– మిగతా వారికి చట్టం వర్తిస్తుందా?
– కేసీఆర్ సచివాలయం వెళ్లట్లేదు అన్నారు.. ఇప్పుడు మీరు వెళ్తున్నారా?
– సినిమా వాళ్ళు ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ పని చెబుతారు
– ప్రభాస్ సినిమా కి టికెట్ ధర పెంచడానికి సమయం లేదట
– రేవంత్ పాలనపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఫైర్
హైదరాబాద్: నా 35 సంవత్సరాల జీవితం లో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. రాష్ట్రంలో విచిత్రమైన ప్రభుత్వం ఉంది. రేవంత్ కి అతి చిన్న వయస్సు లో ముఖ్యమంత్రి గా అవకాశం వచ్చింది. ప్రజలకు మంచి చేయాలి. అలా కాకుండా రాష్ట్రంలో విచిత్ర పాలన ఉంది. తుగ్లక్ రాజ్యం లో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన లోని అవినీతి బయటికి తీస్తే, ఎవరు బయట ఉండే వాళ్లు కాదు. మంత్రుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సయోధ్య లేదు. బొగ్గు కి సంబంధించిన ఆధారాలు హరీష్ రావు బయట పెట్టగానే సిట్ నోటీసులు ఇచ్చారు.
ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఉండదు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టైనా కట్టారా? మేము చేసినవి ప్రారంభిస్తున్నారు తప్ప? సమ్మక్క సారక్క జాతర అభివృద్ధి లో ఇంచార్జ్ మంత్రికి- లోకల్ మంత్రులకు గొడవ. పాలనను గాలికొదిలి ప్రతిపక్ష పార్టీ పై దృష్టి పెడితే మీరే నష్టపోతారు. కేసీఆర్ సచివాలయం వెళ్లట్లేదు అన్నారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారా? కమాండ్ కంట్రోల్ కట్టిన పర్పస్ కాకుండా ఇష్టం వచ్చిన విధంగా వాడుకుంటున్నారు.
ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ నాయకులకు సంబంధం ఉండదు. అధికారుల చేతిలో ఉంటుంది. వాళ్ళు ఏ ముఖ్యమంత్రి, మంత్రులకు చెబుతారు? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం పైగా సీట్లు గెలుచుకున్నాం. 42 శాతం రిజర్వేషన్ లు ఇస్తామని ఇవ్వకుండా బీసీలను మోసం చేశారు. పరిపాలన మంచిగా ఉంటేనే ప్రభుత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. పండుగ లకు సరుకులు తెచ్చుకోవడానికి పేదల దగ్గర డబ్బులు ఉండటం లేదు. కేసీఆర్ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఫోర్త్ సిటీ భూమి ఎక్కడ ది? అది ఫార్మా కోసం మాత్రమే వాడాలి. లేదంటే ఆభూమి తిరిగి ఆ రైతులకే ఇవ్వాలి. హిల్ట్ పాలసీ తో దోపిడి కి శ్రీకారం చుట్టారు. చేప పిల్లకు ఈత నేర్పినట్లు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం లో సంతోషంగా ఉన్నారా? లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో సంతోషంగా ఉన్నారా అనేది ప్రజల వద్ద కి వెళ్తే తెలుస్తుంది.
కేటీఆర్, హరీష్ రావు నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికే నష్టం. మీలా పారిపోయే వాళ్ళం కాదు. ఏ విచారణ కి అయిన మేము సహకరిస్తాం. పదేళ్లలో మీలా మేము ఉంటే మీరు అధికారంలోకి వచ్చే వా రా? మీరు ఏమి అభివృద్ధి చేసినం అని చెప్పే సమయం లో కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడూ పోతది అని ప్రజలు చూస్తున్నారు. ముఖ్యమంత్రి పై ఏదో ఆవేశంలో అన్న మాటకు నాపై కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి కి చట్టం వర్తించదా? మిగతా వారికి చట్టం వర్తిస్తుందా? రేవంత్ ప్రభుత్వం లో ఫోన్ ట్యాప్ కావడం లేదని ఒక్క మంత్రి, ఎమ్మెల్యే చెప్పండి.
కేంద్ర ప్రభుత్వం లో అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు.
ఎన్టీవీ జర్నలిస్ట్ లను అరెస్ట్ చేసిన రోజు నేను కమాండ్ కంట్రోల్ కి వెళ్తే హాలిడే అన్నారు. పోలీసు లకు హాలిడే ఉంటదనీ ఆ రోజే తెలిసింది. ఓ పత్రిక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పై వార్త వేస్తే ఎందుకు సిట్ వేయలేదు? ప్రజలు అందరు కుండ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా వాళ్ళు ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ పని చెబుతారు. ప్రభాస్ సినిమా కి టికెట్ ధర పెంచడానికి సమయం లేదట. మంత్రికి తెలియకుండా టికెట్ ధరలు పెంచారు. దావోస్ పర్యటన పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. అవి రావు.