ఉక్కపోత వున్నట్లు ‘దావోస్ బాస్’ కాలర్ కొంచం వెనక్కు తీశాడు!
కొత్త యంగ్ బ్యాచ్ అంతా గొంతు వరకు జిప్ వేసుకున్నారు
ఆ దృశ్యం చూస్తుంటే.. అనుభవం ముందు వయసు కూడా తలవంచాల్సిందే అనిపిస్తుంది. చుట్టూ ఉన్న యంగ్ బ్యాచ్ అంతా స్విట్జర్లాండ్ గడ్డకట్టే చలికి భయపడి, గొంతు వరకు జిప్పులు వేసుకుని భారీ జాకెట్లలో కనిపిస్తుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం తన ట్రేడ్ మార్క్ పసుపు చొక్కాతో, ఎలాంటి స్వెటర్లు లేకుండా చాలా క్యాజువల్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
ఆ మంచు కొండల్లో స్వెటర్ లేకుండా ఎలా?
ప్రస్తుతం దావోస్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉన్నాయి. బయట అడుగుపెడితే ఎముకలు కొరికే చలి. కానీ, చంద్రబాబు గారు మాత్రం దశాబ్దాలుగా పాటిస్తున్న తన ‘డైట్ అండ్ డిసిప్లిన్’ వల్లే ఆ వాతావరణాన్ని తట్టుకోగలుగుతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఆయన ఫిట్‌నెస్ రహస్యం ఏమిటి?
75 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకు పోటీగా గంటల తరబడి సెషన్లలో పాల్గొనడం, గ్లోబల్ లీడర్లతో బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్‌లు నిర్వహించడం సామాన్యులకు సాధ్యం కాని పని. ఆయన ఫిట్‌నెస్ వెనుక కొన్ని కీలక సూత్రాలు ఉన్నాయి.
“నేను బతకడానికి తింటాను, తినడం కోసం బతకను” అని ఆయన తరచూ చెబుతుంటారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి, వ్యాయామంతో ఎన్ని కరుగుతున్నాయి అనేది ఆయన కచ్చితంగా లెక్కిస్తారు. ఉదయాన్నే జొన్న ఇడ్లీ లేదా ఓట్స్, మధ్యాహ్నం రాగి లేదా సజ్జ రొట్టెలు.. ఇలా పూర్తిగా పోషకాహారానికే ప్రాధాన్యత ఇస్తారు. చలి ఉన్నా, వాన ఉన్నా క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, ప్రాణాయామం ఆయన్ని మానసికంగా, శారీరకంగా అంత ధృడంగా ఉంచుతున్నాయి.
వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తూ, అమరావతి బ్రాండ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే కసి ఆయనలో కనిపిస్తోంది. యంగ్ లీడర్స్ అంతా చలికి వణుకుతుంటే, ఆయన మాత్రం తన విజన్‌తో వేడి పుట్టిస్తున్నారు.