కష్టాన్ని ఒక విధ్వంసం వచ్చి నీటిపాలుచేసినప్పుడు రాష్ట్రం కన్నీరు పెట్టింది!
రెట్టించిన కష్టంతో దాని తలరాత మార్చి, మరింత త్వరగా సాకారం చేస్తుంటే కలిగే ఆనందం వెలకట్టలేనిది!
ఏడు నెలల క్రితం.. జూన్ 17, 2024. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు నేరుగా పోలవరం వెళ్లారు. అక్కడ దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను, ఆగిపోయిన నిర్మాణాలను చూసి ఆయన కళ్లు చెమర్చాయి.
“నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు.. ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు” అని ఆయన ఆవేదన చెందినప్పుడు, యావత్ ఆంధ్రప్రదేశ్ గుండె తరుక్కుపోయింది. ఒక అద్భుత స్వప్నం చెదిరిపోయిందని అందరూ భయపడ్డారు.
కేవలం 7 నెలల స్వల్ప కాలంలోనే, తనదైన మార్కు పాలనతో, పట్టుదలతో చంద్రబాబు గారు పోలవరంలో ఆశాకిరణం వెలిగించారు. అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేస్తూ, విదేశీ నిపుణుల చేతనే శభాష్ అనిపించుకున్నారు.
హించ్‌బెర్గర్, డేవిడ్ బి పాల్, ఫ్రాంకో డి పిస్కో వంటి అంతర్జాతీయ నిపుణులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే చెప్పాలంటే:
గత పర్యటనకు, ఈ ఆరో పర్యటనకు మధ్య ఎంతో పురోగతి కనిపిస్తోంది. గడిచిన మూడు నెలల్లో ప్రాజెక్టు పనులు పరుగులు తీశాయి.2026 జూన్ వరకు డయాఫ్రం వాల్ పూర్తి చేయలేమని అప్పట్లో బావర్ కంపెనీ చెప్పింది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి నాటికే డయాఫ్రం వాల్ పూర్తి కాబోతుండటం మీ పనితీరుకు నిదర్శనం అని ప్రశంసించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యడానికి డిసెంబర్ 2027 వరకు అనుకున్న గడువును, పనుల వేగం చూసి జూన్ 2027కే మార్చుకోవడం మరో విశేషం.
ఒకప్పుడు “ఏం చేయాలో అర్థం కావడం లేదు” అని నిర్వేదం చెందిన చోటే, నేడు ఆకృతులకు ఆమోదం లభించి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రధాన డ్యాంలో వాడుతున్న మెటీరియల్ నాణ్యత బాగుందని నిపుణులు సర్టిఫికేట్ ఇచ్చారు.
ఇది కేవలం ఒక ప్రాజెక్టు నిర్మాణం మాత్రమే కాదు.. ఒక నాయకుడి పట్టుదలకు, రాష్ట్ర భవిష్యత్తుపై ఆయనకున్న మమకారానికి నిదర్శనం. నాయుడు పర్యవేక్షణలో పోలవరం మళ్లీ గాడిలో పడింది. “నమ్మకం కలిగితే.. కొండనైనా కదిలించవచ్చు” అని ఆయన మరోసారి నిరూపించారు.
తెలుగు జాతి జీవనాడి పోలవరం.. ఇక స్వప్నం కాదు, పోలవారం నాయుడి సాకారాన్ని సువర్ణ అక్షరాలతో రాసుకోబోయే వాస్తవం!
నాయకుడు తలచుకుంటే నది గమ్యం మారుతుంది.. పట్టుదల తోడైతే ప్రాజెక్టు కల సాకారమవుతుంది. 2027 జూన్ నాటికి తెలుగు జాతి జీవనాడి పోలవరం సిద్ధం అవుతోంది. సంబరాలకు సిద్దంగా వుండండి. ఎందుకంటే ఇది దశాబ్దాల ఆంధ్రుని కల!