మన మిథున్ రెడ్డి గారి సెలక్షన్ మాత్రం అద్భుతం! రాష్ట్ర స్థాయి ఏసీబీ విచారణ అంటే ఆయనకు అకస్మాత్తుగా “దేశభక్తి”, “పార్లమెంటరీ బాధ్యతలు” గుర్తొచ్చేస్తాయి.
1. ఏసీబీ కోర్టులో ‘బిజీ’ షెడ్యూల్:
రిపబ్లిక్ డే గౌరవం: జనవరి 26న ఢిల్లీలో జెండా చూడాలి (లేకపోతే దేశం ఏమైపోతుందో అన్నంత కంగారు!).
స్టాండింగ్ కమిటీ మీటింగ్: దేశ భవిష్యత్తును నిర్ణయించే మీటింగ్‌లు ఉన్నాయి; ఈలోపు ఈ చిన్న చిన్న కేసుల కోసం సిట్ (SIT) ముందు హాజరైతే ఎలా? అందుకే కోర్టును అడిగి మరీ “మినహాయింపు” తెచ్చుకున్నారు.
2. ఈడీ దగ్గర ‘డిసిప్లిన్’: చిత్రం ఏమిటంటే, అదే మిథున్ రెడ్డి గారు హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసులో మాత్రం ఏడు గంటల పాటు చాలా ఓపిగ్గా కూర్చున్నారు. ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలు గుర్తుకు రాలేదు, స్టాండింగ్ కమిటీలు అడ్డు రాలేదు. బహుశా “ఢిల్లీ” సంస్థ అంటే ఉండే ఆ భయం… సారీ, ఆ గౌరవం అలాంటిది మరి!
విజయసాయి vs మిథున్: మౌనం వెనుక మర్మం! నిన్న విజయసాయి రెడ్డి గారు ఈడీ విచారణ తర్వాత మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో మాట్లాడారు. కానీ మిథున్ రెడ్డి గారు మాత్రం “సైలెంట్ మోడ్” లోకి వెళ్ళిపోయారు.
విజయసాయి స్టైల్: “వచ్చాను, చూశాను, విచారణకు సహకరించాను. పాదయాత్ర చేసినా జగన్‌కు అధికారం దక్కదు” అని ఫెడేల్మని కెమెరాల ముందు చెప్పడం.
మిథున్ రెడ్డి లాజిక్: “కోర్టు ఆదేశాలు ఉన్నాయి, నేను మాట్లాడలేను” అని నెమ్మదిగా జారిపోవడం.
ముగింపు: ఏసీబీ విచారణకు వెళ్ళడానికి పార్లమెంట్ పనులు అడ్డు వస్తాయి కానీ, ఈడీ విచారణకు వెళ్ళడానికి మాత్రం క్యాలెండర్ ఖాళీగానే ఉంటుంది! అసలు మద్యం స్కామ్ అంటేనే కిక్కు… అందులోనూ ఈడీ విచారణ అంటే ఆ కిక్కు మామూలుగా ఉండదు కదా!
మొత్తానికి మన నేతలు “లోకల్ అంటే చులకన – సెంట్రల్ అంటే జీహుజూర్” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.