కాలయంత్రంలో వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తోందా? అవును! గండికోట గడ్డపై ఇప్పుడు చరిత్ర పురుడుపోసుకుంటోంది. సాదాసీదాగా పుస్తకాల్లో చదువుకున్న చరిత్ర కాదు… మీ కళ్ల ముందే సజీవంగా కదలాడే దృశ్యకావ్యం!
డోమ్ కింద మీరు కూర్చుంటే, నలువైపులా గండికోట శౌర్యం ఉప్పొంగుతుంది. ఆ కోట గోడలు, ఆ గంభీరమైన లోయలు, పెన్నా నది గలగలలు.. అన్నీ మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి.
ఏనుగుల అంబావారీలు.. గుర్రపు డెక్కల చప్పుడు.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే పౌరుషం! ఆ త్రీడీ షోలో కత్తుల యుద్ధం జరుగుతుంటే, మీ గుండె వేగం పెరగడం ఖాయం. ఆ నాటి వైభవం కేవలం కళ్ళకే కాదు, మనసుకి కూడా హత్తుకుపోతుంది.
మునుపెన్నడూ లేని విధంగా, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ త్రీడీ షో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. వందల ఏళ్ల చరిత్రను కేవలం నిమిషాల్లోనే కళ్లకు కట్టినట్లు చూస్తుంటే, ప్రతి పర్యాటకుడి రక్తం ఉరకలు వేయక మానదు!
ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు… మన పూర్వీకుల శౌర్యానికి, పౌరుషానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ అనుభూతిని పొందాలంటే గండికోట డోమ్ షో చూడాల్సిందే!
గండికోట ఉత్సవాల్లో రెండోరోజు కూడా జనం జనం. ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు.