– కేవలం కమిషన్ల కోసమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
– ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి
– లేదంటే ప్రజల చేతిలో తగిన శాస్తి ఖాయం
– మీడియాతో వైయస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.
తాడేపల్లి: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం, రైతులు, విద్యార్ధులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని వైయస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి వైయస్సార్పీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. చివరకు పేద ప్రజలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ హాయంలో నిర్మాణం ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలనూ పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
కేవలం కమిషన్ల కోసమే… ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజల చేతిలో తగిన శాస్తి ఖాయమని హెచ్చరించారు. 18 నెలలుగా ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్సార్సీపీ… అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపైనా అనేక దశల్లో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించిందని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా సంతకాలు సేకరించిన ఇప్పటికే వైయస్సార్సీపీ కార్యాలయానికి చేరాయని… వాటిని వైయస్.జగన్ నేతృత్వంలో ఈనెల 18న గౌరవ గవర్నర్ సమర్పిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత 18 నెలలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రయోజనాలనే పరిరక్షించడమే ధ్యేయంగా అనేక ఉద్యమాలను, పోరాటాలను చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నిలబెట్టుకోకుండా పారిపోవడంతో పాటు, రైతులకు గిట్టుబాటు ధర కూడా లేకుండా చేసింది.
ప్రభుత్వం రంగంలో నిర్మాణం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను కమిషన్ల కోసం, తనకు కావాల్సిన వారికి కట్టబెట్టడానికి.. పీపీపీ అనే దుర్మార్గమైన విధానంలో కాలేజీలను అమ్మేసే కార్యక్రమం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో అనేక కార్యక్రమాలు చేపట్టంది. నవంబరు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి, ఎమ్మార్వోలు, డీఆర్వోలను కలిసి వారికి వినతిపత్రాలు సమర్పించింది.
ఆ తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా, ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కోటి సంతకాలను సమీకరించాలన్న దృక్ఫధంలో వైయస్సార్సీపీ కేడర్ మొత్తం ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి.. వాటన్నింటినీ డిసెంబరు 10 వ తేదీన జిల్లా కేంద్రాలకు తీసుకొచ్చాం. ఈ నెల 18 వ తేదీన వైయస్.జగన్ గవర్నర్ కి సమర్పిస్తారు.
ఆ రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాయంలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో సీట్లు కేటాయిస్తామంటే..ఆ రోజు చంద్రబాబు గగ్గోలు పెట్టారు. తాము అధికారంలోకి వస్తే కేవలం 100 రోజుల్లో సీట్లన్నీ కన్వీనర్ కోటాలో పెడతామని ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను కన్వీనర్ కోటాలోకి మారుస్తామన్న హామీని అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం…. ఇవాళ ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొత్తానికి ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి దిగజారిపోయింది.
ఇదేమని ప్రశ్నిస్తే.. పీపీపీ అంటే, ప్రైవేటు పరం చేయడం కాదు, ఇది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని చెబుతున్నారు. మరో ఆశ్చర్యకరమై విషయం ఏమిటంటే.. ప్రైవేటు వ్యక్తులు కొనుక్కున్న తర్వాత కూడా… 550 బెడ్స్, సిబ్బంది ఉన్న ఒక్కో మెడికల్ కాలేజీల్లో… వారికి జీతాలు నెలకు రూ.5-6 కోట్లు చొప్పున రెండేళ్లు పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతున్నారు. అంటే ఏడాదికి రూ.60-70 కోట్లు ప్రభుత్వమే ఇస్తుంది. రెండేళ్లకు రూ.140 కోట్లును… కాలేజీలు కొనుక్కున్న ప్రైవేటు వ్యక్తులకు బొనంజా ఇచ్చే కార్యక్రమం చేస్తోంది. ఇది స్కామ్ కాదా?
స్దాయి సంఘం… దేశంలో ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఆవశ్యకతను బలంగా చెప్పింది. పెరుగుతున్న జనాభా, అనారోగ్య సమస్యల నేపధ్యంలో పేదలను ఆదుకోవాలంటే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు మరిన్ని రావాలని.. చాలా స్పష్టంగా తన నివేదికలో చెప్పింది. అంతే కాకుండా రానున్న ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు పెరిగితే తప్ప… విద్యార్ధులకు మెడికల్ విద్య అందదు.. వాళ్లు విదేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడి భాషలు రాకపోయినా నేర్చుకుని రాస్తున్నారు. పార్లమెంటు స్థాయి సంఘం తన నివేదికలో పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కాలేజీ పెడితే పన్ను రాయితీ ఇమ్మని చెప్పిందే తప్ప, ఉన్న కాలేజీలను అమ్మేయాలని చెప్పలేదు.