– రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు రెండు సార్లు ఉరి తీయాలి
– హరీష్ రావు పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్నారు
– ఆయన హౌస్ లో మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది
– పాలమూరు రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడ్డ వారిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ను చేయడం అన్యాయం
– తెలంగాణ శాసన మండలి మెంబర్స్ లాంజ్ లో ఎమ్మెల్సీకవిత చిట్ చాట్
హైదరాబాద్: సెప్టెంబర్ 3 తేదీన నేను నా రాజీనామా చేశాను. నాలుగు నెలలుగా నా రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు కౌన్సిల్ నడుస్తోంది.. నా రాజీనామా యాక్సెప్ట్ చేసే ముందు ఫ్లోర్ లో నేను మాట్లాడే పర్మిషన్ ఇవ్వాలని ఛైర్మెన్ గారిని అడుగుతాను.. హౌస్ లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటాను.
నిన్న కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం మాట్లాడిన మాటలు ఆమోద యోగ్యం కాదు. కెసిఆర్ ని ఉరి తీయాలి అంటున్నాడు. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు రెండు సార్లు ఉరి తీయాలి. పాలమూరుకు తీరని అన్యాయం చేస్తున్నదే రేవంత్.
ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడ్డ వారిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ను చేయడం అన్యాయం.ప్రాజెక్టు సోర్స్ పాయింట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్తే బావుంటుంది.
హరీష్ రావు పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్నారు..ఆయన హౌస్ లో మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి తో ఆయన ఛాంబర్ లో హరీశ్ రావు ప్రత్యేకంగా మాట్లాడుకున్నది అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకారం ఇస్తే బీఆర్ఎస్ కు నష్టమే.
బీఆర్ఎస్ పై మనసు విరిగింది. కేసీఆర్ పిలిచిన సరే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళేది లేదు. మొదటి నుండి నేను స్వతంత్రంగా పని చేశాను. కేసీఆర్ డైరెక్షన్లో హరీష్ కేటీఆర్ పని చేశారు. నేను జాగృతి జెండాతో ముందుకు వెళ్ళాను.
తెలంగాణ కు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉన్నది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేస్తాం. జాగృతి జనంబాట లో ప్రజల కష్టాలను కళ్ళారా చూస్తున్న. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొత్త ఒక్క కరెంట్ ఫోల్ కూడా తండాలకు ఇవ్వడం లేదు. మిషన్ భగీరథ ను ఆగం చేశారు. తాగునీటి కోసం ప్రజలు, గిరిజనులు తండ్లాడుతున్నారు.