అవే లాఠీలు.. అవే ఖాకీ చొక్కాలు.. కానీ, నేడు ఆ పోలీసుల నడకలో న్యాయం కనిపిస్తోంది!
నాడు, అదే పోలీసుల చేత వైకాపా అరాచక శక్తులు అమరావతి ఆడబిడ్డలను జుట్టు పట్టి రోడ్ల మీద ఈడ్పించారు. మహిళల కడుపు మీద బూటు కాళ్లతో తన్నిస్తుంటే, రాష్ట్రం మూగబోయి చూసింది. ఆ ఐదేళ్ల కాలం ప్రజల గుండెల్లో ఒక ఆరని గాయం.. ఒక అసహాయ ఆక్రోశం. అరాచకం రాజ్యమేలుతుంటే, స్పందించలేని స్థితిలో మనసులు మొద్దుబారిపోయాయి.
కానీ కాలం మారింది! ఆ అరాచక పాలనను 11 అడుగుల గోతిలో పాతిపెట్టిన తర్వాత.. నేడు అదే పోలీసులు తమ అసలు స్వరూపాన్ని, తమ కర్తవ్యాన్ని స్వేచ్ఛగా నిర్వర్తిస్తున్నారు.
గర్భిణీ అని కూడా చూడకుండా కడుపు మీద తన్నిన వైకాపా మృగ సమూహంలో ఒకడిని, పోలీసులు వీధుల్లో నడిపిస్తుంటే.. అది కేవలం ఒక నిందితుడిని తీసుకెళ్లడం కాదు, అది ధర్మ స్థాపనలాగా భావిస్తూ.. ఆ దృశ్యాన్ని చూసి ప్రజలు పులకించిపోతున్నారు. నాడు కన్నీరు కార్చిన కళ్లే నేడు పోలీసుల వైపు కృతజ్ఞతగా చూస్తున్నాయి. పోలీసుల చేతులు సంకెళ్లతో నేరస్తుడిని బంధిస్తుంటే, ప్రజల చప్పట్లు వారికి నీరాజనం పడుతున్నాయి.
న్యాయం గెలిచింది.. మానవత్వం మళ్ళీ ఊపిరి పోసుకుంది!