– కాంగ్రెస్,బీజేపీ వ్యభిచార రాజకీయం
– వెదిరే శ్రీరామ్ కు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏం పని?
– ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్ లో వెదిరే శ్రీరామ్ కు ఏం పని?
– రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెదిరే శ్రీరామ్ ముగ్గురు కలిసి కేసీఆర్ పై కుట్రలు
– రేవంత్ రెడ్డిని మెప్పించడం కోసం తెలంగాణ బీజేపీ శాఖకు తాళం వేసుకోండి
– కాళేశ్వరం ప్రాజెక్టుపై,మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ పై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు?
– తెలంగాణ బీజేపీని ఏమైనా కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చారా…?
– ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్
హైదరాబాద్: కాంగ్రెస్,బీజేపీ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలు. పిల్లి,ఎలుకలు అయినా కలిసి ఉంటాయేమో కానీ కాంగ్రెస్,బీజేపీ కలవవు. తెలంగాణలో కాంగ్రెస్,బీజేపీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాయి. పనిగట్టుకుని బిఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలి.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాసే విధంగా వెదిరే శ్రీరామ్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ పై వెదిరే శ్రీరామ్ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రా ఆదిత్య నాధ్ దాస్ ఏపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ పై అవగాహన ఉన్న వెదిరే శ్రీరామ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారు.
ఒక్క అంశంపైన అయినా కాంగ్రెస్ ను బీజేపీ నేతలు నిలదీశారా? బీజేపీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నేతలుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి మరో హిమంత బిశ్వ శర్మ అవుతారని బీజేపీ అనుకుంటుంది. వెదిరే శ్రీరామ్ కు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏం పని?
ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్ లో వెదిరే శ్రీరామ్ కు ఏం పని? రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,వెదిరే శ్రీరామ్ ముగ్గురు కలిసి కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి,వెదిరే శ్రీరామ్,రేవంత్ రెడ్డి మాటల్లో తేడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరి ప్రయోజనం కోసం తెలంగాణకు 299 టీఎంసిలు కేటాయించారు? వెదిరే శ్రీరామ్ కు ఈ విషయం తెలియదా?
రేవంత్ రెడ్డికి వెదిరే శ్రీరామ్ కొమ్ము కాస్తూ ఆరోపణలు చేస్తున్నారు.తెలంగాణకు 299 టీఎంసిల కేటాయింపు వెనుక ఉమ్మడి ఏపీ,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగింది. కేసీఆర్ సీఎం అయ్యాక 28 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ జలాలపై రాశారు. చంద్రబాబును మెప్పించడం కోసం బీజేపీ పని చేస్తోంది.బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఎందుకు రావడం లేదు?
కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నీటి హక్కుల కోసం ఎందుకు మాట్లాడటం లేదు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు కాంగ్రెస్,బీజేపీ ఒక్కటి అయ్యాయి.రేవంత్ రెడ్డిని మెప్పించడం కోసం తెలంగాణ బీజేపీ శాఖకు తాళం వేసుకోండి. కేసీఆర్ తెలంగాణకు చేసిన ప్రయోజనాన్ని చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని 2020లోనే బిఆర్ఎస్ మాట్లాడింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళింది. రేవంత్ రెడ్డి,వెదిరే శ్రీరామ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందరూ వెళ్లి మోడీ వద్దకు వెళ్లి కృష్ణా జలాలు 70 శాతం తీసుకుని రండి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు కేసీఆర్ హాజరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై 18 లేఖలు కేసీఆర్ కేంద్రానికి రాశారు.
అధికారం పోయి రెండు ఏళ్ళు అయినా కేసీఆర్ పైన ఏడుస్తున్నారు. పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో వెదిరే శ్రీరామ్ అడగాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో కాంట్రాక్టర్ల కుమ్మక్కుపై వెదిరే శ్రీరామ్ మాట్లాడాలి. కాంగ్రెస్, బీజేపీ వ్యభిచార రాజకీయం చేస్తున్నాయి. మోడీ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి మాట మాట్లాడుతున్నారు
తెలంగాణలో బీజేపీ ముసుగులో ఉన్న కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కేసీఆర్ పై ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మోడీ,రేవంత్ రెడ్డి బడే భాయ్,చోటా భాయ్ లా పని చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సిగ్గు పడాలి. 200 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు రేవంత్ రెడ్డి రిపేర్ చేయడం లేదు?
కాళేశ్వరం ప్రాజెక్టుపై,మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ పై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణ బీజేపీని ఏమైనా కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చారా? బీజేపీ నేతలకు తెలంగాణలో కాంగ్రెస్ దుర్మార్గాలపై మాట్లాడే మనసు ఎందుకు రావడం లేదు? కాంగ్రెస్ తానా అంటే బీజేపీ నేతలు తందానా అంటున్నారు. కాంగ్రెస్,బీజేపీ అక్రమ సంబంధాన్ని ప్రజలకు వివరిస్తాం.
మోడీ ఆర్ ఆర్ ట్యాక్స్ అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఎవరైనా ఆర్ ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడారా ? రేవంత్ రెడ్డిపై ఎందుకు బీజేపీ మాట్లాడటం లేదు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సరెండర్ అయింది.
రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ను డ్యామేజ్ చేయడం కోసం చాలా మందితో మాట్లాడిస్తున్నారు. ఆ మాటలు ఎవరికి ఉపయోగపడుతున్నాయో ఆలోచించాలి. రేవంత్ రెడ్డికి మేలు చేసే విధంగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగితే విచారణ చేయమని చెప్పండి. అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు.
అమరవీరుల స్థూపాన్ని ఎందుకు ఓపెన్ చేయడం లేదు? బిఆర్ఎస్ పార్టీ,కేసీఆర్ పై ఎవరు మాట్లాడినా ఆత్మ విమర్శ చేసుకోవాలి. గోదావరి బనకచర్లపై బీజేపీ వైఖరి చెప్పాలి. గోదావరి జలాలపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? ప్రెస్ మీట్ లో పల్లె రవికుమార్, గోసుల శ్రీనివాస్ యాదవ్ , కురువ విజయ్ కుమార్ ,కట్ల స్వామి యాదవ్ పాల్గొన్నారు.