రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు వస్తుంటే, చూసి ఓర్వలేక వైకాపా సోషల్ మీడియా బ్యాచ్ చేస్తున్న ప్రచారం వారి దివాళాకోరుతనానికి నిదర్శనం. “ఆర్‌ఎంజడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ కదా.. వారితో దావోస్‌లో ఐటీ ఒప్పందం ఏంటి?” అని అడుగుతున్న అజ్ఞానులారా.. కళ్ళు తెరిచి చూడండి!
ప్రపంచవ్యాప్తంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు సొంతంగా భవనాలు కట్టుకోవు. ఆర్‌ఎంజడ్వంటి ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజాలు’ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన GCC (Global Capability Center) పార్కులు, డేటా సెంటర్లు నిర్మిస్తేనే, ఆ భవనాల్లోకి ఐటీ కంపెనీలు వస్తాయి. బెంగళూరులో RMZ Ecoworld లేకపోతే వేల ఐటీ కంపెనీలు ఎక్కడ ఉండేవి? హైదరాబాద్‌లోని RMZ Skyview లేకపోతే లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చేవి? ఈ కనీస జ్ఞానం లేకుండా వాగడం మీకే చెల్లింది.
ఆర్‌ఎంజడ్ అంటే మీ ఊరి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకున్నారా? ఆర్‌ఎంజడ్ అనేది 10 బిలియన్ డాలర్ల (రూ. 84,000 కోట్లు) ఆస్తులను నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి సంస్థ. ఇది “Zero Debt” (అప్పులు లేని) కంపెనీ. కెనడా, జపాన్ దేశాల పెన్షన్ ఫండ్స్ వీరిలో పెట్టుబడులు పెట్టాయి. మీలాగా సూట్‌కేస్ కంపెనీలతోనో, గాలి కంపెనీలతోనో ఒప్పందాలు చేసుకునే రకం కాదు ఇది.
జగన్ హయాంలో గులకరాళ్లు, గంజాయి.. కూటమి హయాంలో ‘డేటా సెంటర్లు’, క్వాంటం వ్యాలీలు! గత ఐదేళ్లు ఏపీని గంజాయికి అడ్డాగా మార్చిన మీకు, డేటా సెంటర్ల గురించి, 1 గిగావాట్ పవర్ గురించి ఏం తెలుస్తుంది? విశాఖలో 10 మిలియన్ చదరపు అడుగుల ఐటీ స్పేస్ వస్తుంటే.. అక్కడ ‘పెయిడ్ బ్యాచ్’ ఉండదు, చదువుకున్న తెలివైన యువత ఉంటుంది. ఆ భయం మీలో స్పష్టంగా కనిపిస్తోంది.
బెంగళూరు కంపెనీ అయితే తప్పేంటి? బెంగళూరును ఐటీ హబ్‌గా మార్చిన సంస్థల్లో ఆర్‌ఎంజడ్ ఒకటి. అలాంటి సంస్థ ఏపీకి వస్తుంటే, ఆంధ్రా యువత బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేదని సంతోషించాలి. కానీ, మీకు రాష్ట్రం నాశనం అవ్వడమే కావాలి కదా!
ఇక్కడ జనం భూములు పందేరం చేసి, క్విడ్ ప్రో కో బెంగళూరు మంత్రి మాల్‌లో జగన్ కమర్షియల్ వాటాలు ఎలా కొట్టేశాడో సీబీఐ చార్జ్‌షీట్లు చదివి తెలుసుకోండి. అందరూ ఆ ‘420’ లెక్కన ఉండరు.
గుర్తుంచుకోండి: బెంగళూరులోని RMZ Ecoworld మరియు RMZ Infinity వంటి ఐటీ పార్కులు ఆసియాలోనే అత్యుత్తమమైనవి. ప్రపంచ స్థాయి Fortune 500 కంపెనీలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని RMZ Skyview మరియు RMZ Nexity వంటివి ప్రారంభమైన కొద్ది కాలంలోనే 100% ఆక్యుపెన్సీని సాధించాయి.
చివరి మాట: అజ్ఞానం ఉండొచ్చు కానీ అది అహంకారంగా మారకూడదు. “ఆర్‌ఎంజడ్ కి ఎంప్లాయిస్ లేరు” అని ఏడవడం అంటే.. “రైల్వే స్టేషన్ కట్టిన వాడికి రైళ్లు లేవు” అని వెక్కిరించినంత పిచ్చిగా ఉంది. ఇకనైనా మీ Nonsense Propaganda ఆపి, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతే కళ్ళు మూసుకోండి.. అంతేకానీ నోరు తెరిచి మీ అజ్ఞానాన్ని బయటపెట్టుకోకండి.
వాళ్లు ఒక నగరాన్ని, టెక్కీలను, వారు నిర్మించిన నిర్మాణాలను ఎలా ప్రమోట్ చేసి ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఎలా తీసుకు వస్తారో ఈ దృశ్యాలు చూడండి.
ప్రస్తుత ఏఐ, ప్రపంచ కల్లోల పరిస్థితులలో చాలా కంపెనీలు, వర్క్ ఫోర్స్, ఆఫీస్ స్పేస్ తగ్గించుకుని అద్దెలకు ఇస్తున్నాయి. ఏమీ లేని మన నగరాల్లో మనం జాగా చూపిస్తే.. వేలకోట్ల పెట్టుబడులతో భారీ నిర్మాణాలు చేసి, లక్షలాది ఉద్యోగాలు కల్పించడానికి ఆసక్తితో ముందుకు వస్తుంటే ఎందుకు పెడబొబ్బలు పెడుతున్నారు?