– జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యప్రసాద్
తిరుపతి: ప్రభుత్వం ప్రజా వేదికకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అర్జీదారుల సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని స్టాంప్స్, అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా పర్యటన నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కౌంటర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులుతో కలిసి పరిశీలించారు. కౌంటర్ లో అర్జీదారుల రసీదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్న సిబ్బందిని వెబ్సైట్ నందు నమోదు చేసే విధానంను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ లో నమోదు చేసే సిబ్బంది ఆర్జీదారుల దరఖాస్తులను జాగ్రత్తగా వెబ్సైటులో నమోదు చేయాలని తెలిపారు.