– ఒకరిది సామ్యవాదం.. మరొకరిది భౌతికవాదం
( రాంపల్లి మల్లికార్జున )
ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం నిజంగానే ఒక విప్లవాన్ని సృష్టించింది. ఆ సమయంలోనే పాశ్చ్యాత్య దేశాలలో జాతీయ భావాలు బలపడి జాతీయ రాజ్యాలు ఏర్పడుతున్నయీ అదే సమయంలో భారతదేశంలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ చైతన్యం క్రమంగా బలం పుంజుకుంటున్నది .
ఆ సమయంలో అలా ఎక్కడ చూసినా జాతీయభావాలు బలంగా వేళ్ళు ను కుంటున్నాయి ఆ సమయంలో ప్రపంచంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు జన్మించారు . 19వ శతాబ్దం తొలి రోజుల్లో 1818 సంవత్సరం లో పాశ్చాత్య దేశాలలో కారల్ మార్క్స్ జన్మించడం. 19వ శతాబ్దం మధ్యలో ప్రాచ్య దేశమైన భారత్ లో 1863 సంవత్సరంలో వివేకానందుడిగా ప్రసిద్ధి పొందిన నరేంద్రుడు జన్మించారు.
అందులో ఒకరు మానవ చరిత్రను గతి తార్కిక భౌతిక వాద పద్ధతిలో వ్యాఖ్యానించే భావి నాగరికతను విప్లవాత్మకంగా చేసేందుకు ప్రయత్నించడం, మరొకరు భౌతిక వాద నాగరికత ఉత్థాన పతనాలను పరిశీలించి పశ్చిమ మతవ్యవస్థలను హేతుబద్ధమైన చైతన్య శీలమైన తిరుగులేని వేదాంత పు తర్కంలో విప్లవీకరించాడు.
మార్క్స్ తన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లో పాశ్చాత్య ప్రపంచపు కల్లోలలోకి దూసుకుని వెళ్తే శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచంలో మాకు తిరుగులేదు. అలాగే ప్రపంచంలో క్రైస్తవానికితిరుగులేదని నిరూపించుకునేందుకు 1893 సంవత్సరంలో చికాగో లో ప్రపంచ మతమహాసమ్మేళనం అమెరికా ఏర్పాటు చేస్తే దానిలో కి దూసుకుని వెళ్లి భారతీయ వేదాంతం ఆధ్యాత్మిక జ్ఞానానికి తిరుగు లేదని నిరూపించాడు స్వామి వివేకానందుడు.
ఇరువురి ప్రయత్నాలు ప్రపంచాన్ని కుదిపేశాయి ఆ భావ జాలాలు ఈ రోజున కూడా కనపడతాయి . మార్క్స్ భౌతిక వాదంపై వివేకానందుని ఆధ్యాత్మికత వేదాంతం క్రమంగా ప్రపంచ స్థితిగతులను మార్చి వేస్తున్నది. మనిషి దోపిడీకి గురికావడానికి దాస్యం లోకి నెట్టబడటానికి ఆర్థిక వ్యవహారాలే కీలకమనికారల్ మార్క్స్ నొక్కి చెప్పాడు. వివేకానందుడు ఏ విప్లవానికైనా మానవుని నైతిక ధార్మిక ప్రవర్తనే కీలకమని చెప్పాడు.
విలువల దార్శనికతలో సమాజంలో ఉన్నత స్థితికి తీసుకుని పోలేక పోతే భౌతిక సంపద తెచ్చిపెట్టిన ప్రగతి పతనం వైపే దారితీస్తుంది అని చెప్పాడు. ఆధ్యాత్మిక శక్తి సంపద లేకపోతే భౌతిక సంపద తెచ్చిపెట్టిన ప్రగతి పతనం వైపు దారితీస్తుంది ఆధ్యాత్మిక శక్తి సంపద లేకపోతే మతం కూడా అంధకారం అయిపోతుంది.
అందుకే భౌతిక వాదానికిఆద్యాత్మికత లేకపోతే మతం కూడా అంధకారమైపోతుంది అందుకే భౌతిక వాదానికి కొనసాగింపుగా ఆధ్యాత్మికత అనేది ఎంతో అవసరం అని స్వామి వివేకానంద భావించాడు.
వివేకానంద జన్మించిన కాలమాన పరిస్థితులు
భౌతిక వాదం విస్తరిస్తూ వెర్రితలలు వేస్తున్న సమయంలో, శతాబ్దాలుగా చెలరేగుతున్న మతోన్మాదం ఒక ప్రక్క, మరో ప్రక్క సామ్రాజ్యవాదం అటు పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి ఇటు కమ్యూనిస్టు వ్యవస్థ నుండి పెరుగుతున్న సమయంలో జన్మించిన స్వామి వివేకానందుడు తన ఆధ్యాత్మిక జ్ఞానంతో మానవ నాగరికత వికాసానికి సాంస్కృతిక జాతీయత కి బీజం నాటాడు. ఆ బీజం ఈ రోజున ఒక ఫల రూపంలో ప్రపంచమంతుట కనపడుతున్నది.
ఆధ్యాత్మికత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. మాకు మతం వద్దు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలని కోరుకునే వారి సంఖ్య ఈ రోజున ప్రపంచంలో పెరుగుతొంది . భారతదేశంలో వేల సంవత్సరాల నుండి ఒక మనిషి జీవితానికి లక్ష్యం చతుర్విధ పురుషోర్ధాలుగా చెప్పారు. అవే ధర్మం అర్థం కామం మోక్షం భౌతిక సుఖాలు సంపదలు వద్దు అని చెప్పలేదు అక్కడే మునకలు వేయకుండా సత్యాన్వేషణలో మోక్ష సాధనకు కృషి చేయాలని చెప్పారు.
ఈ క్రమంలో ఆలోచిస్తే కారల్ మార్క్స్ ఆర్థిక వ్యవస్థ రాజ్య వ్యవస్థ చేసే దోపిడీకి ఎదురు తిరిగి పోరాడాలని చెప్పాడు. కార్మిక నియంతృత్వం గురించి చెప్పాడు. మనిషి జీవిత సమగ్రత గురించి చెప్పలేకపోయాడు. ఆయన చెప్పిన విషయాలు ఆయన కాలంలోనే వక్రీకరణకు గురికావడం చూసి ఎంతో బాధ పడ్డాడు.
1870 సంవత్సరం చివరిలో అనేకసార్లు నేను మార్క్స్ ని కానీ మార్క్సిస్టు కాను అని చెప్పాడు. ఈ సమయంలో ఈ ఆలోచన నుండి పిడివాడులు తయారు కావటం బహుశా మార్క్స్ ని కదిలించి ఉంటుంది. అంటే తాను ప్రతిపాదించిన సిద్ధాంతము తన కాలంలోనే వక్రీకరణకు గురికావడం కారల్ మార్క్స్ చూశాడు.
అదే స్వామి వివేకానందుడు తన జీవితం చివరి రోజున ఈ ప్రపంచానికి వివేకా నందుడు ఏమి ఇచ్చాడు ఏమి పని చేశాడు అర్థం చేసుకోవటానికి మరో వివే స్వగతం గా పెద్దగా అనేశారు.కానంద ఉండవలసి ఉంటుంది అంటూనే రాబోవు రోజుల్లో అనేకమంది వివేకానంద లు జన్మిస్తారని
ప్రపంచాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో భారత్ ముంచెత్తాలి
కారల్ మార్క్స్ సిద్ధాంతం తో పాశ్చాత్య దేశాలలో వస్తున్న విపరిణామాలపై విశ్లేషణ చేస్తూ ఆ పరిణామాల వల్ల దానిపై జరిగే పోరాటం వల్ల వచ్చే పరిస్థితులనుండి ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకొని వెళ్లడానికి వివేకానందుడు తన ఆధ్యాత్మిక జ్ఞానంతో వేదాంతంతో ప్రపంచాన్ని చైతన్యవంతం చేయటానికి తన వంతు పాత్రను పోషించారు.
అంతేకాదు ప్రపంచం ఆధ్యాత్మిక జ్ఞానంతో ముంచేత్తటానికి భారత్ సిద్ధం కావాలని ఈ దేశ యువకులకు ఉద్భోధించాడు. ప్రపంచ మత మహాసమ్మేళనం తర్వాత ఈ దేశమంతా తూఫాన్ పర్యటన చేశాడు తన భావజాలంలో ఈ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. స్వామి వివేకానంద వారసత్వం అనే గ్రంథంలో స్వామి తపస్యానంద ‘’ అభివృద్ధి చెందినదిగా చెప్పబడుతున్న చాలా దేశాలలో జీవనశైలిలో వస్తున్న మార్పులు సుఖాల కోసం వెంపర్లాడటం వివేకానందుడు ఆమోదించలేదు.
ఆరోగ్యకరమైన సంతృప్తికరమైన జీవితం గడపటానికి కావలసిన కనీస సౌకర్యాలు అందరికీ సమకూరాలని అదే మనిషికి ఆధ్యాత్మిక సాధనకు కావలసిన వెసులుబాటు కలిగిస్తుందని మానసిక శక్తిని అందిస్తుందని వివేకానందుడు భావించాడు . అత్యధిక సంపదల వల్ల కలిగే భోగాల వల్ల గాని తీవ్ర దారిద్రం వల్ల కలిగే దైన్యం గాని లేని స్థితిలో క్షణికమైన ప్రాపంచిక సుఖ ప్రలోభల పట్ల వైరాగ్యం నిస్సంగత్వం జనిస్తాయి.
సామాజికంగా ఆర్థికంగా మద్యస్థ స్థితి వల్ల జనించే వైరాగ్యం కు ఆధ్యాత్మిక సాధనకు ప్రేరేపించగలిగే ప్రభావశీలులైన వ్యక్తులు భారతదేశంలో తయారు కావాలని అటువంటి వ్యక్తులు భారతదేశ సందేశాన్ని ప్రపంచానికి అందించగలుగుతారని చెప్పారు.
స్వామి వివేకానంద. ప్రగాఢమైన దేశభక్తి ఈ దేశం యొక్క జన సామాన్య సముద్ధరణపై ఆయన పడిన తపనలో మౌలికమైన ఆకాంక్షలను గ్రహించకుండా ఆయనను దేశభక్తిడిగానో స్వాతంత్ర యోధునిగానో మాయా ముసుగు ధరించిన కమ్యూనిస్టు మేధావి గానో భావిస్తూ వారి గురించి అపోహలు సృష్టించిన వారు కూడా ఉన్నారు.
సామ్యవాదం –వివేకానంద, మార్క్స్
వివేకానందుడు సామ్యవాదే కానీ మార్క్స్ లాగా భౌతిక వాది కాదు
ఈ దేశంలో సామ్యవాద భావజాలం వికాసంలో వివేకానందుని ప్రాముఖ్యతను మొట్టమొదటిగా గుర్తించిన వారు కే దామోదరం అనే భారతీయ కమ్యూనిస్టు మేధావి. ‘’ఇండియన్ థాట్’’ అనే పుస్తకంలో రష్యాలో సామ్రాజ్యవాద విప్లవం రావడానికి రెండు దశాబ్దాలు ముందే వివేకానందుడు సామ్యవాద నినాదాన్ని లేవనెత్తాడు నవతరానికి ఆయన గొప్ప స్ఫూర్తి దాయకుడు అని అనటంలో ఆశ్చర్యం లేదు అని వివరించాడు.
స్వామి వివేకానంద వ్యక్తిత్వాన్ని ఆయన సందేశాన్ని సామ్యవాద దేశాలు కూడా ప్రస్తుతించయి . రష్యా చైనాలో స్వామి వివేకానంద 120 (1983) వ జయింతి అధికారపూర్వకంగా నిర్వహించబడింది. అదే సమయంలో కారల్ మార్క్స్ నూరవ(100) వర్ధంతి కూడా యాదృచ్ఛికంగా వచ్చింది. వివేకానంద ఆదర్శాలను ప్రస్తుతిస్తూ రష్యా చైనాలో అనేక పుస్తకాలు కూడా వచ్చాయి.
చైనా దేశ ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొఫెసర్ వన్ జోక్ సువాన్ ఆధునిక చైనాలో వివేకానందుడు భారతీయ వేదాంతిగా అత్యంత ప్రఖ్యాతుడు. వివేకానందుడు చైనా సంస్కృతి ప్రాచీన సంస్కృతిగా గుర్తించి మా దేశ ప్రజలను ప్రేమించాడు. ఆయనకు మేము సగౌరవంగా అంజలి ఘటిస్తున్నామని ‘’భారతీయ వేదాంతo స్వామి వివేకానంద’’ అనే పుస్తకంలో వివరించాడు.
సామాజిక పరివర్తన ఇంజన్ కు తగిన ఇంధనం కావాలి ఆ ఇంధనమే వేదాంతమని వివేకానందునికి స్పష్టమైన కల్పన ఉంది. వివేకానందని సామాజిక చింతనలో మరో స్పష్టత’’ జాతీయ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థానంలో ఉన్న వారిని పడగొట్టడం కాదు. దిగువున ఉన్న వారిని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళటం’’ సామ్యవాద భావజాలం గురించి వివేకానందనుకి ఆ స్పష్టత ఉన్నది.
అభివృద్ధికి అవసరమైన ఒకే ఒక నియమం స్వేచ్ఛ దానిని తొలగిస్తే కలిగే ఫలితం క్షీణించటం ఈ ఆలోచనలో వ్యక్తుల నిర్మాణం ఎదుగుదల ఎంతో అవసరమని వివేకానంద చెప్పకనే చెప్పాడు. మార్క్స్ మాత్రం భారమంత టిని కేంద్రీకృత సమాజం పైన సామూహిక జీవనం పైన ఉంచాడు. మార్క్స్ కు భౌతికవాదం మూలాధారము, వివేకానందునికి సత్య సిద్ధాంతమైన వేదాంతం ముఖ్యమైనది ‘’తత్వమసి’’ అనే మహా వాక్యంలో అద్వైత సిద్ధాంత సారమున్నది.
అందుకే వివేకానందుడు ఈ దేశం బాగుపడాలంటే జన సామాన్యంను జాగృత పరచాలని చెప్పాడు. మన జాతి చేసిన అతి పెద్ద పాపం సామాన్య జనాన్ని నిర్లక్ష్యం చేయటం ఆ జన సామాన్యులను ఎదగనిస్తే ఈ సమాజం బాగుపడుతుంది.వాళ్లకు సకారాత్మకమైన విద్యను అందిస్తూ వాళ్లను జాగృతం చేయటం మనందరి కర్తవ్యం అని వివేకానందులు చెప్పారు . అందుకే దరిద్ర దేవోభవ అని చెప్పారు ఈ ఈ నూతన ఆలోచనలు ఈ దేశంలో గొప్ప పరివర్తనకు నాంది పలికాయని అని చెప్పవచ్చు.
జాతీయత – మార్క్స్ ,వివేకానందుడు
జాతీయత విషయంలో మార్క్స్ వివేకానంద లభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 19వ శతాబ్దంలో ప్రపంచమంతటా జాతీయ భావాలు ఉప్పొంగుతున్న కాలం . ఐరోపా ఖండంలోని వివిధ దేశాలలో జాతీయత , జాతీయ భావాలు బలపడి రాజ్య వ్యవస్థ కూడా ఏర్పడింది. భారతదేశంలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి దోపిడీ అణిచివేతకు వ్యతిరేకంగా జాతీయ చైతన్యం నిర్మాణం అయింది.
ఆ కాలంలో మార్క్స్ మాత్రం జాతీయత భావం పై అంతగా దృష్టి పెట్టలేదు బహుశా తాను భావోద్వేగా దృక్పథం జోలికి పోకుండా ఆర్థిక దృక్కోణానికి పరిమితం కావాలనుకొని మార్క్స్ జాతీయవాద భావాలను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయాడని చెప్పవచ్చు. 19వ శతాబ్దద్వితీయా ర్ధం లో ఆ పిమ్మట ప్రపంచమంతా అనేక చోట్ల జాతీయవాదం ఒక సిద్ధాంతం గా సామ్యవాదం తో పోటీపడి తన ఆధిక్యతను విరూపించుకుంది.
ఆర్థిక శక్తులు ఆడే ఆట నుంచి జాతుల పుట్టుక ను వెతికి పట్టుకోవాల్సిందని మార్క్స్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో వివేకానందుని భావాలు ఆలోచనలు, చాలా భిన్నంగా ఉన్నాయి. వివేకానందుడు సాంస్కృతిక జాతీయత కి చాలా పెద్దపీట వేశాడు. జాతీయతకు సంస్కృతే ఆధారం.
ప్రపంచంలో ప్రతి దేశం పుడుతుంది కానీ పుట్టించబడదు ప్రతి దేశం ఒక లక్ష్యాన్ని నెరవేర్చటానికి దైవ సంకల్పంతో జన్మిస్తుంది అని చెప్పారు.
ప్రకృతి నియమాన్ని అనుసరించి ఆ దేశంలో జన్మించిన శ్రేష్టులైన మహాపురుషుల జీవనం ప్రేరణగా తను జాతీయ లక్ష్యాలు సాధిస్తూ ఉంటారు.
జాతి యొక్క ప్రధాన లక్ష్యం దెబ్బతిన్నప్పుడు ఆ జాతి అంతరించిపోతుంది. భారతదేశం యొక్క ప్రధాన లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు బలంగా పనిచేస్తున్నాయి. భౌతిక వాద భావజాలంలో దేశ ప్రజల బుర్రల ను క్షాళన చేసి వారికి దేవుని పైన ఆత్మ పైన ఉత్తర గతుల పైన నమ్మకాలను ధ్వంసం చేయడానికి వర్గ పోరాటం పేరుతో కార్మిక వర్గ నియంతృత్వం పేరుతో హింసాత్మక చర్యలకు దేశ విద్రోహకర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి శక్తులు పట్ల అప్రమత్తంగా ఉండి జాతీయ ఐక్యతను కాపాడుకోవాలని వివేకానందుడు పదేపదేచెప్పేవారు .
హిందుత్వం- మార్క్స్, వివేకానంద
భారతీయుడు అనే అర్థంలో హిందువులని భారతదేశం అనే అర్థంలో హిందుస్థాన్ అని కారల్ మార్క్స్ మాట్లాడుతూ ఉండేవాడు. భారతదేశంలో ఏ మతానికి చెందినవాడేనా అందరూ హిందువులేనని ఒకవేళ మతాలు వేరువేరుగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు హిందువులు ముస్లింలు అని చెప్పేవారు.
భారత దేశస్తులను ఉమ్మడి గా చెప్పవలసి వచ్చినప్పుడు హిందువులు అనే పదం వాడేవారు. ఈ దేశం యొక్క స్వాతంత్రం చాలావరకు హిందువుల పైనే హిందువుల ఐక్యత పైనే ఆధారపడి ఉందని ఒక సందర్భంలో మార్క్స్ అన్నారు . భారతీయులు తమ మధ్య బ్రిటిష్ నూతన సామాజిక శక్తుల ప్రయోజనాన్ని పొందాలంటే అది ఘనత వహించిన బ్రిటన్ కు కొత్త పాలకవర్గాల స్థానంలో పారిశ్రామిక వర్గాలు వచ్చేవరకు వేచి ఉండాలి.
లేదా హిందువులు బలపడి ఆంగ్లేయుల పెత్తనాన్ని ఏక మొత్తంగా తొలగించి స్వతంత్రులు కావాలి. ఉన్నతమైన ఆసక్తికరమైన భారతదేశం యొక్క పునరుజ్జివనం సమీప భవిష్యత్తులో చూడగలం. సాధు స్వభావులైన ఆ దేశ ప్రజలలో నిమ్న వర్గాలు కూడా ఇటు ఇటాలియన్ల కన్నా సూక్ష్మ బుద్ధులు చురుకైనవారు . వాళ్ళ విధేయత కూడా ప్రశాంతమైన ఔన్నత్యంతో కూడుకొని ఉంటుంది.
సహజంగా మందకొడి తనం ఉన్నప్పటికీ వాళ్లు తమ సాహస పరాక్రమాల ద్వారా బ్రిటిష్ అధికారులను నివ్వెరపరచారని మార్క్స్ వివరించాడు . హిందుత్వంపై స్వామి వివేకానంద ‘’గర్వ సే కహో హమ్ హిందూ హై’’ అని చెప్పాడు. అంటే నేను హిందువునని గర్వంగా చెబితే వేల సంవత్సరాల మనచరిత్ర మన మహా పురుషుల పరంపర చరిత్ర సంస్కృతి మనకు గుర్తుకు వస్తాయి. హిందుత్వాన్ని సమరశీలంగా చేయటమే నా జీవన లక్ష్యం అని చెప్పారు.
సనాతన ధర్మం పాటించబడాలి అని చెప్పేవారు. ప్రస్తుతం మనకు ముంచుకుని అతి పెద్ద ముప్పు ఇతర మతాలవాళ్ళు హిందువులను మతం మార్చటం దానివల్ల హిందువుల సంఖ్య క్షీణించబడుతున్నది చాలావరకు దానికి మన చట్టాలు కూడా దోహదం చేస్తున్నాయి. మన మొదటి తక్షణ కర్తవ్యం మతం మార్పిడులు ఆగిపోయేటట్లు చేయటం. హిందూ ధర్మంలోకి తిరిగి రాదలచు కొన్న వారిని గౌరవంగా స్వాగతించాలి . మన పొరపాటులను సరిచేసుకొని ఒక నూతన శక్తిని నిర్మాణం చేయాలి అని వివేకానంద చెప్పేవారు. వ్యక్తి నిర్మాణమే సాంస్కృతిక జాతీయతకుపునాది అని చెప్పాడు.
ముగింపు: స్వామి వివేకానందుడు హిందూ సమాజ పునరుజ్జీవననికి సాంస్కృతిక జాతీయతను శక్తివంతం చేయడము హిందూ సమాజం సామాజికంగా శక్తివంతంగా ఉండటానికి కృషి చేసేవారు. వివేకానందుడు ఒక ఆధ్యాత్మికవేత్త ఒక దార్శనికుడు ఒక సామాజిక పరివర్తకుడు.
వివేకానంద భావజాలంలో సాగుతున్న జాతీయ పునర్ నిర్మాణ కార్యంలో మనమందరం పాల్గొని వివేకానందుడుకలలు కన్నాభారతాన్నిసాకారం చేద్దాము ఆ సంకల్పమే ఈ జాతికి శ్రీరామరక్ష.
గడిచిన వంద సంవత్సరాలకు పైగా కమ్యూనిజం ,పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచాన్ని ఎలా శాసించారో చరిత్రలో చూస్తున్నాము. అయితే అంతిమంగా ఆధ్యాత్మిక విప్లవమే ప్రపంచ శాంతికి మూలం.