– ఇప్పుడు యుద్ధం అంటే కేవలం ఆయుధాలు, మిస్సైల్ లు కాదు
బంగ్లాదేశ్ మండుతోంది.
హిందువులు చనిపోతున్నారు.
మోడీ మౌనం.!
భారత్ బలహీనమా?
“దాడి చేయాలి.”
“బంగ్లాదేశ్‌ను ఆక్రమించాలి.”
“చికెన్ నెక్ విస్తరించాలి.”
.. ఇదే ఆందోళన, ఇదే స్లోగన్లు!
ఈ స్లోగన్ ల మధ్య కొంత విశ్లేషిస్తే, అప్పుడే ప్యాటర్న్ కనిపిస్తుంది.
అల్లర్లు యాదృచ్ఛికం కాదు!
డిసెంబర్ 12 – ఢాకా. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు. ఒక హత్య.
షరీఫ్ ఉస్మాన్ హాది.
– యువ నాయకుడు.
– ఎస్టాబ్లిష్‌మెంట్‌కు వ్యతిరేకం.
– యూనస్‌కు వ్యతిరేకం.
– Jamaat-e-Islami కు వ్యతిరేకం.
– BNP, అవామీ లీగ్‌కు కూడా వ్యతిరేకం.
స్వతంత్రుడు. భారీ ఫాలోయింగ్. ఎన్నికలకు సిద్ధం.
అప్పుడు ప్రశ్న వచ్చింది —
అతని మరణంతో ఎవరు లాభపడతారు?
కథనం ఒక్కసారిగా మారింది!
భారత వ్యతిరేక నినాదాలు. భారత దౌత్య కార్యాలయం వైపు మార్చ్. అక్కడితో ఆగలేదు. ఫ్లైఓవర్లు ధ్వంసం, మీడియా కార్యాలయాలు తగలబెట్టడం, పార్లమెంట్‌పై దాడి, తమ దేశాన్నే పగలగొట్టడం.
అధికారంలోకి రావాలనుకునే పార్టీ తన దేశాన్నే ఎందుకు నాశనం చేస్తుంది?
లక్ష్యం పాలన కాదు… కూల్చివేత అయితేనే.
ఎవరు లాభపడుతున్నారు?
ఇది హసీనా అవామీ లీగ్ కాదు.
ఇంకొక జాతీయ పార్టీ BNP కూడా కాదు. (BNP ఢిల్లీతో మౌనంగా మాట్లాడిందనే నివేదికలు ఉన్నాయి). రెండు జాతీయ పార్టీ.లు ఢిల్లీ తో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉన్నాయి అని నివేదికలు.
అవామీ లీగ్ గెలిచినా, BNP గెలిచినా — బంగ్లాదేశ్ మళ్లీ భారత్ వైపు వంగుతుంది.
అది కొందరికి అంగీకారమే కాదు.
ఈ అనిశ్చితి తో లాభపడేది ఎవరు?
జామాతే-ఈ-ఇస్లామీ!
కలకలం — వారికి బలం.
భయం — వారికి ఇంధనం.
ఎన్నికలు లేవంటే — వారికి అవకాశాలు.
యూనస్ పాత్ర?
– ఎన్నికల ద్వారా వచ్చిన నేత కాదు
– విదేశీ మద్దతుతో ఉన్న వ్యక్తి
– అస్థిరతలోనే అతని బలం
– అసలు లక్ష్యం ప్రతిపక్షం నిర్వీర్యం
– ప్రత్యామ్నాయం మాయం
తర్వాత ‘మాస్టర్‌స్ట్రోక్’
ఒక వీడియో.
ఒక హిందూ వ్యక్తి., గుంపు దాడి., లించింగ్.
తగలబెట్టడం.
భయంకరం. నిజం
కానీ డేటా ఏమంటుంది?
ఈ అల్లర్లలో ఇప్పటి దాకా సుమారు 250 మంది మృతి. వారిలో హిందువులు కేవలం ఇద్దరు
అయినా — ఒక్క వీడియో. భారత ఫోన్లన్నింట్లో. ప్రతి ప్లాట్‌ఫాం. ప్రతి చానల్.
ఫలితం?
ఆగ్రహం!
భారత పార్లమెంట్లో ప్రకటనలు.
“ఇప్పుడే చర్య తీసుకోండి.”
“లేదంటే బలహీనంగా కనిపిస్తారు.”
హిందువులపై కాంగ్రెస్ ప్రేమ?
అక్కడే క్లిక్ అయ్యింది.
ఇది సహజం కాదు., ఇది కావాలి చేసిన ఒత్తిడి.
భారత్ యుద్ధానికి దిగితే?
బంగ్లాదేశ్ = ఉక్రెయిన్ 2.0
నిరంతర యుద్ధం. అంతులేని ఖర్చు. ఆర్థిక ఒత్తిడి. స్వయం ప్రతిపత్తి క్షీణత.
అప్పుడు బంగ్లాదేశ్‌ను ఎవరు నడుపుతారు?
విదేశీ శక్తులు!
లాభం ఎవరిది? విదేశీ శక్తులకు!!
యుద్ధాలు భావోద్వేగాలతో నడవవు. ఇది వీధి పోరాటం కాదు — చదరంగం. జియో పొలిటికల్ ఆట.
భారత్ స్పందించలేదు. భారత్ ఆగింది. మోడీ చూశాడు. అజిత్ డోవాల్ చదరంగపు బోర్డు చదివాడు. ఆయన ఆడే ఆట ఆయన ఆడాడు. బంగ్లా లో పరిస్థితి నెమ్మదిగా అదుపులోకి వచ్చింది. బంగ్లా ఆర్మీ నిశ్శబ్దముగా పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకుంది.
కాబట్టి — “బంగ్లాదేశ్‌పై దాడి చేయాలి” అని అరిచేముందు ఆలోచించండి.
గట్టిగా వినిపించే ఆగ్రహమే అతి పదునైన ఉచ్చు. వారికి కావాల్సిందే మనము చేయకూడదు. మనము చెయ్యాల్సిందే మనము చేయాలి. వైరల్ అయ్యేదే నిజం కాదు.
నిజమైన ఆట? స్క్రీన్లపై కాదు. నిశ్శబ్దంలో ఆడతారు. ఆడాల్సిన చోట ఆడతారు.
ఇప్పుడు యుద్ధం అంటే కేవలం ఆయుధాలు, మిస్సైల్ లు కాదు.
దౌత్య చతురత, కొట్టాల్సిన చోట నిశ్శబ్దముగా కొట్టడం.
– రవీంద్ర తీగల