ఇటీవలే చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి సరదాగా విదేశాలకు వెళ్లారు. అది పూర్తిగా వారి వ్యక్తిగత పర్యటన. అయితే, చంద్రబాబు నాయుడు కనిపించడం లేదని, ఆ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని, చివరికి అధికారిక వర్గాలకు కూడా తెలియదా అంటూ వైకాపా నానా యాగీ చేసింది.
కానీ, ఈరోజు దావోస్ వంటి ప్రాంతాల్లో కూడా మన తెలుగు వారు, భారతీయులు దారి కాచి మరీ ఆయన్ను కలిశారు. ఇంట్లోని చిన్నారులతో సహా కుటుంబ సమేతంగా వచ్చి ఆయనతో ముచ్చటిస్తున్నారు.
ప్రపంచంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు జనం తండోపతండాలుగా వస్తున్నారు. తన కోసం అంత దూరం వచ్చినప్పుడు వారిని కలవకుండా వెళ్లలేని వ్యక్తిత్వం ఆయనది. జగన్ కుట్ర పన్ని తనను అరెస్టు చేసి జైలు పాలు చేసినప్పుడే ప్రపంచం ఆశ్చర్యపోయింది – దేశ విదేశాల్లో తమలా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఇంతమంది అభిమానులు ఉన్నారా అని!
ఫలానా చోటికి వెళ్తున్నానని చెప్పి, తన కుటుంబంతో కలిసి ఆయన ప్రపంచంలో ఎక్కడైనా ప్రశాంతంగా, సరదాగా, ఏకాంతంగా గడపగలరా?
మంచు శిఖరాల మధ్య మైనస్ డిగ్రీల చలిలో కూడా.. పసుపు రంగు దుస్తులతో మెరిసిపోయే ఈ ప్రజారిషికి అభిమానులు ‘భూమండలమందు అందుగలరు ఇందులేరు’ అని చెప్పగలమా?