– సీఎంఆర్ఎఫ్ చె క్కులు పంపిణీ చేసిన మంత్రి సవిత
– 53 మంది లబ్ధిదారులకు సుమారు 30 లక్షలు రూపాయల చెక్కులను అందచేసిన మంత్రి సవిత
పెనుకొండ: నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన పేద, నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) ద్వారా మంజూరైన చెక్కులను పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సీఎంఆర్ఎఫ్ పేదల జీవితాలకు సంజీవనిగా మారిందని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఈ నిధి ప్రాణరక్షణగా నిలుస్తోందని అన్నారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని తెలిపారు.