ఈ కాలంలో పెద్ద మనసుతో ఇలా ఆలోచించే వారు ఉన్నారు!
కలికాలంలో ఇలాంటి వారు ఉండబట్టే తెలుగు జాతి ప్రభ తగ్గలేదు!
“గంగ-కావేరి కలవాలి.. దేశంలో నీటి సమస్య పోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు.. సమైక్యత అవసరం.
విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా అభ్యంతరం చెప్పలేదు. గోదావరిలో చాలా నీళ్లున్నాయని అభ్యంతరం చెప్పలేదు. గతేడాది కృష్ణా, గోదావరి నుంచి 6 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి.
ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్టులు కట్టాం. నా హయాంలో తెలంగాణలో కల్వకుర్తి, ఏఎంఆర్, నెట్టెంపాడు పూర్తి చేశా. భీమా ఎత్తిపోతల కూడా నా హయాంలోనే పూర్తయింది. గోదావరిపైనా ఉమ్మడి ఏపీలో అనేక ప్రాజెక్టులు కట్టాం.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు.. సమైక్యత అవసరం. ఐకమత్యంగా ఉంటేనే తెలుగువాళ్లు ప్రపంచంలో నెంబర్‌వన్ అవుతారు” అని ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా కోట్లాది తెలుగు వారికి చంద్రబాబు తన సదుద్దేశాన్ని చాటారు. ‘తెలుగు జాతికి నేను రుణపడి ఉంటా’ అని తన కృతజ్ఞతను చాటుకున్నారు.
కలాం గారి లాగే ఎంతో మంది నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. ఎవరు అడ్డుపడ్డా అది జరిగితీరుతుంది. వరదతో నష్టపోయే దిగువ రాష్ట్రాలను దోషిగా చూపించే ఎన్నికల బూచాళ్లను, కాలం బొందపెట్టాక తెలుగు జాతి మరిచిపోతుంది. అలాంటి చరిత్రహీనుల్లా కాలగర్భంలో కలిసిపోతారు.
ఎగువ రాష్ట్రాలతో వారి రాష్ట్రంలోకి వెళ్లి ఆల్మట్టి మీద పోరాడి, బంధీగా వుంటే.. నువ్వు వెళ్లు స్వామీ అని బ్రతిమాలి సగర్వంగా మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబును తీసుకువచ్చి హైదరాబాదులో వదిలిపెట్టింది. అది చరిత్ర. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు.
చరిత్రలో తమకంటూ ఒక పేజీ లిఖించుకొనే మహనీయులు ఇలా అరుదుగా ఉంటారు