(వాసిరెడ్డి అమర్నాధ్)
మనిషి జీర్ణాశయం లో సుమారుగా రెండు వేల జాతుల సూక్ష్మజీవులు ఉంటాయి!
వీటి మొత్తం సంఖ్య చెబితే మీరు నమ్మలేరు !
ఒక కోటి .. పది కోట్లు కాదు !
మొత్తం ముప్పై తొమ్మిది లక్షల కోట్ల సూక్ష్మ జీవులు ఉదరం లో ఉంటాయి
వీటి బరువు సుమారుగా రెండు కిలోలు !
మనం బతకాలంటే అవి బతకాలి.
అవి ఛస్తే మనబతుకు నరకం !
1 మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి అవి అవసరం!
2 బి కే విటమిన్లను అవి ఉత్పత్తి చేస్తాయి !
3 అవి మన ఇమ్మ్యూనిటి కణాలకు శిక్షణ ఇస్తాయి; రోగకారక క్రిములనుండి దేహాన్ని కాపాడుతాయి !
4 మన గట్ .. రెండవ బ్రెయిన్ !
గట్ సరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం . సూక్ష్మ జీవులు సెరోటోనిన్ డోపమైన్ ను ఉత్పత్తి చేస్తాయి ; ఇది మనల్ని మంచి మూడ్ లో ఉంచుతాయి . ఈ సూక్ష్మ జీవులు లేకపోతే స్ట్రెస్ ఎక్కువవుతుంది ; వ్యాకులత ఏర్పడుతుంది ; డిప్రెషన్ ..IBS లాంటి వ్యాధులు వస్తాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరం లోని ప్రియ బంధువులు ఈ సూక్ష్మ జీవులు.
మనం తినే ఆహారం లోని సహజ పీచు ని ఇవి కొంత తీసుకొని మనకు ఎనలేని మేలు చేస్తున్నాయి .
ఇప్పుడు మనకు ఫుడ్ సోకులు ఎక్కువయ్యాయి !
ఉదాహరణకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొందాము !
తొంబై అయిదు శాతం విదేశీ పేర్లతో రెస్టారెంట్లు !
పేర్లు ఏమైతేనేమి ? పళ్ళు ఊడగొట్టుకోవడానికి ?
అన్నింటా రసాయినాలే !
కెమికల్ లేకుండా ఒక్కటంటే ఒక్క ఫుడ్ ఐటెం ఉండదు!
ఉంటే అది అమ్ముడు పోదు !
పిల్లలకు అలవాటు చేసేసారు
ప్రతి రోజూ వారు పొటాటో చిప్స్ మెదలు గంపెడు రసాయనాలు గతికేస్తున్నారు !
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అందమయిన ఆకట్టుకొనే ప్రకటనలతో పిల్లల బ్రెయిన్‌వాష్ చేసేస్తున్నాయి !
బాల్యంలో తిన్న రుచి బ్రెయిన్ లో ప్రింట్ అయిపోతుంది ; జీవితాంతం అదే ఫేవరేట్ ఫుడ్ !
బుద్ధి లేని తల్లితండ్రులు తమ పిల్లలు .. ఫుడ్ ఛాయస్ లో కూడా మోడెర్న్ అని మురిసి పోతున్నారు !
పిల్లల్ని అయితే మోసం చెయ్యొచ్చు కానీ ఉదరం లోని సూక్ష్మ జీవులను కాదు .
మనం సోకు పేరుతొ గతికే రసాయనాలను అవి ముట్టుకోవు!
అందుకే ఆధునిక మనుషుల గట్ హెల్త్ నాశనం . ఇమ్మ్యూనిటి డౌన్ !
వర్షం పడినా , మంచు కాలం వచ్చినా దగ్గులు తుమ్ములు ; నెల అయినా తగ్గని దగ్గు , జలుబు.
1 పిల్లల్ని మట్టిలో ఆడనివ్వండి! ఇసుకలో బంకమట్టిలో గడ్డిలో ఆడనివ్వండి
2. మరక మంచిదే !
కాస్త అపరిశుభ్రత మంచిది.
అతిశుభ్రత కీడు చేస్తుంది !
ప్రతి సారి చేతులు కడగడం సబ్బుల హ్యాండ్ వాష్ కంపనీ ల ఆరోగ్యానికి మాత్రమే మంచిది . పిల్లల ఆరోగ్యానికి కాదు .
పిల్లలకు అప్పుడప్పుడు చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రావాలి !
మనిషి అలాగే బతుకుతాడు !
ఇమ్యూన్ వ్యవస్ధకు బాటింగ్ ప్రాక్టీస్ లేకపోతే ఎలా ?
3. పిల్లలకు వారానికి కనీసం ఒక్క సారి చద్ది అన్నం పెట్టండి ; మీరు తినండి ! పెరుగు మజ్జిగ తరచూ తీసుకోవాలి !
4 . పళ్ళు కూరగాయలు కూరగాయలు బాగా తీసుకోండి ; వీటిలో సహజ పీచు వుంటుంది . మన జీర్ణాశయం లోని సూక్ష్మ జీవులకు మనం పెట్టే నైవేద్యం ఇదే !
అవి మనకు ఎన్నో ఇస్తాయి. వాటికీ తిరిగీ ఇవ్వకపోతే మనం లావై పోతాము
5 . వైరల్ వ్యాధులకు కూడా ఆంటిబయోటిక్స్ ఇచ్చే సంకర దాదా లు ఇప్పుడు ఎందరో .
మంచి డాక్టర్ ను ఎంచుకోండి ! చీటికీ మాటికి ఆంటీబయోటిక్ మింగొద్దు.
Gut is second brain.
Take care.