– ఏలూరు జిల్లా అగిరిపల్లిలో టీడీపీ క్యాసినో
– దాదాపు 8 నెలల నుంచి ఉధృతంగా పేకాట
– విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు
– పేకాట క్లబ్ నిర్వహణకు మంత్రికి కమీషన్లు
– తక్షణమే మంత్రి పార్థసారథిని డిస్మిస్ చేయాలి
– వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర డిమాండ్
తాడేపల్లి: ఏలూరు జిల్లా అగిరిపల్లి వద్ద మంత్రి పార్థసారథి, ఆయన సన్నిహితుల నేతృత్వంలో భారీ క్యాసినో దాదాపు 8 నెలలుగా కొనసాగుతోందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర వెల్లడించారు. పేకాల క్లబ్ నిర్వహణకు మంత్రికి రెగ్యులర్‌గా కమీషన్లు ఇస్తున్నారని ఆరోపించిన ఆయన, పార్థసారథిని వెంటనే క్యాబినెట్ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు శాంతిభద్రతలు, ప్రజారక్షణ పట్టడం లేదని, వారు కేవలం వైయస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులకే పని చేస్తున్నారని వంగవీటి నరేంద్ర దుయ్యబట్టారు.
రాష్ట్రంలో యధేచ్చగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడ నుంచైనా రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పేకాడవచ్చు అన్న భావన నిన్నటి పోలీసు రైడ్‌లో బయటపడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో లా అండ్ ఆర్డర్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడి కనుసన్నల్లో నడుస్తోంది కాబట్టి.. ఆ జిల్లాలో ఎక్కడా పోలీసింగ్ కనబడ్డం లేదు. ఇంత జరుగుతున్నా హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి? ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడ వరకు కొరియర్ సర్సీసు ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతుంటే మీరు ఎక్కడ అరికట్టారు?
ఈగల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. కానీ ఆ సంస్థకు తగిన అధికారులు, టీమ్ లేకుండా చేశారు. కేవలం రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా ఎలా సాగుతుందో చంద్రబాబుకి నివేదిక ఇవ్వడానికి తప్ప, వాటి నియంత్రణకు ఈగల్ పని చేయడం లేదు.
అగిరిపల్లి భారీ క్యాసినో
నూజివీడులో మాంగో బే రిక్రియేషన్ క్లబ్బు నిర్వాహకులు కోర్టు ఆదేశాలతో రిక్రియేషన్ క్లబ్బు నిర్వహిస్తున్నామని చెప్పారు. రిక్రయేషన్ అంటే కుటుంబ సభ్యుల సభ్యత్వంతో, సరదాగా గడపడానికి ఉద్దేశిస్తే.. వీళ్లు మాత్రం ఏకంగా పేకాట క్లబ్బులు తెరిచి యధేచ్చగా నిర్విస్తున్నారు. దాదాపు 8 నెలల నుంచి అక్కడ మంత్రి పార్థసారథి, ఆయన సన్నిహితుల నేతృత్వంలో భారీ క్యాసినో పని చేస్తోంది.
విజయవాడకు చెందిన వ్యక్తి తోటలో అందుకోసం భవనాలు నిర్మించారు. అగిరిపల్లి వద్ద అడవి నెక్కోళ్లం వద్ద ఆ పేకాట క్లబ్ (క్యాసినో) నిర్వహిస్తోండగా, అక్కడికి ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా రోజూ 300 నుంచి 400 మంది భారీగా పేకాటరాయుళ్లు వస్తున్నారు. పేకాట నిర్వహణ కోసం మంత్రి పార్థసారథికి కమీషన్లు ఇస్తున్నారు. ఇదంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది కాబట్టి, వెంటనే పార్థసారథిని క్యాబినెట్ నుంచి డిస్మిస్ చేయాలి.
అగిరిపల్లి పేకాట శిబిరానికి విజయవాడతో పాటు, ఖమ్మం, హైదరాబాద్ నుంచి పేకాటరాయుళ్లను రప్పిస్తున్నారు. ఆ భారీ క్యాసినోకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, పోలీసుల అండ ఉంది. పేకాట కోసం వచ్చిన వారి నుంచి నగదు డిపాజిట్ చేయించి, వారికి క్యాసినో కాయిన్స్ ఇస్తున్నారు. అగిరిపల్లి వద్ద పేకాటతో పాటు, అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇన్ని దురాగతాలకు కారకుడైన మంత్రి పార్థసారథిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలి.
అగిరిపిల్ల పేకాట క్లబ్‌పై పోలీస్ రైడ్ లో 280 మందితో పాటు, రూ.50 లక్షల నగదు, 120 కార్లు, 50 బైకులను గుర్తించారు. ఇంత జరిగినా మీడియాలో ఈ వార్తలు రావడం లేదు. ఇందుకు అధికార పార్టీ అండదండలే కారణం.