– నువ్వొక తోలుబొమ్మవి.. కీలుబొమ్మవి
– లిక్కర్ కేసు లో పార్టీ పరువు తీశావు
– లిక్కర్ స్కాం లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేస్తారా?
– కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు.మీరు?
– నీ ఆస్తుల ముందు కేసీఆర్ ఆస్తులు ఎంత?
– కవితపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ , టిఎస్పీఎస్ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్
హైదరాబాద్: ఎవరో ఆడిస్తే కీలు బొమ్మ గా ఆడిస్తే కరెక్ట్ కాదు. మీరు స్వతహాగా జాగృతి పెట్టుకొని ఎవరో ఆడిస్తే మంచిది కాదు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను క్షోభకు గురి చేస్తే మంచిది కాదు. ఎవరో మీ వెనుక. ఉంది ఆడిస్తే మీరు ఆట ఆడుతున్నట్లు అందరికీ తెలుసు,అదే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ బహిష్కరణ చేస్తే దానిపై కూడా ఏదేదో మాట్లాడారు. ఎవరు చెప్తే శాసన సభ బహిష్కరణ చేస్తారో పార్టీలో మీకు తెల్వదా?
మీరు నాలుగు నెలల క్రితం ఎమ్మెల్సీ పదవి కి రాజీనామా చేస్తే ఎందుకు పదవిలో కొనసాగారు? మీరు మనస్పూర్తిగా రాజీనామా చేయలేదా? మా సభ్యులు అసెంబ్లీ బహిష్కరణ చేస్తే మీరు శాసన మండలి కి ఎందుకు వెళ్ళారు? మీ దగ్గరకు అంగన్వాడీలు,ఆయా ,చాలా మంది వస్తారు అంటున్నావు. మరి శాసన మండలిలో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఇవాళ కంటతడి పెట్టారు,పార్టీలో మీరు ఎన్ని పదవులు ఇప్పిచ్చారో అందరికీ తెలుసు.
అధ్యక్షుడు వద్ద మీకు ఉన్న చనువు ఎవరికీ లేదు. మీకు నచ్చిన వారికి పదవులు ఇప్పించుకున్నారు. ఎంపీగా గెలిచి 9మంది ఎమ్మెల్యేలను గెలిచారు అంటున్నారు. అయితే స్థానికంగా ఎమ్మెల్యే లుగా ఉంటే ఎంపీలు గెలుస్తారు. బిఆర్ఎస్ మార్చినప్పుడు నాకు చెప్పలేదు అంటున్నారు. మరి మీరు ఎందుకు భారత జాగృతి ఎందుకు ఏర్పాటు చేశారు? మీరు ఎంపీగా ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చారు.
మీకంటే సీనియర్ అయిన వినోద్ కుమార్ కాదని మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నారు. అదే లేకపోతే మీరు పదవులు ఎలా ఇప్పించుకున్నారు? ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది అని అందుకు నివాళి గా 125అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది. మీరు ఎంపీగా ఓపిడిపోయి కంటతడి పెడితే ఓదార్చి మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి మండలిలో మీరు కంటతడి పెడితే మీకు ఎవరు ఇస్తారు? ఎవరు ఓదార్చుతారు?
మీ కోసం పార్టీ అన్ని సమయాల్లో అండగా ఉన్నది. మీరు జైలు లో ఉన్నప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం మీకోసమే ఆలోచన చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీ గురించి ఆలోచన చేసి ఢిల్లీలోనే మకాం వేశారు.అలాంటి వాళ్ళను పట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వారి వ్యక్తిగత విషయాలు మండలిలో మాట్లాడుతూ ,నేను రూల్ ప్రకారం మాట్లాడుతున్నాను అన్నారు. మండలి లో మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి తప్ప పార్టీ మీద మా అధ్యక్షుడు పైన మాట్లాడారు.
మీ పద్ధతి మార్చుకోండి. మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. జనం బాట పేరుతో బీ ఆర్ ఎస్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోము. బీ ఆర్ ఎస్ శ్రేణులు ఆగ్రహిస్తే కవిత గ్రామాల్లో తిరగలేదు. మా ఓపిక ను బలహీనత గా భావించొద్దు. ఉద్యమ కారులకు పదవులు ఇవ్వక వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు అంటున్నావ్.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వేరే పార్టీ నుంచి వచ్చారు. ఆయన మాత్రం నీకు ఉద్యమకారుడిలా కనిపిస్తున్నారా ?
ఉద్యమం ప్రారంభం అయ్యాక 6 ఏండ్ల కు కవిత ఉద్యమంలో కి వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడుతున్న సమయంలో అందరూ కలిసి వచ్చారు అలానే కవిత వచ్చారు. 2006లో తెలంగాణ కవితా వచ్చారు అందరిలా ఆమె కూడా పని చేశారు. పని కి తగ్గట్టు ఆమెకు ఎంపిగా, ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. కవిత ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు బాధేస్తున్నాయి.
ఆ రోజుల్లో మీరు ఎంత మంది కి పదవులు ఇచ్చారు? ఎంత మంది బీసీలకు మీరు పదవులు ఇప్పించారు? అప్పుడు అంతర్గతంగా మాట్లాడాను అంటున్నారు. ఎన్నడు కూడా అలా మాట్లాడలేదు. కానీ మీరు జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు. మీరు జైల్ లో ఉన్నప్పుడు మిమ్ములను మీ కోసం ఎంత కష్టపడి అక్కడే ఉన్నారో అందరికీ తెలుసు…
మీరు జైలు లో ఉన్నప్పుడు మీరు బిజెపి వాళ్ళ మెప్పు కోసం మాట్లాడారో తెల్వదా? మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టిన సంగతి మర్చిపోతే ఎలా. అయోధ్య రాముడి గురించి పోస్టులు పెట్టి పొద్దున్నే డిలీట్ చేసింది మీరు కాదా? ఈ విషయం ముస్లింలు ఎవరు మర్చిపోరు. జాగృతి జాగృతి అంటున్నారు మీరు చేసే జాగృతి కార్యక్రమాలకు బిఆర్ఎస్ కార్యకర్తలు పని చేయలేదా? బి ఆర్ ఎస్ కార్యకర్తలు లేనిదే మీరు ఊర్లలో మీ జాగృతి కార్యక్రమాలు చేశారా?
తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం అన్ని వదులుకొని పని చేశారు. నీలాగా ఎలాంటిది ఆశించలేదు. అనేక మంది ఉద్యమకారులకు ఉద్యోగాలు వచ్చాయి. మీకు ఏదో నష్టం జరిగినట్లు చెబుతున్నారు. శాసన మండలి లో మీ వ్యక్తిగత విషయాలు చెప్పడానికా…ప్రజా సమస్యలు కదా శాసన మండలి లో చెప్పాల్సినవి?
మీరు శాసన మండలి లో మాట్లాడిన మాటలు ఎవరికి లాభం జరుగుతుంది? కేసీఆర్ పై రోజు తిట్టే వారికి లాభం జరుగుతుందా? మీరు బిఆర్ఎస్ ను రోజు విమర్శిస్తే మర్చిపోతే ఎలా? లిక్కర్ కేసు సమయంలో ప్రధాన పత్రికలను ఉద్దేశించి తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతా అన్నారు. పెట్టారా?
ఆమె వ్యక్తిగత విషయాలు కోసం ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నది. ఆమె ఆవేదనతో పార్టీకి, కేసీఆర్ కు నష్టం చేసే పని చేస్తోంది. దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ పై నమ్మకం ఉండే ఆయనను చెడగొట్టిన ఖాతాలో, మీరే ఉన్నారు గా? లిక్కర్ స్కాం లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేస్తారా? నీ లిక్కర్ స్కాం వలన కేజ్రీవాల్ అంతకు దిగజారి పోయారు.
మీరంటే మాకు గౌరవం కానీ మీరు మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలకు ,పేదలకు బడుగు బలహీన వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఉండాలి. మీరు పార్టీ పెట్టుకోండి ఎవరికి అభ్యంతరం లేదు మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది. మీరు అధికార పార్టీకి అండగా వారికి లాభం చేకూరే విధంగా మాట్లాడుతున్నారు. మీరు రోజు మీడియా ముందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు. కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు.మీరు?
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ పై కమీషన్ విచారణ అప్పుడు ఎవరు రెస్పాండ్ కాలేదు నేను బాధ పడ్డాను అన్నారు. రాజీనామా చేశాను అన్నారు. మరి గన్ మెన్ లను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇవాళ మళ్ళీ మండలిలో ఎలా మాట్లాడుతున్నారు. ఇవాళ మండలిలో మాట్లాడారు కదా ఎవరికి మీరు పదవులు ఇప్పించారు. నేను కదా మీతో ఉన్నది నాకు ఏం చేశారు? నేను మొదట కదా బతుకమ్మ పండుగ చేసింది మీకోసం. మరి నా లాంటి వాళ్లకు ఏం ఇప్పించావు?
ఏం పీకి కట్టలు కట్టారు అనేది రైతులను,ప్రజలను, ఉద్యోగులను అడగండి. .రైతులు పంటలు పండించిన విషయం చెప్తారు. ఆశలను, అంగన్వాడీ లను అడగండి. మీ వల్లనే కేసీఆర్ మచ్చ వచ్చింది. ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇచ్చారు అప్పుడు కేసీఆర్ పై మచ్చ వచ్చింది అందరూ ఎమ్మెల్యే లుగా గెలిపించే మీరు మీరు ఎంపీగా ఎందుకు ఓడిపోతున్నారు?
మీ వెనుక ఎవరు ఉన్నారు? ఎన్ని రోజులు ఆయన నిద్రలేని రాత్రులు గడిపారు. కేజ్రీవాల్ కు కాదు కేసీఆర్ కూడా దెబ్బ తగిలింది. ఆమె వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు అని కూడా చర్చ జరుగుతోంది. కేసీఆర్ దశాబ్ద కాలం పాలనను తప్పు పడితే మీకు నష్టం ఆస్తుల పంచాయతీ కాదు అధికార పంచాయతీ అంటున్నారు. మీ ఆస్తుల ముందు కేసీఆర్ ఆస్తులు ఎంత?