– యువనేతలకు వాజపేయి జీవితం ఆదర్శప్రాయం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు
హైదరాబాద్: రేపు మన దేశానికి స్ఫూర్తిగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి. ఈ గొప్ప సందర్భాన్ని పురస్కరించుకుని, ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో దీపోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణలో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ పాల్గొన్నారు. బిజెపి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కాసం వెంకటేశ్వర్లు , పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు , పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఓ.ఎస్. రెడ్డి , సీనియర్ నాయకురాలు బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఏమన్నారంటే.. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101 జయంతిని పురస్కరించుకొని ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించాం. రాష్ట్రంలోని అన్ని జిల్లా బిజెపి కార్యాలయాల్లో కూడా దీపోత్సవం జరుపుకుంటున్నాం.
పార్లమెంటులో ఒక్క ఓటుతో ప్రభుత్వం కోల్పోతుందని తెలిసినా, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నా.. వాజ్పేయి రాజకీయంగా నైతిక విలువలకు కట్టుబడి ప్రభుత్వాన్ని తృణప్రాయంగా వదులుకున్నారు. ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. మళ్లీ నాలుగున్నర సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వెళ్లి ప్రజల మన్ననలతో ప్రధానమంత్రి అయ్యారు.
రాజకీయాలకు అతీతంగా వాజ్ పేయి పాటించిన రాజకీయ విలువలంటే అందరికీ గౌరవం. ప్రత్యేకంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు, ఎదుగుతున్న యువకులు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. వాజ్పేయి జీవితాన్ని, వారి ఆలోచనలను ప్రేరణగా తీసుకోవాలి. వాజ్ పేయి మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వాజ్ పేయి (1996 – 13 రోజులు, 1998–99, 1999–2004), దేశ ఆర్థిక వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశ స్వరూపాన్నే మార్చేలా నిర్ణయాలు తీసుకున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరింది. భారతదేశ స్వరూపాన్ని మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, టెలికాం విప్లవం, కొత్త ఎయిర్పోర్టులు, సీ పోర్టులు- ఇవన్నీ ఆధునిక భారతదేశ అభివృద్ధిలో ఆయన స్ఫూర్తితో మైలురాళ్లుగా నిలిచాయి.
వాజ్పేయి పాలనలో దేశవ్యాప్తంగా అభివృద్ధి వేగవంతమైంది. స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టు చేపట్టి జాతీయ రహదారుల ద్వారా అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేశారు. అదే దిశలో నేడు మోదీ ప్రభుత్వంలో పీఎం సడక్ యోజన వంటి అభివృద్ధి కార్యక్రమాలు అటల్ బిహారీ వాజ్ పేయి స్ఫూర్తితోనే కొనసాగుతున్నాయి.
భారత దేశానికి స్ఫూర్తిగా నిలిచిన అటల్ బిహారీ వాజ్పేయి 101వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దీపోత్సవం ఘనంగా నిర్వహించబడింది. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యకర్తల సమ్మేళనాలు, వివిధ కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మనమంతా అటల్ జీ ఆశయాలను మనం జీవితంలో కొనసాగిస్తూ, నైతికత, దృఢనిశ్చయం, ప్రజాసేవకు కట్టుబడి ముందుకు వెళ్లే దిశలో అడుగులు వేయాలి.
బిజెపి సీనియర్ నాయకురాలు బంగారు శృతి ఏమన్నారంటే.. రేపు 101వ జయంతిని పురస్కరించుకుని, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జీవితాన్ని, ఆదర్శాలను గౌరవిస్తూ, 2024 డిసెంబర్ 25 నుండి 2025 డిసెంబర్ 25 వరకు అటల్ జీ స్మృతి వర్ష్ గా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండలం కార్యాలయాలు, వివిధ ప్రాంతాల్లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాల ముందు దీపోత్సవాలు జరుపుతున్నాం. అటల్ జీ వ్యక్తిత్వం, పాలనా స్ఫూర్తి, విలువలను భవిష్యత్ తరాలకు అందించేలా రేపు 25-12-2025 నుంచి డిసెంబర్ 31 వరకు, ప్రతి జిల్లా, మండలం, స్కూల్, కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించబడతాయి.