బియాలో చోటుచేసుకున్న ఒకే ఒక్క విమాన ప్రమాదం ఆ దేశ సైనిక అగ్రనాయ కత్వాన్నే తుడిచిపెట్టేసింది. అయితే ఈ విషాదం వెనుక ఒక అంతర్జాతీయ కుట్ర, నిబంధనల ఉల్లంఘన ఉందనే ఆరోపణలు ఇప్పుడు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైపు మళ్లుతున్నాయి.
లిబియాలో అసలు ఏం జరుగుతోంది?
పాక్ కుదుర్చుకున్న ఆ రహస్య ఒప్పందం ఏంటి?
అనే వివరాలు ఇప్పుడు చూద్దాం!.
టర్కీలో ఘోర విమాన ప్రమాదం!
డిసెంబర్ 24, 2025 ఉదయం టర్కీ గగనతలంలో లిబియాకు చెందిన ఓ సైనిక విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో లిబియా ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మొహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్ తో పాటు, థలసేన చీఫ్ అల్-ఫితౌరీ గరీబిల్, సైనిక తయారీ విభాగం డైరెక్టర్ మహమూద్ అల్-ఖతావీ వంటి కీలక వ్యక్తులు మరణించారు. లిబియా అధికారిక సైన్యం ఇప్పుడు నాయకత్వం లేక సంక్షోభంలో పడింది.
లిబియా రాజకీయ సంక్షోభం: ఒక దేశం – ఇద్దరు ఆర్మీ చీఫ్‌లు!
2011లో మొహమ్మద్ గడ్డాఫీ పతనం తర్వాత లిబియా రెండు ముక్కలైంది. ప్రస్తుతం అక్కడ రెండు వేర్వేరు ప్రభుత్వాలు, ఇద్దరు ఆర్మీ చీఫ్‌లు ఉన్నారు.
పశ్చిమ లిబియా (ట్రిపోలి): దీనిని ఐక్యరాజ్యసమితి (UN) అధికారిక ప్రభుత్వంగా గుర్తిస్తుంది. దీనినే Government of National Unity (GNU) అంటారు. ఇప్పుడు మరణించిన అల్-హద్దాద్ ఈ ప్రభుత్వానికి చెందిన ఆర్మీ చీఫ్.
తూర్పు లిబియా (బెంఘాజీ): దీనిని జనరల్ ఖలీఫా బెల్కాసిమ్ హఫ్తార్ నేతృత్వంలోని లిబియన్ నేషనల్ ఆర్మీ (LNA) నియంత్రిస్తోంది. దీనిని ఐక్యరాజ్యసమితి గుర్తించదు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుదుర్చుకున్న ‘అక్రమ’ డీల్! పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ డిసెంబర్ 18న లిబియా పర్యటనకు వెళ్లారు.
అయితే ఆయన ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రభుత్వంతో కాకుండా.. అక్రమంగా తూర్పు లిబియాను పాలిస్తున్న ఖలీఫా హఫ్తార్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. దాదాపు 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33,000 కోట్లు) విలువైన ఆయుధ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఒప్పందంలోని ప్రధాన ఆయుధాలు:-
*16 JF-17 ఫైటర్ జెట్లు: చైనా, పాకిస్థాన్ కలిసి తయారు చేసిన యుద్ధ విమానాలు.
*12 సూపర్ ముషాక్ ట్రైనర్ విమానాలు: పైలట్ల శిక్షణ కోసం ఉపయోగించేవి.
అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన!
లిబియాలో హింసను అరికట్టడానికి ఐక్యరాజ్యసమితి 2011 నుండి ఆ దేశంపై ఆయుధ నిషేధాన్ని విధించింది. దీని ప్రకారం ఏ దేశం కూడా లిబియాకు ఆయుధాలను అమ్మకూడదు. ఒకవేళ అమ్మాల్సి వస్తే కేవలం ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రభుత్వానికే, అది కూడా భద్రతా మండలి అనుమతితో మాత్రమే అమ్మాలి. కానీ పాకిస్థాన్, ఐక్యరాజ్యసమితి గుర్తించని హఫ్తార్ వర్గానికి ఈ ఆయుధాలను సరఫరా చేసేందుకు సిద్ధపడటం అంతర్జాతీయ చట్టాలను నేరుగా ఉల్లంఘించడమే అవుతుంది.
పాకిస్థాన్ ఎందుకు ఈ సాహసం చేస్తోంది?
ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఈ 4 బిలియన్ డాలర్ల నగదు ఎంతో అవసరం. అందుకే నిబంధనలను పక్కనపెట్టి మరీ ఆయుధాలు అమ్మేందుకు సిద్ధమైంది. అసీమ్ మునీర్ ఈ ఒప్పందాన్ని “ఇస్లామిక్ ఐక్యత”గా అభివర్ణిస్తుండగా, ప్రపంచ దేశాలు మాత్రం దీనిని పాక్ చేస్తున్న “ఆయుధాల స్మగ్లింగ్”గా చూస్తున్నాయి.
లిబియా అసలైన ఆర్మీ చీఫ్ మరణించిన రోజే పాక్ కుదుర్చుకున్న ఈ అక్రమ ఒప్పందం బయటపడటం సంచలనంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఈ విషయంలో పాకిస్థాన్‌పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.