– మంత్రి శ్రీధర్ బాబు కుటుంబంపై చరిత్రలు బయటపెడతానంటూ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడంపై బ్రాహ్మణ సంఘాల అసహనం
– మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రాహ్మణ సంఘాల బహిరంగ లేఖ
హైదరాబాద్: రాజకీయాల్లో అజాతశత్రువైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్టా మధును, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతో బ్రాహ్మణ సంఘాలు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు బహిరంగసభ రాశాయి. లేఖ పూర్తి పాఠమిదీ..
గౌరవ మాజీ ముఖ్య మంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి,
విషయం: మంథని మాజీ ఎం ఎల్ ఏ పుట్టా మధుకర్ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి మీద మరియు వారి కుటుంబ సభ్యుల మీద చేసిన తప్పుడు కూతలు పై- కఠిన చర్యలు గురించి.
అయ్యా,
మీ పట్ల కానీ , మీ పార్టీ పట్ల కానీ బ్రాహ్మణ సమాజానికి ఒక గౌరవం ఉంది. కానీ అటువంటిది మీ పార్టీ లో ఉన్న పుట్టా మధు గతంలో అనేక సార్లు బ్రాహ్మణుల పైన ద్వేష భావం తో కూడిన వ్యాఖ్యలు చేశారు, దానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు.
ఇప్పటికీ ఇంకా అతని వైఖరి మారలేదు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారి మీద, వారి కుటుంబం సభ్యుల పై అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది,విలువల తో కూడిన రాజకీయాలు నడిపించాల్సిన మీ పార్టీ ఇటువంటి చీడ పురుగులను ప్రోత్సహించడం మంచిది కాదు.
బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తులు పట్ల పదే పదే అసభ్య పదజాలం వాడుతూ దూషించడం సరికాదు. మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు రాజకీయాలలో అజాత శత్రువుగా గుర్తింపు పొందారు, బ్రాహ్మణ సమాజానికి వారు చేసిన మంచి సేవలు నేటికి బ్రాహ్మణ సమాజం మరిచిపోదు అని మీకు గుర్తు చేస్తున్నాము.
తక్షణమే పుట్టా మధు మీద కఠిన చర్యలు తీసుకొని, మీ పార్టీ నుండి సస్పెండ్ చేయవలసింది గా బ్రాహ్మణ సమాజం డిమాండ్ చేస్తుంది.
ఇట్లు
బ్రాహ్మిణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్ /BOSS)
ఎన్. లక్ష్మీనారాయణ
డీ. సుధాకర్ శర్మ
ఏ. సూర్యప్రకాష్
ఎన్ దేశాయ్
పీ. విజయ్ కుమార్
(బాస్ కోర్ కమిటీ సభ్యులు )