– స్థానిక సంస్థల్లో ను గులాబీ కె హరీష్ రావు కె పట్టం కట్టిన ప్రజలు..
– సిద్దిపేట నియోజకవర్గంలో చరిత్ర సృష్టించిన బిఆర్ఎస్
* 91 స్థానాల్లో 78 స్థానాలు బిఆర్ఎస్ కైవసం.. ఇప్పటికే నాలుగు గ్రామాలు ఏకగ్రీవం
* హరీష్ రావుకు మద్దతుగా నిలిచిన గ్రామీణ ప్రాంత ప్రజలు
– గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెల్పిన హరీష్ రావు
సిద్దిపేట: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుపొంది చరిత్రను సృష్టించారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు ఎవరు పోటీలేరని గ్రామీణ ప్రాంత ప్రజలు ఓట్ల రూపంలో నిరూపించారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లో సర్పంచ్ కు 91 స్థానాలు ఉండగా ఇందులో 78 స్థానాల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలువగా కాంగ్రెస్ 5 స్థానాల్లో, బిజెపి 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 6 స్థానాల్లో గెలుపొందారు. నూతనంగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను హరీష్ రావు అభినందించారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలి : హరీష్ రావు
ఎన్నికల్లో గెలవడం ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నూతనంగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు సూచించారు. పదవి కాలంలో ఉన్నంతకాలం ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా గుర్తుండిపోతాయన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక స్థానాలు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.