తమ ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రతిష్టాకర ” బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ ” అవార్డు లభించినందుకు దుబాయిలో ని తెలుగు దేశంలో శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు కి లభించిన ఈ అవార్డు ఆయన పదే కష్టానికి నిదర్శనం అని అన్నారు. తెలుగు దేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు, ఎన్ టీ ఆర్ లీటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టత్మకమైన ఈ అవార్డు లభించడం.. చంద్రబాబు కి నాయకత్వ పటిమకు, పరిపాలన లో అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలకు నిదర్శనం అని అన్నారు. 1995 పునరావృతం కావడం జరుగుతోందని.. అప్పుడు కూడా ఈ విధంగా నే అనేక అవార్డ్స్ వచ్చాయని గుర్తుచేశారు. ఇవన్నీ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి దోహద పడతాయని.. తద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తలు పి.వి. రమణ మూర్తి, నల్లూరి శేషయ్య, రవి గుత్తా, శ్రీనివాసరావు నార్ల విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ టీడీపీ – యూఏఈ కార్యావర్గానికి చెందిన అధ్యక్షులు విశ్వేశ్వరరావు మోటుకూరి, ఉపాధ్యక్షులు నిరంజన్ కాచర్ల, ప్రధాన కార్యదర్శి వాసు పొడిపి రెడ్డి, ట్రెజెరర్ రాజా రవి కిరణ్ కోడి, సోషల్ మీడియా ఇంచార్జ్ హరి కల్లూరి, మీడియా కోఆర్డినేటర్ ప్రసాద్ దారపనేని, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు ఖాదర్ బాషా షేక్, సింగయ్య రామినేని, సురేంద్ర బెజవాడ, మధుసూదన్ కల్లూరి, మోహన్ మురళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించడం లో కీలక పాత్ర పోషించారు