– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అసెంబ్లీని గాంధీ భవన్ లా నడిపిస్తున్నారు. అసెంబ్లీని అసెంబ్లీలాగా నడిపిస్తేనే మేము సభలోకి వస్తాము. మా ఇష్టం ఉన్నట్లు చేసుకుంటామని వ్యవహరిస్తున్నారు. చరిత్రలో అనేక ప్రభుత్వాలను చూశాము. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సలహాలు, సూచనలు ఇవ్వమని అంటారు.మరోవైపు బూతులు తిడతారు. మూసీ పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.