– కొత్త సర్పంచ్ లు మొదటి గ్రామ సభలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తీర్మానం చేయాలి
– ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాల పై మరింత భారం మోపుతోంది
– కేంద్ర ప్రభుత్వ తీరుపై గ్రామగ్రామాన గాంధీ ఫోటోలతో నిరసనలు తెలియజేయాలి
– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి బిల్లులో చేసిన మార్పులపై రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్ ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ లు తమ మొదటి గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం లో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తిరిగి గాంధీజీ పేరు చేర్చాలని అన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేయాలని మంత్రి సూచించారు.
2004 లో యుపిఎ ప్రభుత్వంలో సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఉన్న పరిస్థితుల్లో 2004 కి ముందు ప్రభుత్వాల పనితీరు వల్ల ఏర్పడిన ఇబ్బందుల వల్ల సరిదిద్దడానికి ఆనాడు అనేక మంది మేధావులు ,సామాజిక వేత్తలతో చర్చలు జరిపి ఈ వారి సలహాలు సూచనలతో గ్రామీణ ప్రాంతాలను బతికించడానికి ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రజల ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా వలసలు పోకుండా ఉండడానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ప్రజల జీవితాలు మార్చిన ఈ పథకం దేశ రూపు రేఖలు మార్చిందని అభివర్ణించారు.
2014 ఎన్నికల్లో ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరిస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆది చేయకపోగా ఉన్న పథకానికి తూట్లు పొడుస్తుందనీ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ రామ్ జీ పేరు పెట్టీ గతంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించే దీనిని 60:40 నిధులు భరించేలా చేసి రాష్ట్రాల పై మరింత భారం వేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ పథకంపై చేసిన బిల్లుల మార్పు పై వెనక్కి తగ్గాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దేశ అభివృద్ధి నిర్మాణంలో మహోన్నత కార్యక్రమాలతో దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ ల చరిష్మా చేరిపేయాలని చూస్తోందని వారు చేసిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ ను ముందుచిందని పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని గ్రామాల్లో గాంధీ ఫోటోలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.