– అంబేద్కర్ను కాంగ్రెస్తో కలసి ఓడించిన పాపం కమ్యూనిస్టులదే
– భారత్ భూభాగం నుండి చైనా వెనక్కి వెళ్ళిపోవాలని తీర్మానం చేయరు
– అంబానీ, అదానీ, టాటా, బిర్లాలను వ్యతిరేకిస్తారు
-మరి కేరళలో విజింజం పోర్ట్ నిర్మాణాన్ని అదానీ కి ఎలా ఇచ్చారు?
(అయ్య ల సోమయాజుల సుబ్రహ్మణ్యం)
కమ్యూనిస్టుల కథ ఇంతేనా? ..అవును.. ఇక అంతే!
పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ, గతకాలపు చారిత్రక తప్పిదాలతో నూరేళ్ళు నిండుతున్నాయా?చరిత్ర కాల గర్భంలో కలిసిపోతారా? దేశవ్యాప్తంగా బలహీనపడిన పార్టీ. పార్టీ తప్పిదాలే వరస ఓటములు. శత సంవత్సరంలో దిద్దుబాట్లా లేక నూరేళ్ళు నిండుతాయా?
జాతీయతా భావం అస్సలు లేక పోవటం అతిపెద్ద తప్పు. స్వతంత్ర పోరాటం లో చిత్తశుద్దితో పాల్గొన్నాయా? పాల్గొని ఉంటే 1947,ఆగస్ట్ 15 న దేశమంతా సంబరాలు జరుపుకుంటుంటే వారి నేత రణదీవే “ఇది బూటకపు స్వాతంత్య్రం ,దీనిని మేము అంగీకరించం “అనే ప్రకటన చేశాడు. “ఈ ఆజాదీ జూట్ ” అనే మాట చారిత్రక తప్పిదం.
అప్పటి జాతీయ ప్రభుత్వంలో వీళ్ళకి స్థానం లేదు.దీనీకి కారణం చిత్తశుద్దితో స్వాతంత్య్ర సంగ్రామం లో పాల్గొనక పోవటం. బి.ఆర్. అంబేద్కర్ కూడా మంత్రివర్గ సభ్యుడే. 1948,సెప్టెంబర్ 17 న నిజాం లొంగిపోవటంతో హైదరాబాద్ రాజ్యం భారత్ లో అంతర్భాగమైంది. అంటే భారత్ ప్రజలు కోరు కున్నది సాకారమైంది. కానీ కమ్యూనిష్టులు తమ సాయుధపోరాటం ఆపలేదు. ఆయుధాలు దించలేదు. అలా 1951 వరకూ భారత ప్రభుత్వం మీద పోరాటం చేశారు. ఇది వీరి నిజస్వరూపము.
ఇంకా ఏంటంటే చివరికి ఆ పోరాటంలో భారీగా వాళ్ళ బలాలు క్షీణిస్తున్న వేళ “చండ్ర రాజేశ్వరరావు, మాకి నేని బసవపున్నయ్య, అజయ్ ఘోష్, ఎస్.ఏ.డాంగే లతో కూడిన పార్టీ ప్రతినిధి బృందం మాస్కోకు పంపబడినది. “అని పుచ్చలపల్లి సుందరయ్య తన ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం-గుణపాఠాలు ‘ పుస్తకంలో రాసుకున్నారు.
అంటే భారత ప్రభుత్వం మీద ఆయుధ పోరాటమే ఒక పెద్ద చారిత్రక తప్పిదం. దాని విర మణకు ఒక విదేశీ నేత స్టాలిన్ ని సంప్రదంచటం దారుణమైన చారిత్రక తప్పిదం. సిరిసిల్ల లో ఒక పిట్ట తగువు తీర్చినట్టు హడా వుడి చేసి సంబల్ పూర్, శ్రీనగర్ వరకూ అనేక పరకాల చేశామని
చెప్పుకునే వాక్శూరులు.
ముద్ర ణాలయాలు, పత్రికలు, ఎల్లో జర్నలిస్టులు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఇంక అడ్డేముంది? 1952 ప్రజాస్వామ్య ఎన్నికలలో పాల్గొన్నారు. కానీ రాజ్యాంగ సంఘం చైర్మన్ గా చేసిన అంబేద్కర్ ను నెహ్రూ పంతం, కాంగ్రెస్ కుటిలరాజనీతి కి వత్తాసు పలికి ఆయనను ఓడించారు.
ఆయన అభిమానులు మళ్ళీ బెంగాల్ నుండి పోటీ చేయిస్తే అక్కడ కూడా కాంగ్రెస్, కమ్యూ నిస్టులు ఓడించారు. మొదటినుంచీ వీళ్ళకి దేశభక్తి కంటే విదేశభక్తి ఎక్కువ. రాజ్యాంగం మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ వందసార్లు రాజ్యాంగ సవ రణలు చేస్తే, వాళ్ళతో వంత పాడిన వాళ్ళే… ఈ రోజు కాంగ్రెస్, కరాజ్యాంగ రాజ్యాంగ సంక్షోభం అంటే నవ్వను గాక నవ్వరా?
1962 లో చైనా దురాక్రమణ లో మన సైనికులు ఎంతో మంది అసువులు బాసారు. కానీ ఆ సమయం లో జ్యోతిబసు “చైనా ఎప్పుడూ దురాక్రమణ దారుడు కాదు, “అని చైనా ని సమర్థించాడు.
అంతేకాదు గాయపడి చికిత్స పొందుతున్న భారతీయ సైనికుల సహాయార్థం నిర్వహిస్తున్న రక్తదాన సరఫరా శిబిరం లలో కమ్యూనిస్టు కార్యకర్తలు పాల్గొని, సైనికులకు రక్తం ఇవ్వవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఆ విధానం తప్పన్నందుకు వాళ్ళ నాయకుణ్ణి పార్టీనుండి సస్పెండ్ చేసింది. వీళ్ళ పోరాటాలు, త్యాగాలు గురివిందగింజ సామెత వంటిదే .
పార్టీ వేదికల మీద ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తారు. ఒక్కసారంటే ఒక్కసారైనా కూడా భారత్ భూభాగం నుండి చైనా వెనక్కి వెళ్ళిపోవాలని తీర్మానం చేయరు. భారత్ కి కమ్యూనిస్ట్ చైనాకి విభేదాలు, పోరాటాలు వచ్చినప్పుడు చైనాదే సరియైన బాట అంటారు.
అత్యవసర పరిస్థితి లో ప్రజలకు జీవించే హక్కు లేదని సుప్రీమ్ కోర్టు తో చెప్పించిన,బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
ప్రజాస్వామ్యాన్ని హరించిన కాంగ్రెస్ కు, ఇందిరాగాందీ కి మద్దతు పలికారు కమ్యూనిస్టులు. నేడు ప్రజాస్వామ్యం,పౌర హక్కులు గురించి మాట్లాడుతున్నారు.
దోపీడీని సహించని,పేదల పక్షాన నిలిచే పార్టీగా పేర్కొంటాయి కదా? బెంగాల్ లో ఎందుకు ఓడారు? కేరళ స్థానిక ఎన్నికలలో ఎందుకు ఓడారు?. పరాన్న భుక్కు లుగా కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల పంచన చేరి సీట్లు అడుక్కుంటు న్నారు. ఆర్థిక సంస్కరణలను అడ్డుకున్న ఘనత వారిదే. చైనా పెట్టుబడి దారి దేశంగా మారినా కూడా గుర్తించని, దేశప్రగతికి తోడ్పడని, ప్రజలు ఆశిస్తున్న మార్పులను హర్షించలేని మూర్ఖపు పిడివాదులు.
టాటా బిర్లా లను దోపిడీ దారులు గా నిందించి, కార్ల ఫ్యాక్టరీ తమ రాష్ట్రంలో పెట్టమని తాతాలని అడిగారు కేరళ సి.ఎమ్. విజయన్. అదానీ, అంబానీ లకు దోచి పెడు తున్నారని నిందించి, కేరళలో విజింజం పోర్ట్ నిర్మాణాన్ని అదానీ కి ఇచ్చారు.
మూర్ఖత్వ పిడివాదన, జాతీయ భావాలు మచ్చుకైనా లేకపోవటం, ఎన్నికల్లో ఓటములు, యువతను ఆకర్షించ లేని పరిస్థితులు, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో హిందువుల పై అరాచకాలు జరిగినా మైనారిటీ మత సంతుష్ఠీకరణ విధానం అవలంభించడం ప్రస్తుతం వీరి పార్టీ అంపశయ్య మీద ఉండటాని కి కారణాలు. చక్కదిద్దుకునే ప్రయత్నాలు లేవు. మరి ఇంక చరిత్ర కాల గర్భంలో కలిసిపోతారా?
– జైహింద్