భోగాపురం ఎయిర్‌పోర్టులో కేవలం తన పాత్ర గురించి చెబితే ఎవరూ నమ్మరని గ్రహించి.. ‘విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది’ అని జగన్ స్వయంగా గడ్కరీ గురించి ప్రస్తావించారు.
ఇదో టెక్నిక్! కానీ చేసిన పాపాలు ఊరికే పోవు కదా!
చంద్రబాబు గారు మళ్లీ గెలిచి వైజాగ్ మెడ్‌టెక్ జోన్‌కు వెళ్లినప్పటి వీడియో ఇది.
నాడు ఇదే గడ్కరీ గారి దగ్గరకు ఏపీ మెడ్‌టెక్ జోన్ (AMTZ) సీఈఓ జితేంద్ర శర్మ గారు వెళ్లి, గత ప్రభుత్వం రోడ్ల ప్రపోజల్స్‌ను ఎలా పక్కన పడేసిందో, జగన్ నిర్వాకం వల్ల ప్రాజెక్ట్ ఎలా కుంటుపడిందో మొరపెట్టుకున్నారు.
అప్పుడు గడ్కరీ గారు స్పందిస్తూ.. ‘విజన్‌తో చంద్రబాబు గారు ప్రారంభించిన ఈ మిషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు, నేను మీకు అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చి, నిధులు కేటాయించి మరీ రోడ్లు వేయించారు.
2019 నుండి 2023 వరకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) మరియు నాటి ఏపీ ప్రభుత్వం మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల, 2023లో ఈ ప్రాజెక్ట్ పేరును లబ్ధిదారుల జాబితా నుండి తొలగించడం జరిగిందని జితేంద్ర వివరించారు. అప్పట్లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ, ఆయన విజన్ దెబ్బతినకూడదని గడ్కరీ గారు ఫేజ్-2 రోడ్ల పనులన్నీ పూర్తి చేయించారు.
ఆ రోజు మన ‘బిల్డప్ రెడ్డి’ని మనసులో ఎన్ని తిట్లు (బూతులు) తిట్టుకున్నారో నితిన్ గడ్కరీ గారు! చంద్రబాబు గారి విజన్ అయిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ అయినా, వైజాగ్ మెడ్‌టెక్ జోన్ అయినా.. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆపడానికి విశ్వప్రయత్నం చేసినా అవి ఆగలేదు.
ఒక దశలో జితేంద్ర శర్మ గారి మీద విజయసాయి రెడ్డితో ఆరోపణలు కూడా చేయించారు. అయినా ఆయన ఢిల్లీకి వెళ్లి పోరాడి, తిరిగి వచ్చి పనులు కొనసాగించారు. తీరా చూస్తే, అవేమీ పట్టనట్లు సిగ్గులేకుండా అదే జగన్ రెడ్డి.. మెడ్‌టెక్ జోన్‌లో తయారైన టెస్టింగ్ కిట్లు, మాస్కులను తన వద్దకు తెప్పించుకుని ఆవిష్కరించి బిల్డప్ ఇచ్చారు.
‘రోడ్డు మీద గుంతలో తట్టెడు మట్టి వేయలేని బిల్డప్ రెడ్డి భోగాపురం ఎయిర్‌పోర్టు కట్టానని చెప్పాడట’ అనేది నేటి సోషల్ మీడియా సామెత. క్రెడిట్ కోసం కన్నాలు వేసి బిల్డప్ ఇచ్చుకునే ఇలాంటి దిక్కుమాలిన జగన్ రాజకీయాలు చూసి.. సొంత పార్టీలో కూడా ఛీ ఛీ అంటున్నారు.