప్రజలను అదరగొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడిపిస్తుంది కానీ ప్రజా ప్రభుత్వంలాగా కొనసాగడం లేదని గుర్తు చేస్తున్నాను. సర్పంచ్లకు వార్డు మెంబర్లకు కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి వారి ఖాతాలో వేసుకోవడం కాదు ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి.
భారతీయ రాష్ట్ర సమితి వేలకోట్ల కుంభకోణం చేసిందని కేసీఆర్ కూతురు కవిత పదేపదే మాట్లాడుతున్నారు.. ఆమెకు కౌంటర్ గా ఆమె భర్తనే అధికారం ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారని విమర్శలు చేస్తున్నారు.. నేను మొదటి నుంచి చెప్తున్నాను హైదరాబాదు నగరానికి పొట్ట చేత పట్టుకొని వచ్చి 30 గజాల్లో 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న గుడిసెలను రేకుల షెడ్డులను హైడ్రా నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తుంది.. పేదల పట్ల ఒక న్యాయం పెద్దల పట్ల ఒక న్యాయమా ? పెద్దలు వేల కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకున్నారని ఇన్ని ఆరోపణలు వస్తున్న ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలు అడుగుతున్నారు.
ఎల్లమ్మ బండలో 97 ఎకరాల భూమి ఒక్కో ఎకరం 70 కోట్ల రూపాయలు ఉంటుంది. 7000 కోట్ల రూపాయలు ఉంది. 2007 నుంచి దానిని కొట్లాడి ఆపుతున్నాను. కానీ 2021 లో గెలిచిన తర్వాత ఆ బడా వ్యాపారి ఆ భూమిని తన్నుకు పోవడానికి చేస్తున్న ప్రయత్నానికి ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. నన్ను కోసినా ఒక్క రూపాయి లేదు అని స్వయంగా సీఎం చేస్తున్నారు. రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడానికి, పెన్షన్ ఇవ్వడానికి, గ్యాస్ సబ్సిడీకి, గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు లేవు.. గ్రామాల్లో పనిచేసిన వారికి ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ వీళ్లు మాత్రం ఇలా చేస్తున్నారు.
ప్రజలు ఆలోచన చేయాలి లేకపోతే మనల్ని ఎవరు కాపాడలేరు. నేను డిమాండ్ చేస్తున్నాను. పెద్దలకు అండగా ఉండి వారి ఆస్తులను కాపలా కాయటం కాదు ప్రభుత్వం చేయాల్సిన పని.. ప్రజా ప్రభుత్వమే అయితే పేదల గుడిసెలను కూల కొట్టకుండా పేదలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను. భూముల కబ్జాలపై వస్తున్న ఆరోపణలను ఒక్కొక్కటిగా విచారణ జరిపి ఆ భూములను ప్రభుత్వం ఆధీనం చేసుకుని ప్రజాపరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కెసిఆర్ కూడా ఇలానే అదరగొట్టి మీడియాను మేనేజ్ చేసి అహంకారంతో వ్యవహరిస్తే ఏం జరిగిందో చూసం.ప్రజలు సమయం సందర్భం వచ్చినప్పుడు విజ్ఞత ప్రదర్శిస్తారు. రెండవ మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి.. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.. డబ్బులు కాదు ముఖ్యం. క్యారెక్టర్ కమిట్మెంట్ ఉన్న వారిని మీతో ఉండి పని చేసే వారిని గెలిపించాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి స్పందించలేను కానీ అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఆ పోస్టుల గురించి సమయం వచ్చినప్పుడు పార్టీనే తేలుస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు ప్రజలకు అర్థమవుతుంది వారే తేలుస్తారు.