– వీడెక్కడి ముఖ్యమంత్రి?
– కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి సస్తాడు
– నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్ కేమి నొప్పి?
– కానీ రేవంత్ ఆంధ్రాకెళ్లి అల్లుణ్ణి మాత్రం తెచ్చుకోవచ్చట
– రేవంత్ అమ్మ అయ్య అయనకు చక్కటి తోవ చూపించలేదు
– మా నాయన పేరు బరాబర్ చెప్పుకుంటా.. తప్పేమున్నది?
– రేవంత్ రెడ్డి భాష పై విరుచుకుపడిన బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్
హైదరాబాద్: రేవంత్ ను నాకు తిట్టాలని లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడు, రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి, మా నాయనను తిడితే కొడుకుకు ఆవేశం రాదా? రేవంత్ దొరికితే ఎడమ కాలి చెప్పు తీసుకు కొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది?.
రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునేటోడు రేవంత్ రెడ్డి. జీవితంలో ఎవరైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావాలి, తప్పు లేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగా పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి, జైలుకు వెళ్ళి, మళ్లీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు రేవంత్ రెడ్డి పోజులు కొడుతున్నారు. ఢిల్లీలో పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి. సీఎం పదవిలో ఉన్నవానికి సంతోషం ఉండాలి కానీ, రోజూ ఈ ఏడుపు ఎందుకు రేవంత్ రెడ్డి ?
హమీల అమలు ఏమైంది అని అడిగితే ‘నీ గుడ్లు పీకి గోటీలాడతా’ అంటాడు. వీడెక్కడి ముఖ్యమంత్రి? రెండు సంవత్సరాల్లో ఏం చేశావయ్యా అంటే.. ‘లాగుల తొండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోటీలాడతా’.. నీ అమ్మ, నీ అయ్య, గిదా నీ భాష? మాకు రాదా భాష? మాట్లాడమంటావా? నేను హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడిని. మాట్లాడమంటే ఉర్దూలో, హిందీలో, తెలుగులో, ఇంగ్లీషులో పొల్లు పోకుండా తిట్టే తెలివి నాకు కూడా ఉంది. కానీ నీకు కాదు, నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నాం.
‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టినట్టుంది పరిస్ధితి. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ నువ్వు బయటికి రా, బయటికి రా అన్నారు. వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్‌తో మాట్లాడి పోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినయి, చలి జ్వరం వచ్చింది. దానికే అరుస్తున్న సిఏం, ఇప్పుడు కేసీఆర్ ‘నువ్వు అసెంబ్లీకి రా’ అంటున్నాడు.
బయటకు వస్తేనే తట్టుకోలేక పోయినవు… అసెంబ్లీకి వస్తే ఆయనతో గుండె ఆగి రేవంత్ సస్తాడు. నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరె.. నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్ కేమి నొప్పి? .. నేను ప్రపంచమంతా చదువుకున్నా. రేవంత్ అమ్మ అయ్య అయనకు చక్కటి తోవ చూపించలేదు నేనేం చేయాలి?
నేను ఆంధ్రాకు పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట! కానీ ఆయన ఆంధ్రాకెళ్లి అల్లుణ్ణి మాత్రం తెచ్చుకోవచ్చట. అందుకే ఇంకా రేవంత్ కు చిట్టి నాయుడు కాకుండా, ‘భీమవరం బుల్లోడు’ అని పెడితే సరిపోతుంది. నేను మా నాయన పేరు చెప్పుకొని బతుకుతున్నా అంటాడు. అవును మా నాయన గొప్పోడు.
మా నాయన తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు… బరాబర్ చెప్పుకుంటా! తప్పేమున్నది? మా నాయన పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు? నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చా పనులు చేసినవనుకో నీ మనవడు కూడా నీ పేరు చెప్పడు.
ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలకు కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.