– .సీఎం ,మంత్రులు చేస్తున్న పనులు తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్నాయి
– రేవంత్ రెడ్డి రాము,రెమో రెండు పాత్రలు పోషిస్తున్నారు
– రేవంత్ ఉస్మానియా వర్శిటీకి ఇస్తానన్న వెయ్యి కోట్లు ఎక్కడ?
– బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ..
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి 1,000 కోట్లు ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం హామీ ఇచ్చి నెల రోజులు అయింది. సీఎం హామీలు ఇస్తారు. అమలు మాత్రం సున్నా. దేవుళ్లపై ఒట్లు,ప్రతిపక్షాలను తిట్టడం సీఎం పని. నిరుద్యోగులను వాడుకుని వదిలేశారు.
కాంగ్రెస్ పార్టీ మోసం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరుద్యోగులపై ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడుతోంది.ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.సీఎం అబద్ధాల వర్షం కురిపిస్తున్నారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 500 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఓయూకు 1,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో సీఎం చెప్పాలి.
యూనివర్సిటీ భూములను సీఎం గుంజుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 450 ఎకరాలను గుంజుకున్నారు. యూనివర్సిటీల్లో ఉన్న భూములపై సీఎంకు గుండెల నిండా ప్రేమ ఉంది. ఉర్దూ యూనివర్సిటీ భూములను లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.ఐ.ఎస్.బి భూములను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.
రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఉస్మానియా యూనివర్సిటీ భూములపై రెక్కీ నిర్వహిస్తున్నారేమో? అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు 100 ఎకరాలు హైకోర్టుకు ఇచ్చారు. రేవంత్ రెడ్డి విద్యా శాఖకు బదులుగా రియల్ ఎస్టేట్ శాఖకు మంత్రిగా ఉంటే బాగుండేది. గురుకులాల్లో చదివే విద్యార్థులకు కనీసం రగ్గులు ఇవ్వడం లేదు.
విద్యా సంస్థల భూములపై రేవంత్ రెడ్డి కన్నుపడింది. కనీసం ఒక్క పూట అయినా నాణ్యమైన భోజనం పెట్టాలని యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని సీఎం పరేడ్ గ్రౌండ్స్ లో మాట ఇచ్చారు. యూనివర్సిటీలో కాంట్రాక్టు సిబ్బంది స్ట్రైక్ చేస్తున్నారు. కాంట్రాక్టు సిబ్బంది స్ట్రైక్ చేస్తే వాళ్ళ జీతాలను కట్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా నిరుద్యోగులు ఎన్నికల్లో పని చేశారు. రేవంత్ రెడ్డి రాము,రెమో రెండు పాత్రలు పోషిస్తున్నారు. పోలీసులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ప్రయివేటు షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు సీఎం వచ్చిన సందర్భంగా అశోక్ నగర్ లో నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వచ్చారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చారు
జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ గా మారింది. కాంగ్రెస్ హామీలు బూటకం.
పోలీసు లాఠీలకు,తూటాలకు నిరుద్యోగుకు,విద్యార్థులు భయపడరు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలి.. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని వెంటాడి నిలదీస్తాము. రేవంత్ రెడ్డి సీఎంగా,హోంమంత్రిగా,విద్యా శాఖా మంత్రిగా ఫెయిల్ అయ్యారు.
తెలంగాణ ఉద్యమం అణచివేత నుంచి పుట్టింది. నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాయబోతుంది. ప్రభుత్వం ఎక్కడ భూములు ఉన్నాయి రియల్ ఎస్టేట్ దందా ఎక్కడ చేయాలని కుట్రలు చేస్తోంది. విద్యా శాఖపై రేవంత్ రెడ్డి ఏ రోజు అయినా రివ్యూ చేశారా? రాష్ట్రంలో ఐదు వేల స్కూళ్ళు మూతపడ్డాయి. 3,500 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలి. కేవలం 450 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వం మెడలు వంచుతాము
సీఎం,మంత్రులు ఒక్కరికి సోయి లేదు..బీ ఆర్ ఎస్ పాలనలో చెరువులు నింపి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసి నీలి విప్లవం తెచ్చాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకో రకమైన నీలి విప్లవం నడుస్తోంది. సీఎం ,మంత్రులు చేస్తున్న పనులు తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్నాయి. ప్రెస్ మీట్లో బీ ఆర్ ఎస్ నేతలు బాలరాజ్ యాదవ్ , పల్లె రవికుమార్ ,రాంబల్ నాయక్ ,యాదయ్య గౌడ్ పాల్గొన్నారు