– డిసెంబర్ 25 జీసస్ జన్మదినమా?
“మతం మార్చడానికి క్రిస్మస్ …” అన్న ఉత్సవం అమలులోకి వచ్చింది!” అని తేట తెల్లంగా ఆక్స్‌ఫడ్ చెబుతోంది:
(OXFORD ENGLISH REFERENCE DICTIONARY Says:)
“The festival of Christ’s birthday has been celebrated in the western Church on 25 December from about the end of fourth century. in the east it was originally held on 6 January in conjunction with the Epiphany.
There is no biblical or other direct evidance of the season of Christ’s birth, and the date of Christmas may have been chosen to felicitate the conversion of followers of older religions, many have held festivals arround this time. Many of the customs now associated with Christmas were taken over from the Roman Saturnalia and from pre-Christian festivals celebrating the winter solsitice (21 December).”
(Winter solisitice అంటే ఉత్తరాయణ పుణ్యకాలం)
క్రిస్టిఆనిటికి మారక ముందు రోమ్‌లో మిత్రా ఇజం ఉండేది. ఈ మిత్రా ఇజమ్ పెర్షియా నుంచి రోమ్ కు వెళ్లింది. సూర్యుడికి మఱో పేరు మిత్ర. ఫార్సీలు సూర్యారాధకులు. అప్పట్లో ఉత్తరాయణ పుణ్యకాలమూ, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడమూ కలిసి జరిగేవి. మిత్రా ఇజం ఉండే రోమ్‌లో సూర్యారాధన ఉండేది. మనకు ధనుర్మాసం ఎలాంటిదో రోమ్‌లో ఈ డిసెంబర్ నెల కూడా అలాంటిదే. సరిగ్గా ఈ ఉత్సవాల రోజుల్లో ఒక రోజైన డిసెంబర్ 25 ను జీసస్ పుట్టిన రోజుగా ప్రకటించాడు Pope Julius 1. ఈ వ్యావహారిక లేదా సామాన్య శకం 350 లో ఈ ప్రకటన చేశాడు. నిజానికి ఇది జీసస్ పుట్టిన రోజు కాదు.
జీసస్ పుట్టిన రోజు ఏదో ప్రపంచానికి తెలియని పరిస్థితిలో అంతకు ముందే ఉన్న ఒక పండగ రోజును జీసస్ పుట్టిన రోజు అని చెప్పి నమ్మించారు.
మఱో ముఖ్యమైన విషయం: మనం ప్రస్తుతం వాడుతున్న సివిల్ కాలెండర్ 1752లో మార్చబడింది. 1752లో సెప్టెంబర్ నెలలో 11 రోజుల్ని తీసేశారు. సెప్టంబర్ 2 తరువాత సెప్టెంబర్ 14 గా పరిగణించారు. నిజానికి 1582లో కూడా కాలెండర్ మార్చబడింది. 11 రోజులు మినహాయించిన తరువాత కూడా డిసెంబర్25 న క్రిస్మస్ ఎలా వస్తుంది? అందుకే కొన్ని తూర్పు దేశాల్లో క్రిస్మస్ జాన్యూఅరి(జనవరి) 6 న చేసుకుంటారు. కారణం కాలెండర్లోని ఈ మార్పే.
కాలెండర్లో 11 రోజులు మినహాయించినా కూడా మళ్లీ డిసెంబర్ 25 నే క్రిస్మస్ అంటున్నారు. అదెలా అవుతుంది?
జీసస్ బెత్లహామ్‌లో BCE 4లోపుట్టాడు లేదా BCE 6లో పుట్టాడు లేదా BCE 7లో పుట్టాడు అనీ CE 30లో మరణించాడు అనీ వేర్వేరు ఆకర గ్రంథాలు చెప్పాయి. జీసస్ సామాన్యశకం 1వ శతాబ్దిలో జీవించి CE 30లో శిలువ వెయ్యబడ్డాడని OXFORD ENGLISH REFERENCE DICTIONARY తెలియజేస్తోంది.
CE 250 వరకూ క్రిస్టిఆనిటి అనేది ప్రపంచంలో వాడుకలోకి రాలేదు. సామాన్య శకం 380లో క్రిస్టిఆనిటి రోమ్ రాజ మతం అయింది. జీసస్, క్రిస్టిఆనిటిల మధ్య దాదాపుగా 220 సంవత్సరాల ఆంతర్యం ఉంది. సామాన్య శకం 4వ శతాబ్ది చివరి దశలో క్రిస్మస్ చలామణిలోకి వచ్చింది. జీసస్ జనన, మరణాలపై సరైన ఎరుక లేదు.
క్రిస్మస్ జీసస్ జన్మదినం కాదు; 1752లో సెప్టెంబర్ నెలలో 11 రోజుల్ని తీసేసిన తరువాత కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ అనడం సరికాదు.
మనం తప్పుడువాళ్లంగానే ఉండాలా? మనకు చదువు కావాలి, రావాలి. మనం ఇకనైనా చదువుకు మాలిమి అవుదాం. మనకు ఇకనైనా తెలివిడి రావాలి.
చదివితే, ఏం చదివాలో, ఎలా చదవాలో తెలిస్తే మనకు సరైన అవగాహన వస్తుంది. అసత్యాలకు,అనర్థాలకు, అపహాస్యాలకు తావుండదు. మనం చదువుకుందాం. చదివి తెలుసుకుని తెలివిడిని పొందుదాం. చదువువల్ల వచ్చే తెలివిడితోనూ, విజ్ఞతతోనూ మనుషులమై బతుకుదాం.
– రోచిష్మాన్
9444012279